...
...
Next Story

Bandla Ganesh Sankalpa Yatra : చంద్రబాబు కోసం శ్రీవారికి మొక్కు - నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల పాదయాత్ర, 535 కి.మీ పూర్తి

సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయింది. ఈ యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుమల వరకు సుమారు 535 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు.

Published on: Feb 11, 2026, 10:32:27 IST
Advertisement

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్… కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్‌ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత మంగళవారం రోజు తిరులమకు చేరుకున్నారు. సుమారు 535 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర
సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర

అలిపిరి మార్గం నుంచి కాలి నడకన తిరుమలకు బయలుదేరారు. ముందుగా తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్‌ను చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందించారు. తన సంకల్ప యాత్రను ముగించిన నేపథ్యంలో ఇవాళ(బుధవారం) తన కుటుంబంతో కలిసి బండ్ల గణేశ్… శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

పాదయాత్ర ఎందుకోసమంటే..?

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుమల వస్తానని బండ్ల గణేశ్ శ్రీవారికి మొక్కుకున్నారు.

తన మొక్కును చెల్లించుకోవటం కోసం జనవరి 19న షాద్‌నగర్ నుంచి సంకల్ప యాత్ర పేరుతో బండ్ల గణేశ్ పాదయాత్రను ప్రారంభించాడు. 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. పలు గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రాజకీయ నాయకులతో పాటు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. కూటమిలో ఉన్న పార్టీల నాయకులు… తమ అనుచరులతో కలిసి కొంత మేర బండ్ల గణేశ్ తో కలిసి పాదయాత్ర కూడా చేశారు.

టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ కూడా…. బండ్లన్న సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. 'నా సంకల్పయాత్రలో ఈ రోజు నాతో అడుగులు వేసిన తమ్ముడు విశ్వక్ సేన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఎక్స్ లో ఓ పోస్ట్ కూడా చేశాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe