...
...
Next Story

టీ20 వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేయకండి.. ఐసీసీతో పెట్టుకోవద్దు.. తర్వాత తిప్పలు తప్పవు: పాకిస్థాన్ బోర్డుకు మాజీల వార్నింగ్

బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆలోచనను ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేస్తే ఐసీసీతో సంబంధాలు దెబ్బతింటాయని, పాకిస్థాన్ క్రికెట్‌కే తీవ్ర నష్టం జరుగుతుందని ఇంజమామ్ ఉల్ హక్, మహమ్మద్ హఫీజ్ వంటి దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు.

Published on: Jan 28, 2026, 16:07:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకా సందిగ్ధంలోనే ఉంది. భద్రతా కారణాల రీత్యా భారత్‌కు రాలేమని చెప్పిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి ఐసీసీ కఠినంగా ఉండటంతో ఆ టీమ్ తప్పుకోక తప్పలేదు. దీనికి నిరసనగా, బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలుపుతూ తాము కూడా వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ యోచిస్తోంది. అయితే ఈ ఆలోచనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

ఐసీసీతో పెట్టుకుంటే కష్టమే..

టీ20 వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేయకండి.. ఐసీసీతో పెట్టుకోవద్దు.. తర్వాత తిప్పలు తప్పవు: పాకిస్థాన్ బోర్డుకు మాజీల వార్నింగ్ (AFP)
టీ20 వరల్డ్‌కప్ బాయ్‌కాట్ చేయకండి.. ఐసీసీతో పెట్టుకోవద్దు.. తర్వాత తిప్పలు తప్పవు: పాకిస్థాన్ బోర్డుకు మాజీల వార్నింగ్ (AFP)

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, మొహమ్మద్ హఫీజ్, మోసిన్ ఖాన్ వంటి వారు పీసీబీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఐసీసీతో గొడవ పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, దీనివల్ల పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంజమామ్ ఉల్ హక్ దీనిపై స్పందిస్తూ.. "పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రాణించడం మన క్రికెట్‌కు చాలా అవసరం" అని పీటీఐతో పేర్కొన్నాడు.

మరో మాజీ మోసిన్ ఖాన్ మాట్లాడుతూ.. "మనకు భారత్‌తో సమస్యలు ఉన్న మాట వాస్తవమే. కానీ మన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరుగుతున్నాయి కదా? అలాంటప్పుడు జట్టును పంపకపోవడానికి మన దగ్గర సరైన కారణం ఏముంది? ఇది మన క్రికెట్‌కు చాలా చేటు చేస్తుంది" అని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ ప్రధానితో భేటీ..

పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ సోమవారం (జనవరి 26) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ భేటీ తర్వాత, వరల్డ్ కప్‌లో పాల్గొనాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని ఫిబ్రవరి 2లోపు తీసుకుంటామని తెలిపాడు. అయితే బాయ్‌కాట్ చేస్తే ఐసీసీ నుంచి వచ్చే ఇబ్బందులే కాకుండా, దాదాపు 38 మిలియన్ డాలర్ల మేర బ్రాడ్‌కాస్టర్ల నుంచి దావా ఎదుర్కోవాల్సి వస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అర్థం లేని వాదన..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe