...
...
Next Story

రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ఆ సెన్సేషనల్ సాంగ్- గ్రామీ అవార్డ్ పాటతో అదిరిపోయే యాక్షన్- బీజీఎమ్‌గా వాడకం!

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్ 2’ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడిన గ్రామీ అవార్డు విజేత డోజా క్యాట్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదల కానుంది.

Published on: Feb 5, 2026, 06:46:56 IST
Advertisement

బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్’ (Dhurandhar) సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండో భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) టీజర్ ఈ వారమే విడుదలై ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఈ టీజర్ చూసిన నెటిజన్లను ఒక ఆసక్తికర విషయం అమితంగా ఆకర్షించింది.

హాలీవుడ్ సింగర్ పాటతో అదిరిపోయిన బీజీఎం!

రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ఆ సెన్సేషనల్ సాంగ్- గ్రామీ అవార్డ్ పాటతో అదిరిపోయే యాక్షన్- బీజీఎమ్‌గా వాడకం!
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ఆ సెన్సేషనల్ సాంగ్- గ్రామీ అవార్డ్ పాటతో అదిరిపోయే యాక్షన్- బీజీఎమ్‌గా వాడకం!

ధురంధర్ 2 టీజర్‌లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రముఖ హాలీవుడ్ సింగర్, గ్రామీ అవార్డు గ్రహీత డోజా క్యాట్ (Doja Cat) పాడిన పాటకు చాలా దగ్గరగా ఉందని అభిమానులు గుర్తించారు. దీనిపై వస్తున్న వార్తలు నిజమేనని మేకర్స్ కూడా ధృవీకరించారు. డోజా క్యాట్ కొత్త ఆల్బమ్ 'Vie'లోని ‘AAAHH MEN!’ అనే పాటను ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అంతటా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఉపయోగించారు.

ఈ హాలీవుడ్ ట్రాక్ కూడా

యూట్యూబ్‌లో టీజర్ డిస్క్రిప్షన్‌లో కూడా మేకర్స్ ఈ పాటకు సంబంధించిన క్రెడిట్స్ ఇచ్చారు. గతంలో మొదటి భాగంలో బెహ్రెయిన్ రాపర్ ఫ్లిప్పరాచీ పాడిన 'FA9LA' పాట ఎలాగైతే వైరల్ అయిందో, ఇప్పుడు ఈ హాలీవుడ్ ట్రాక్ కూడా అదే స్థాయిలో ట్రెండ్ అవుతోంది.

యాక్షన్ మోడ్‌లో రణ్‌వీర్..

ధురంధర్ ది రివేంజ్ టీజర్‌లో రణ్‌వీర్ సింగ్ 'హంజా'గా తన విశ్వరూపం చూపించారు. గతాన్ని గుర్తుచేసుకుంటూనే శత్రువులపై విరుచుకుపడే సన్నివేశాలు కంటిరెప్ప వేయనివ్వవు. రణ్‌వీర్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను కొనసాగిస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' డిసెంబర్ 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక ఇండియన్ స్పై పాకిస్థాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి ప్రవేశించి టెర్రర్ నెట్‌వర్క్‌ను ఎలా కూల్చాడు అనే కథాంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మార్చి 19న విడుదల

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks