ఓటీటీలోకి డిఫరెంట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇందులో థ్రిల్లర్లదే జోరు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు క్రేజ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఓటీటీలోని ఓ కొత్త హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీ సత్తాచాటుతోంది. అదే.. ఫ్రాంకెన్‌స్టైన్. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది, సినిమా స్టోరీ ఏంటో? చూసేయండి.
ఫ్రాంకెన్‌స్టైన్ ఓటీటీ

సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ గిల్లర్మో డెల్ టోరో డైరెక్టర్. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఇసాక్, జేకబ్ ఎలార్డీ, మియా గాథ్, క్రిస్టాఫ్ వాల్జ్ తదితరులు నటించారు.
ఫ్రాంకెన్‌స్టైన్ స్టోరీ
ఫ్రాంకెన్‌స్టైన్ సినిమా ఓ హారర్ థ్రిల్లర్. రాక్షసుడికి ప్రాణం పోసే సైంటిస్ట్ కథ ఇది. విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ ఓ సైంటిస్ట్. చిన్నప్పుడే అతని తల్లి చనిపోతుంది. దీంతో ఒక రకమైన పిచ్చోడిలా మారిపోతాడు. మరణాన్ని జయించాలని అనుకుంటాడు. అందుకు సమాధుల తవ్వి శవాలు దొంగతనం చేస్తాడు. ఒక్కో శవం నుంచి వేర్వేరు పార్ట్స్ తీసుకుని ఒక పెద్ద మనిషి శరీరం క్రియేట్ చేస్తాడు.
రాక్షసుడిగా
ఓ భారీ పిడుగు కారణంగా ఆ శరీరానికి ప్రాణం వస్తుంది. అతను రాక్షసుడిలా భయంకరంగా ఉంటాడు. ఆ జీవిని చంపేయాలని విక్టర్ అనుకుని మంటల్లో తగలబెడతాడు. కానీ ఆ రాక్షసుడు ప్రాణాలతో బయటకు వస్తాడు. విక్టర్ పారిపోతాడు. విక్టర్ కోసం వెతుక్కుంటూ ఆ వింత మనిషి బయటకు వస్తాడు. అతణ్ని చూసి జనాలు భయపడతారు. ఆ రాక్షసుణ్ని చంపాలని చూస్తారు.
కానీ ఆ రాక్షసుడు మరింత భయంకరంగా మారతాడు. ప్రజలనే చంపుతాడు. విపరీతమైన కోపంతో విధ్వంసం చేస్తాడు. అయితే తనకు తోడుగా మరొక జీవిని పుట్టించాలని విక్టర్ ను కోరతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడికి ఏమైంది? విక్టర్ ఏం చేశాడన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.
బ్లాక్ బస్టర్
{{/usCountry}}కానీ ఆ రాక్షసుడు మరింత భయంకరంగా మారతాడు. ప్రజలనే చంపుతాడు. విపరీతమైన కోపంతో విధ్వంసం చేస్తాడు. అయితే తనకు తోడుగా మరొక జీవిని పుట్టించాలని విక్టర్ ను కోరతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడికి ఏమైంది? విక్టర్ ఏం చేశాడన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.
బ్లాక్ బస్టర్
{{/usCountry}}ఫ్రాంకెన్‌స్టైన్ సినిమాకు థియేటర్లో అదిరే రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ మూవీ రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది. దీనికి ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. ఇది నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ వెంటనే ఈ మూవీపై లుక్కేయండి.