గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ మూవీ అఖండ 2 తాండవం. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి విలన్‌గా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.
బాలకృష్ణ కుమార్తె సమర్పణలో

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖండ 2 సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే, బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించిన ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేశారు.
రామ్ లక్ష్మణ్ కామెంట్స్
డిసెంబర్ 5న అఖండ 2 థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుడికి వచ్చిన ఫీలింగ్
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. "మేము ఎన్నో ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చూసాము. కానీ, ఈ వేడుక మాత్రం అందరం కలిసి ఒక గుడికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు. ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మనుషుల్ని భక్తి మార్గంలో నడిపించే ఒక అద్భుతమైన సినిమాని తీసుకొస్తున్న బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు" అని అన్నారు.
బాలయ్యలో శివశక్తి
"అఖండ 2 సినిమాలో బాలయ్య బాబు గారిలో ఒక శివశక్తిని చూశాం. అలాంటి శక్తితో ఫైట్స్‌ని అద్భుతంగా కంపోజ్ చేశాం. ఒక గుడికొచ్చి ఒక దివ్యమైన అనుభూతి పొందిన భావన కలిగిస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులకు నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ , సినిమా యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని రామ్ లక్ష్మణ్ తెలిపారు.
ఆయన స్వాగ్ అమోఘం
ఇదే ఈవెంట్‌లో యాక్టర్ కబీర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాలయ్య గారి ఎనర్జీ అద్భుతం. ఆయన స్వాగ్ అమోఘం. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు.
కొత్తగా చూపిస్తున్నందుకు
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో యాక్టర్ కబీర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాలయ్య గారి ఎనర్జీ అద్భుతం. ఆయన స్వాగ్ అమోఘం. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు.
కొత్తగా చూపిస్తున్నందుకు
{{/usCountry}}"ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపిస్తున్న బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య గారు పాన్ ఇండియా సూపర్ స్టార్. సినిమా టీజర్ ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం" అని నటుడు కబీర్ చెప్పుకొచ్చాడు.