Akhil: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) సరికొత్త లుక్ అండ్ ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న తాజా చిత్రం 'లెనిన్' (Lenin). ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ కు ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టడం, భాగ్యశ్రీ ఆట పట్టించడం హైలైట్ గా నిలిచింది.
నాగ అఖిల్ గా

లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అఖిల్ కు కొత్త పేరు పెట్టారు. నాగ అఖిల్ అని పిలిచారు. అదే నేమ్ కంటిన్యూ చేయాలని కోరారు. ఈ ఈవెంట్‌లో అఖిల్ స్టేజ్ పైకి రాగానే ఫ్యాన్స్ ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇచ్చారు. అప్పటివరకు 'అయ్యగారు' అంటూ స్లోగన్స్ ఇచ్చిన అభిమానులు, ఈసారి సరికొత్తగా 'నాగ అఖిల్' (Naga Akhil) అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
సెంటిమెంట్ కలిసొచ్చేనా?
అక్కినేని నట మూల పురుషుడు లెజెండ్రీ ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వరరావు), కింగ్ నాగార్జునల పేర్లలోని సెంటిమెంట్‌ను కలుపుతూ అఖిల్‌ను ఇకపై 'నాగ అఖిల్' అని పిలుచుకుంటామని ఫ్యాన్స్ ప్రకటించారు. ఈ కొత్త పేరు వినగానే అఖిల్ సైతం ఎమోషనల్ అవుతూ అభిమానులకు చేతులెత్తి మొక్కుతూ ధన్యవాదాలు తెలిపాడు.
అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ఇలా అందరి పేర్లలో నాగ ఉంది. కానీ అఖిల్ పేరులో మాత్రం లేదు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ నాగ అఖిల్ అని పిలిచారు. ఈ నేమ్ సెంటిమెంట్ తో అయినా అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ పేరు కలిసొస్తుందేమో
అయ్యగారే నంబర్ వన్
అక్కినేని అఖిల్ ను గతంలో ఓ ఫ్యాన్ అయ్యగారే నంబర్ వన్ అని పిలవడం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది మీమ్ మెటీరియల్ అయింది. తాజాగా లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ ను ఇలాగే పిలిచి ఆట పట్టించడం క్యూట్ గా నిలిచింది.
{{/usCountry}}అక్కినేని అఖిల్ ను గతంలో ఓ ఫ్యాన్ అయ్యగారే నంబర్ వన్ అని పిలవడం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది మీమ్ మెటీరియల్ అయింది. తాజాగా లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ ను ఇలాగే పిలిచి ఆట పట్టించడం క్యూట్ గా నిలిచింది.
{{/usCountry}}సినిమాలో మీ ఈవెంట్ ఆర్గనైజర్ (హీరో) ఏమంటున్నాడని భాగ్యశ్రీ బోర్సేను యాంకర్ సుమ అడిగింది. వెంటనే ‘అయ్యగారే నంబర్ వన్’ అని భాగ్యశ్రీ అనడంతో ఫ్యాన్స్ కేకలు పెట్టారు. వెంటనే అఖిల్ నవ్వుతూ ఫేస్ కవర్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న నాగార్జున కూడా నవ్వేశాడు.
'లెనిన్' ఈవెంట్ టాప్ హైలైట్స్
అఖిల్ సరికొత్త మేకోవర్: ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ మునుపటి చిత్రాలకంటే చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్, విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.
భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ & క్రేజ్: భాగ్యశ్రీ తన క్యూట్ తెలుగు స్పీచ్‌తో మరోసారి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. అఖిల్-భాగ్యశ్రీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్: 'లెనిన్' చిత్రం ఒక పవర్‌ఫుల్ రా అండ్ రస్టిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అఖిల్ కెరీర్‌లోనే ఇది మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.