...
...
Next Story

Mia Khalifa: దెబ్బకు ఈ మాజీ పోర్న్ స్టార్ ఖాతాలో రూ.15 కోట్లు.. స్పెయిన్ గెలుపుతో పండగ చేసుకుంటున్న మియా ఖలీఫా

Mia Khalifa: మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తెలుసా? ఫిఫా వరల్డ్ కప్ ను స్పెయిన్ గెలవడంతో ఆమె ఏకంగా రూ.15 కోట్లకుపైగానే జాక్‌పాట్ కొట్టింది. ఈ ఫైనల్లో ఆమె స్పెయిన్ గెలుస్తుందని బెట్ వేయడంతో ఆమె దశ తిరిగిపోయింది.

Published on: Jul 20, 2026 01:50 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mia Khalifa: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ సాధించిన సంచలన విజయం మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫాకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆమె ఏకంగా 1 మిలియన్ డాలర్లు బెట్టింగ్ కాసింది. స్పెయిన్ ట్రోఫీ గెలవడంతో ఒక్క రాత్రిలోనే 1.65 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 15.9 కోట్లు) గెలుచుకుని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

స్పెయిన్ గెలుపు ఎంజాయ్ చేసిన మియా

Mia Khalifa: దెబ్బకు ఈ మాజీ పోర్న్ స్టార్ ఖాతాలో రూ.13 కోట్లు.. స్పెయిన్ గెలుపుతో పండగ చేసుకుంటున్న మియా ఖలీఫా (Instagram)
Mia Khalifa: దెబ్బకు ఈ మాజీ పోర్న్ స్టార్ ఖాతాలో రూ.13 కోట్లు.. స్పెయిన్ గెలుపుతో పండగ చేసుకుంటున్న మియా ఖలీఫా (Instagram)

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి మియా ఖలీఫా స్పెయిన్ యంగ్ సెన్సేషన్ లామిన్ యమల్ జెర్సీ వేసుకుని స్టేడియంలో సందడి చేసింది. తన ఒంట్లో ఒక్క చుక్క స్పానిష్ రక్తం లేకపోయినా, స్పెయిన్ గెలుపును తన సొంత దేశం విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన 1.65 ఆడ్స్ ఉన్న బెట్టింగ్ విన్నింగ్ స్క్రీన్‌షాట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన 33 ఏళ్ల మియాకు ఇది మైండ్ బ్లోయింగ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు.

ఉత్కంఠ రేపిన స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా ఫైట్

మరోవైపు 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్‌పై ఫుల్ డ్రామా క్రియేట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను గ్లోబల్ లెజెండ్ లియోనల్ మెస్సి ముందుండి నడిపించినా స్పెయిన్ రాక్ సాలిడ్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఏకంగా 11 అద్భుతమైన సేవ్స్ చేసి టీమ్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్స్‌ట్రా టైమ్‌లో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ క్లినికల్ గోల్ కొట్టడంతో అర్జెంటీనా పతనం ఖాయమైంది.

ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి హాలీవుడ్ స్టార్లు మెట్‌లైఫ్ స్టేడియానికి క్యూ కట్టారు. తన కొత్త మూవీ 'ది ఒడిస్సీ' సక్సెస్‌లో ఉన్న టాప్ యాక్టర్ మాట్ డామన్ తన అర్జెంటీనా భార్య లూసియానా బారోసోతో కలిసి మ్యాచ్‌కు హాజరయ్యాడు. అలాగే స్పానిష్ సూపర్ స్టార్ జేవియర్ బార్డెమ్ కూడా స్పెయిన్ టీమ్ జెర్సీలో కనిపించి జోష్ పెంచాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ స్టేడియంలో చూడటం విశేషం.

ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ప్లాన్ చేసిన హాఫ్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ షో స్టేడియాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. పాప్ ఐకాన్ మడోన్నా పవర్‌ఫుల్ ఓపెనింగ్‌తో స్టేజ్ సెట్ చేయగా, కే-పాప్ కింగ్స్ బీటీఎస్ (BTS) తమ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ట్రాక్ 'డైనమైట్' తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. జస్టిన్ బీబర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, వరల్డ్ కప్ రెగ్యులర్ సెన్సేషన్ షకీరా తన సూపర్ హిట్ అఫీషియల్ సాంగ్ 'డై డై'తో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe