జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర 2 మూవీపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఉంటుందా? లేదా? షూటింగ్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నలకు ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరిపోయే న్యూస్ చెప్పారు.
దేవర 2 అప్ డేట్

దేవర 2 సినిమా గురించి ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరే అప్ డేట్ ఇచ్చారు. నందిగామలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో సినిమా గురించి ఆయన మాట్లాడారు. దేవర పార్ట్ 2 ఎలా ఉంటుంది? వస్తుందా? లేదా? స్టార్ కాస్ట్ ఎవరు? గురించి చెప్పమని యాంకర్ అడగగా.. ‘‘మే నుంచి స్టార్ట్ అవుతుందండీ. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. మీ అందరికీ అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సుధాకర్ పేర్కొన్నారు.
ఫ్యాన్స్ ఖుష్
దేవర 2పై ప్రొడ్యూసర్ సుధాకర్ క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు. సుధాకర్ మాటలను బట్టి దేవర పార్ట్ 2 షూటింగ్ 2026 మేలో స్టార్ట్ కానుంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత దేవర 2 షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది.
దేవర గురించి
{{/usCountry}}దేవర 2పై ప్రొడ్యూసర్ సుధాకర్ క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు. సుధాకర్ మాటలను బట్టి దేవర పార్ట్ 2 షూటింగ్ 2026 మేలో స్టార్ట్ కానుంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత దేవర 2 షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది.
దేవర గురించి
{{/usCountry}}తారక్ డబుల్ రోల్ ప్లే చేసిన మూవీ దేవర. ఇందులో తండ్రి, కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. దీనికి కొరటాల శివ డైరెక్టర్. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. 2024 సెప్టెంబర్ లో రిలీజైన దేవర బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. సుమారు రూ.500 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.
దేవర స్టోరీ
దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. సైఫ్ అలీ ఖాన్ కు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దీన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నిర్మించారు.
దేవర సినిమా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులోని ఓ కొండపై ఉన్న నాలుగు గ్రామాల చుట్టూ తిరిగే కథ. దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) తదితరులు కలిసి సముద్రంలోని పడవల నుంచి అక్రమ ఆయుధాలను ఒడ్డుకు తీసుకు వస్తారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ పని చేయడం తమ ప్రజలకు మంచిది కాదని దేవర వద్దని చెప్తాడు.
సముద్రం వైపు ఎవరు వెళ్లినా దేవర వదలడు అనే భయాన్ని కల్పిస్తాడు. కానీ ఉన్నట్లుండి దేవర కనిపించకుండా పోతాడు. అతని కొడుకు వర (ఎన్టీఆర్) పిరికివాడిగా కనిపిస్తాడు. కానీ సినిమా చివర్లో అతణ్ని ఎవరో కత్తులతో పొడిచినట్లు చూపిస్తారు. మరి వర బతికాడా? దేవర ఎక్కడున్నాడు? అనే సస్పెన్స్ తో దేవర పార్ట్ 2 కు లీడ్ ఇచ్చాడు డైరెక్టర్.