...
...
Next Story

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 రివ్యూ: ఓటీటీకి ఇవాళ తెలుగులో వచ్చిన బోల్డ్ రొమాంటిక్ సిరీస్- కిక్కు తగ్గిన నలుగురు మగువల కథ!

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హిందీ రొమాంటిక్ బోల్డ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4. అమెజాన్ ప్రైమ్‌లో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సయానీ గుప్తా, కీర్తి కుల్హారీ, బానీ జె, మాన్వీ గగ్రూ నటించిన ఈ సీజన్ ఎలా ఉందో నేటి ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Dec 19, 2025, 20:25:30 IST
Advertisement

బాలీవుడ్ ముద్దుగుమ్మలు సయానీ గుప్తా, కీర్తి కుల్హారీ, బానీ జె, మాన్వీ గగ్రూ ప్రధాన పాత్రల్లో నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్‌గా 4 ఓటీటీలోకి వచ్చేసింది. ఇదివరకు వచ్చిన మొదటి రెండు సీజన్స్ బాగా ఆకట్టుకున్నాయి. మూడో సీజన్ పర్వాలేదనిపించుకుంది.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 రివ్యూ: ఓటీటీకి ఇవాళ తెలుగులో వచ్చిన బోల్డ్ రొమాంటిక్ సిరీస్- కిక్కు తగ్గిన నలుగురు మగువల కథ!
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 రివ్యూ: ఓటీటీకి ఇవాళ తెలుగులో వచ్చిన బోల్డ్ రొమాంటిక్ సిరీస్- కిక్కు తగ్గిన నలుగురు మగువల కథ!

అరుణిమ శర్మ, నేహా పర్తి మతియాని దర్శకత్వం వహించిన ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4 ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 19) వచ్చేసింది. తెలుగు భాషలో కూడా ఫోర్ మోర్ షాట్స్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డినో మోరియా, ప్రతీక్ బబ్బర్, రాజీవ్ సిద్ధార్థ్, కునాల్ రాయ్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సీజన్ ఎలా ఉందో నేటి ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4 రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

గత సీజన్ నుంచి రెండేళ్ల తర్వాత ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 సీజన్ స్టార్ట్ అవుతుంది. అంజన (కీర్తి కుల్హారీ), ఉమంగ్ (బానీ జె), దామిని (సయానీ గుప్తా), సిద్ధి (మాన్వీ గగ్రూ) తమ పాత సమస్యలను ఓవర్‌కమ్ చేసి కొత్త జీవితంపై ఎలా అడుగులు వేశారు?, ఆ సమయంలో వారికి ఎదురైన అనుభవాలు ఏంటీ? చేసిన అల్లరి ఏంటీ? ఫైనల్‌గా వారు జీవితమంటే తెలుసుకుంది ఏంటనే? అంశాలు తెలియాలంటే ఈ సీజన్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ క్రమంలో సిద్ధి వైవాహిక జీవితంలో వచ్చే గొడవలను ఇంకాస్త లోతుగా చూపించి ఉండాల్సింది. ఆ భావోద్వేగాల్లో బలం లేకపోవడంతో ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతుంది. తన భర్తపై అందరి ముందు వేసే సెటైర్స్, అవి క్రాస్ అవడం వంటి అంశాలతో సిద్ధి కథ సాగుతుంది.

ఇక దామిని పాత్రలో మునుపటి గాంభీర్యం కనిపించదు. సయానీ గుప్తా పోషించిన ఈ దామిని పాత్ర ఈసారి చాలా బలహీనంగా అనిపిస్తుంది. గతంలో ఎంతో భావోద్వేగపూరితమైన, సంక్లిష్టమైన పాత్రగా పేరున్న దామిని, ఇప్పుడు పాడ్‌కాస్టింగ్ వైపు అడుగులు వేస్తుంది. కానీ ఆ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు.

ఆకట్టుకోని దామిని పాత్ర

ఆమె పాత్ర కంటే ఆమె సోదరుడు యాష్ (కునాల్ రాయ్ కపూర్) కనిపించే సన్నివేశాలే కాస్త ఉత్సాహంగా ఉన్నాయి. జె (ప్రతీక్ బబ్బర్) కోసం ఆమె పడే ఆరాటంలో ఇంతకుముందు చూపించిన ఇంటెన్షన్ కనిపించదు. వెండితెరపై ఆమె ఇచ్చే నిరీక్షమైన చూపులు ప్రేక్షకుడికి బోర్ తెప్పిస్తాయి.

కీర్తి కుల్హారీ పోషించిన అంజన పాత్రకు ఈ సీజన్‌లో అతి తక్కువ ప్రాధాన్యత దక్కింది. ఆమె ఒక విజయవంతమైన మహిళగా మారిందని మేకర్స్ చెబుతున్నా, ఆ మార్పు ఎలా జరిగిందో చూపించడంలో విఫలమయ్యారు. ఆమె కథ కేవలం డినో మోరియాతో సాగే శృంగార సన్నివేశాలకే పరిమితమైనట్లు అనిపిస్తుంది.

బోల్డ్ సీన్ల కోసమే

ఒక ఒంటరి తల్లిగా ఉండి, ఒక్కసారిగా తన బాధ్యతలను పక్కన పెట్టి రోడ్ ట్రిప్‌కి వెళ్లడం వంటి నిర్ణయాలు కన్విన్స్ అయి కానట్టు చూపించారు. ఎక్కువగా కీర్తి పాత్రతో బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం ఆమె ఫ్యాన్స్‌కు ట్రీట్ అనుకోవచ్చు.

ఇక బానీ జె పోషించిన ఉమంగ్ పాత్ర ఎప్పటిలా రొటీన్‌గానే ఉంది. ఎప్పుడూ మానసిక సంఘర్షణతోనే సాగుతుంది. సమర (లిసా రే) పెళ్లి సందర్భంగా ఉమంగ్ పడే ఆందోళన, పానిక్ అటాక్ వంటి సన్నివేశాలు ఇదివరకే చూపించారు. ఈ సీజన్‌లో కొత్తగా చూపించింది ఏం లేదు.

సింపుల్ డ్యాన్స్‌తో

అయితే, కథలో ఉమంగ్ ఎమోషన్ లోతుగా ఉంటుందేమో అనుకున్న ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది. ఆమె ఎమోషన్స్‌ను మేకర్స్ వాటిని చాలా తేలికగా ముగించేశారు. ఒక పెద్ద భావోద్వేగ ఘట్టాన్ని కేవలం చిన్న డ్యాన్స్‌తో సరిపెట్టేయడం నిరాశ కలిగిస్తుంది.

ఇద్దరు దర్శకులు ఈ ఫైనల్‌ సీజన్‌ను సరికొత్తగా మలచాలని ప్రయత్నించినా కథనంలో పట్టు కోల్పోయారు. మిలింద్ సోమన్, నీరజ్ కాబీ వంటి నటులు ఉన్నా వారిని వాడుకోలేకపోయారు.

ఫైనల్‌గా చెప్పాలంటే

విజువల్స్ , కాస్ట్యూమ్స్ పరంగా షో ఎంతో రిచ్‌గా ఉంది. చివరి నిమిషంలో గోవా బీచ్‌లో నలుగురు మిత్రులు కలిసే సన్నివేశం కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. అలాంటి సీన్సు గత సీజన్లలో ఎన్నో ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే బలమైన కథ లేకపోవడంతో "నాలుగు షాట్లు" వేసినా కిక్కు మాత్రం రాలేదు అనిపిస్తుంది.

రేటింగ్: 2.25/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe