Today OTT Release: కొడుకు గెలవాలని పాపను చంపే తల్లి-ఇవాళ ఓటీటీలోకి తెలుగు స్పోర్ట్స్ థ్రిల్లర్-విలన్ గా బిగ్ బాస్ బ్యూటీ
Today OTT Release: సండే స్పెషల్ గా ఈటీవీ విన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. తన కొడుకు గెలిచేందుకే పుట్టాడని, అతని ఓటమిని చూడలేక ఓ పాపను చంపేందుకు ఆ తల్లి రెడీ అవుతుంది. అసలు ఈ మూవీ ఏంటీ? స్టోరీ ఏంటీ? అనేది ఇక్కడ చూసేయండి.
Today OTT Release: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ మధ్య కాలంలో సరికొత్త ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగానే 'కథా సుధా' (Katha Sudha) అనే పేరుతో ప్రతి వారం ఒక కొత్త కథను పరిచయం చేస్తోంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో 'గెలుపు' అనే ఎమోషనల్ డ్రామాను ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్పోర్ట్స్ థ్రిల్లర్
ఈటీవీ విన్ లో ఇవాళ (నవంబర్ 15) కథాసుధాలో భాగంగా వచ్చిన చిన్న సినిమా ‘గెలుపు’. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్. గెలుపు అనేది కేవలం ఒక ఆట గురించి మాత్రమే కాదు.. ఆ ఆట కోసం పడే కష్టం, అందులోని భావోద్వేగాలను, ఆటగాళ్ల ఆశయాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. తన కొడుకు గెలవాలని మరో పాపను చంపేందుకు కూడా ఆ తల్లి వెనుకాడదు.
స్టోరీ ఏంటంటే?
గెలుపు సినిమాలో పురుషోత్తం అనే ఓ పిల్లాడు చెస్ ఛాంపియన్ గా కనిపిస్తాడు. చిన్న వయసులోనే గొప్ప ఘనతలు సాధించడంతో పొగరు తలకెక్కుతుంది. ఓ సారి ఓటమి ఎదురైతే తట్టుకోలేకపోతాడు. తల బాదుకుంటాడు. కొడుకు బాధను చూడలేక మరోసారి అతను ఓడిపోకుండా చూసుకుంటానని ఆ తల్లి (ఇనయ సుల్తానా) మాటిస్తుంది.
మరోవైపు ఓ పాప చెస్ లో అదరగొడుతోంది. పెద్ద పెద్ద ప్లేయర్లను ఓడిస్తుంది. ఆ పాప ఎప్పటికైనా పురుషోత్తానికి ప్రమాదమే అని భావించి తనను చంపేందుకు ఆ తల్లి ప్రయత్నిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది గెలుపు మూవీలో చూడాల్సిందే.
బిగ్ బాస్ బ్యూటీ
గెలుపు సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా కీలక పాత్ర పోషించింది. తన కొడుకు కోసం ఓ పాపను చంపేందుకు ట్రై చేసే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసింది. ఇంకా ఈ సినిమాలో చైత్ర, అశ్విని, మహిధర్, అన్వీష తదితరులు నటించారు. ఈ సినిమాకు ప్రవీణ్ రామరాజు డైరెక్టర్.
ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్
మీరు వీకెండ్‌లో ఏదైనా మంచి ఎమోషనల్, మోటివేషనల్ కమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే 'గెలుపు' సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా, స్వచ్ఛమైన కథతో సాగే ఈ పవర్‌ఫుల్ స్టోరీ ఇప్పుడు 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ 'గెలుపు'ను చూసి, అందులోని భావోద్వేగాలను ఫీల్ అవ్వండి!
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


