గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో వచ్చే ఎపిసోడ్ లో రోహిణి పని ఇక అయిపోయినట్లే అనేలా ఉంది. స్టార్ మా ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. గుడిలో అందరి ముందు రోహిణి దొరికిపోయే పరిస్థితి ఏర్పడటం ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం.
ప్రోమోలో ఏమున్నదంటే?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ ప్రోమో గుడిలో ప్రభావతికి రోహిణి తీసుకొచ్చిన మలేషియా మామ దొరికిపోతాడు. అతడు పొర్లు దండాలు పెడుతుండగా.. ప్రభావతి కాళ్లకు తగులుతాడు. దీంతో ఆమె కింద పడిపోతుంది. పక్కనే ఉన్న సత్యం అతన్ని చూసి నువ్వు రోహిణి మేన మామవు కదూ అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి.. రోహిణికి ఫోన్ చేస్తుంది. మీ మలేషియా మామ కనిపించాడు.. ఇక్కడే ఉన్నాడు.. వెంటనే రా అని చెబుతుంది.
దొరికిపోయిన రోహిణి
అది విని రోహిణి కంగారుగా బయలుదేరుతుంది. అప్పటికే మటన్ కొట్టు మాణిక్యాన్ని ఇంట్లో వాళ్లందరూ నిలదీస్తుంటారు. నువ్వు మలేషియాలో ఉండాలి కదా.. మా ఊరి గుడిలో ఏం చేస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. వెంటనే బాలు కూడా హారతి తీసుకొచ్చి.. దీనిని ఆర్పి నీ అసలు నిజం చెప్పు.. నువ్వు మలేషియా మామవు కాదు కదా.. ఏ మటన్ కొట్టులోనో పని చేస్తావు కదా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి అది విని షాక్ తింటుంది. ఈ ప్రోమో చూస్తుంటే.. ఇక రోహిణి నాటకానికి తెరపడినట్లేనా అన్న అనుమానం కలుగుతోంది.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్
నిజానికి గుండె నిండా గుడి గంటలు ఈరోజు (మార్చి 4) ఎపిసోడ్ లోనూ విద్య ఇంట్లో బాలుకి చింటు, సుగుణలతో రోహిణి దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందుగానే ఆమెకు విద్య సమాచారం ఇవ్వడంతో ఏదో మాయ చేసిన తప్పించుకున్నట్లు తాజాగా ప్రోమోతో తేలిపోయింది.
{{/usCountry}}నిజానికి గుండె నిండా గుడి గంటలు ఈరోజు (మార్చి 4) ఎపిసోడ్ లోనూ విద్య ఇంట్లో బాలుకి చింటు, సుగుణలతో రోహిణి దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందుగానే ఆమెకు విద్య సమాచారం ఇవ్వడంతో ఏదో మాయ చేసిన తప్పించుకున్నట్లు తాజాగా ప్రోమోతో తేలిపోయింది.
{{/usCountry}}విద్య ఇంట్లో తప్పించుకున్నా.. గుడిలో మాత్రం రోహిణికి గండం పొంచి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి దీని నుంచి ఆమె బయటపడుతుందా? లేదంటే మరో నాటకానికి తెర తీస్తుందా? బాలు ఆమెను మరింత ఇరికించి నిజం రాబడతాడా లేదా అన్నది వచ్చే ఎపిసోడ్ లో తేలనుంది.