...
...
Next Story

దైవాన్ని ఆడ దెయ్యంగా పిలిచిన ర‌ణ్‌వీర్ సింగ్‌-పోలీసు కేసు న‌మోదు-అస‌లు ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ కు షాక్ తగిలింది. తమ సంప్రదాయాలను కించపరిచారంటూ, దైవాన్ని దెయ్యంగా పేర్కొన్నారని ఒకరు చేసిన ఫిర్యాదుతో ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Published on: Jan 29, 2026, 05:44:43 IST
Advertisement

రీసెంట్ గా ధురంధర్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌ కు బిగ్ షాక్. ఈ స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని నెలల క్రితం రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1' చిత్రంలోని దైవ నటనను బహిరంగ కార్యక్రమంలో అనుకరించినందుకు ర‌ణ్‌వీర్ సింగ్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎన్టీటీవీ ప్రకారం బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఎఫ్ఐఆర్

ర‌ణ్‌వీర్ సింగ్‌ (PTI)
ర‌ణ్‌వీర్ సింగ్‌ (PTI)

కర్ణాటక కోస్తా ప్రాంతాలలోని హిందూ మత భావాలను, చాముండి దైవ సంప్రదాయాన్ని కించపరిచారని ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఆరోపణలు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196, 299, 302 కింద ఈ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మెతల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

ఫిర్యాదు ఇదే

ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ సంఘటన 28 నవంబర్ 2025న గోవాలోని అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో జరిగింది. ఫిర్యాదుదారు ప్రకారం.. ర‌ణ్‌వీర్ సింగ్‌ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, దైవ సంప్రదాయంలోని పవిత్రమైన అంశాలను కించపరిచేలా వేదికపై నటించారని ఆరోపించారు. న్యాయవాది తన ఫిర్యాదులో ర‌ణ్‌వీర్ సింగ్‌ పాంజుర్లి, గులిగ దైవాలకు సంబంధించిన భావాలను అనుకరించారని, వాటిని అసభ్యకరమైన, హాస్యాస్పదమైన, అవమానకరమైన పద్ధతిలో వర్ణించారని పేర్కొన్నారు.

ఆడ దెయ్యం

ర‌ణ్‌వీర్ సింగ్‌ చాముండి దైవాన్ని ‘‘ఆడ దెయ్యం"గా పేర్కొన్నారని ప్రశాంత్ ఆరోపించారు. చాముండి దైవం కర్ణాటకలోని తీర ప్రాంతాలలో దైవిక స్త్రీ శక్తిని సూచించే పవిత్ర దేవత అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవతను దెయ్యంగా పిలవడం మతపరమైన భావాలను దెబ్బతీసే తీవ్రమైన తప్పుడు సమాచారం అని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసును బెంగళూరులోని 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (CMM) కోర్టుకు నివేదించారు. దీనిపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.

ర‌ణ్‌వీర్ సింగ్‌ సారీ

ఈ సంఘటన IFFI 2025 ముగింపు వేడుకలో జరిగింది, దీనికి రిషబ్ కూడా హాజరయ్యారు. ర‌ణ్‌వీర్ సింగ్‌ స్టేజిపైకి వెళ్లి రిషబ్ శెట్టి 'కాంతార' చిత్రాలలోని దైవ నటనను యాక్ట్ చేశాడు. "నేను థియేటర్లలో కాంతార చాప్టర్ 1 చూశాను. రిషబ్ ది అద్భుతమైన నటన. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ షాట్ అద్భుతంగా ఉంది" అని ర‌ణ్‌వీర్ సింగ్‌ స్టేజీపై చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks