...
...
Next Story

ఇది ఓజీ వీక్.. ఓటీటీలో పవన్ కల్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. ఇప్పటి నుంచే ట్రెండింగ్

మరో కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి కొత్త కంటెంట్ రాబోతుంది. అయితే ఈ వారం అన్నింటికంటే ముఖ్యంగా ఓ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఓటీటీలోకి రాకముందే ట్రెండింగ్ చేసేస్తున్నారు. అదే ‘ఓజీ’ మూవీ.

Published on: Oct 20, 2025, 10:05:05 IST
Advertisement

మరో కొత్త వారం వచ్చేసింది. కానీ ఇది ఎప్పటిలాగే మామూలు వీక్ కాదు. ఓటీటీలో ఓజీ వీక్ అంటున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ వారమే ఓజీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఓజీ ఓటీటీ

ఓజీలో పవన్ కల్యాణ్ స్టిల్ (x/DVVMovies)
ఓజీలో పవన్ కల్యాణ్ స్టిల్ (x/DVVMovies)

పవన్ కల్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓజీ’. ఇందులో గ్యాంగ్ స్టర్ గా యాక్టింగ్ తో అదరగొట్టారు పవర్ స్టార్. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ బాట పట్టనుంది. ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ట్రెండింగ్ లో ఓజీ

దే కాల్ హిమ్ ఓజీ మూవీ సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ అవతార్ లో పవన్ కల్యాణ్ ను చూసి ఫ్యాన్స్ కేకలు పెట్టకుండా ఉండలేకపోయారు. ఫస్ట్ డే నుంచే ఈ సినిమా కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓజీ మూవీ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ డిజిటల్ డెబ్యూ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

300 కోట్లు

జపాన్ లోని సమురాయ్ వంశాల మధ్య అంతర్గత పోరు నుంచి తప్పించుకుని ఓజాస్ గంభీర్ అలియాస్ ఓజీ (పవన్ కల్యాణ్) ముంబయికి వస్తాడు. ఇక్కడ ముంబయి పోర్టుపై ఆధిపత్యం చలాయించే సత్య దాదా (ప్రకాష్ రాజ్)కు రక్షకుడిగా మారతాడు. కానీ కొన్ని సంఘటనల వల్ల ముంబయి వదిలి వెళ్లిపోతాడు ఓజీ. అయితే సత్య దాదా కుటుంబానికి ముప్పు ఉందని తెలుసుకుని మళ్లీ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఓజీ మూవీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks