Samantha: మా ఇంటి బంగారం అంటూ మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెడీ అయిపోయింది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సమంతకు ప్రపోజ్

మా ఇంటి బంగారం ట్రైలర్ సోమవారం (మే 25) రిలీజ్ అయింది. ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్టేజీపై సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ దూసుకొచ్చాడు. మోకాళ్లపై కూర్చుని సమంతకు పువ్వులతో ప్రపోజ్ చేశాడు. అది చూసి రాజ్ నిడిమోరు మాట్లాడటం ఆపేశాడు. పక్కనే ఉన్న శ్రీముఖి, డైరెక్టర్ నందిని రెడ్డి కూడా కంగారు పడ్డారు.
ఫ్యాన్ తో సెల్ఫీ
స్టేజీ పైకి ఒక్కసారిగా ఫ్యాన్ దూసుకురావడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతణ్ని తీసుకెళ్లాలని చూశారు. కానీ ఆ అభిమాని ఒక్క సెల్ఫీ అడగడంతో సమంత ఓకే అని చెప్పింది. ఆ ఫ్యాన్ తో సెల్ఫీ దిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మనసు కూడా బంగారం
సమంత సినిమా టైటిలే కాదు మనసు కూడా బంగారం అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. స్టేజీపైకి వచ్చిన అభిమానితో నవ్వుతూ మాట్లాడిన సమంత.. సెల్ఫీ కూడా ఇవ్వడం ఎంతో స్పెషల్ అని అంటున్నారు. ఇక ఇదే ఈవెంట్లో ఓ వయసు పైబడ్డ బామ్మతోనూ సమంత ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది.
మా ఇంటి బంగారం
{{/usCountry}}సమంత సినిమా టైటిలే కాదు మనసు కూడా బంగారం అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. స్టేజీపైకి వచ్చిన అభిమానితో నవ్వుతూ మాట్లాడిన సమంత.. సెల్ఫీ కూడా ఇవ్వడం ఎంతో స్పెషల్ అని అంటున్నారు. ఇక ఇదే ఈవెంట్లో ఓ వయసు పైబడ్డ బామ్మతోనూ సమంత ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది.
మా ఇంటి బంగారం
{{/usCountry}}ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. కానీ కొంతకాలంగా డైరెక్ట్ గా తెలుగు మూవీలో లీడ్ రోల్ ప్లే చేయలేదు. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్ ను మరోసారి అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని సమంత చూస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్టర్.
రిలీజ్ డేట్
సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది. ఫస్ట్ ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. ఐపీఎల్ 2026 కారణంగా ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.