...
...
Next Story

దళపతి విజయ్ చివరి డ్యాన్స్.. జన నాయగన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్ ఎమోషనల్

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ నటిస్తున్న లాస్ట్ సినిమా జన నాయగన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ దళపతి కచేరీ వీడియో రిలీజైంది. ఇందులో విజయ్ లాస్ట్ డ్యాన్స్ ఫ్యాన్స్ కు ఎమోషనల్ ఫీలింగ్ తెప్పిస్తోంది.

Published on: Nov 8, 2025, 21:36:57 IST
Advertisement

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్ గా మారాడు. పార్టీ పెట్టి ఎలక్షన్ బరికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినీ కెరీర్ కు ఎండ్ కార్డు వేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ మూవీ ఆయన సినీ కెరీర్ లో చివరదని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడీ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

దళపతి కచేరీ సాంగ్

దళపతి కచేరీ సాంగ్ లో మమితా బైజు, విజయ్, పూజ హెగ్డే
దళపతి కచేరీ సాంగ్ లో మమితా బైజు, విజయ్, పూజ హెగ్డే

హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'జన నాయగన్' సినిమా నుంచి మొదటి పాట శనివారం (నవంబర్ 8) విడుదలైంది. దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘దళపతి కచేరీ’ పాట రిలీజైంది. ఇది విజయ్ సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసేలా ఉంది.

పాట, డ్యాన్స్

దళపతి కచేరీ పాట పాడటంతో పాటు డ్యాన్స్ చేశాడు దళపతి విజయ్. 3 నిమిషాల 21 సెకన్ల నిడివి గల ఈ పాట లిరికల్ వీడియోకు అనిరుధ్ సంగీతం అందించాడు. అనిరుధ్, విజయ్, అరివు కలిసి పాడారు. సాహిత్యం అరివు అందించారు. ఈ వీడియో కలర్‌ఫుల్ సెలబ్రేషన్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో అనిరుధ్ స్టేజ్‌పై గిటార్ వాయిస్తూ పాట పాడటం కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రే హెయిర్‌తో ఉన్న విజయ్, పెద్ద గుంపుతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. వెంటనే పూజా, మమితా కూడా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు.

చివరి డ్యాన్స్

విజయ్ లాస్ట్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ‘‘దళపతి చివరిసారి’’ అని ఒకరు భావోద్వేగంతో కామెంట్ చేశారు. మరొకరు "వన్ లాస్ట్ టైమ్ దళపతి కచేరి" అని రాశారు. ఒక భావోద్వేగ అభిమాని.. "దళపతి, చివరిసారి మిమ్మల్ని చాలా మిస్ అవుతాం" అని వ్యాఖ్యానించగా, మరొకరు "దళపతి విజయ్ సర్, మీరు గోట్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. లవ్ యూ విజయ్ సర్, ఇది సెలబ్రేట్ చేసుకునే సమయం" అని రాశారు.

జన నాయగన్ గురించి..

'జన నాయగన్' చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిసామి, లోహిత్ ఎన్‌కే సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 పొంగల్ కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే ముందు విజయ్‌కు ఇదే చివరి చిత్రం కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe