...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Promo: విల్లా అసలు ఓనర్ ఎంట్రీ- 30 లక్షలు గోవిందా- పోలీసులతో సత్యం ఫ్యామిలీని గెంటించిన ఓనర్!

Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో మనోజ్, రోహిణి విల్లా నేమ్ బోర్డ్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ, కారులో విల్లా అసలు ఓనర్ ఎంట్రీ ఇస్తాడు. మీరు 30 లక్షలు మోసపోయారని చెప్పిన ఓనర్ సత్యం ఫ్యామిలీని పోలీసులతో గెంటిస్తాడు.

Published on: May 5, 2026, 15:36:03 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో కెనడా నుంచి మనోజ్ మాజీ లవర్ కల్పన రీ ఎంట్రీ ఇస్తుంది. రాజమండ్రిలో కొత్త ఇల్లు కొన్నాని, దాని డబ్బు పూర్తిగా చెల్లించానని, రిజిస్ట్రేషన్ ఒక్కటే మిగిలిపోయిందని, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకడు తన నుంచి రూ. 45 లక్షలు కొట్టేశాడని చెబుతుంది.

కల్పన రీ ఎంట్రీ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

వాన్ని అలా ఎలా వదిలేశారని బాలు అంటాడు. తర్వాత కల్పన ప్లాట్ రావడంతో బాలు కారు ఆపుతాడు. కల్పన పైకి వెళ్లి వస్తానంటుంది. బయట రోడ్డు మీద కారులో బాలు వెయిట్ చేస్తుంటాడు. మరోవైపు 5 కోట్ల విల్లా పరిసర ప్రాంతాల్లో సత్యం, ప్రభావతి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. ప్రభావతి చుడీదార్ వేసుకుని ఉంటుంది. మరోవైపు న్యూమరాలజిస్ట్ పెట్టిన రోమతి పేరుతో విల్లాకు నేమ్ బోర్డ్ చేయమని ఆర్డర్ ఇస్తారు మనోజ్, రోహిణి.

తర్వాత బ్యాంక్ లోన్ కాకుండా కావాల్సిన ఇంకా రూ. 70 లక్షలు ఎలా అరెంజ్ చేయాలా అని మనోజ్ ఆలోచిస్తే రోహిణి మాత్రం తాను కన్న కల, తన మోసం బయటపడితే ప్రభావతి ఏం చేస్తుందో అని భయపడుతుంది. మరోవైపు రోడ్డు మీద చుట్టు ఉన్న ఇల్లు, మనుషులను చూసి ప్రభావతి తెగ మురిసిపోతుంది. వీళ్లంతా రిచ్ మనుషులను, మనం వాళ్ల వద్దకు వచ్చేశామని, మనం కూడా రిచ్ మనుషుల్లాగే బిహేవ్ చేయాలని ప్రభావతి అంటుంది.

ప్రభావతి మురిపం చూసి సత్యం సంతోషిస్తాడు. నిన్ను చూస్తుంటే జాతరకు తీసుకొచ్చిన చిన్న పిల్లల చేస్తున్నావని అంటాడు. తర్వాత రిచ్ మనుషులన్న మాటలు విని తిడతాడు. దారిలో బాలు కనిపించి ప్రభావతిని చూసి షాక్ అవుతాడు. అమ్మేంటీ చీర కాకుండా చుడీదార్ వేసుకుని ట్రెండావతి అయిందని బాలు సెటైర్లు వేస్తాడు. దానికి సత్యం నవ్వుతాడు.

నేమ్ బోర్డ్ కోసం

కారులో నుంచి దిగిన ఓనర్‌ని చూసిన రోహిణి అతన్ని చూస్తే నేమ్ బోర్డ్ తీసుకొచ్చేవాడిలా లేడని అంటుంది. కాదు, అతను పక్కా నేమ్ బోర్డ్ డెలివరి చేసేవాడని, కావాలంటే నిరూపిస్తానని మనోజ్ అంటాడు. కారులో నుంచి వచ్చిన అతన్ని ఏం బాబు చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్, నేమ్ బోర్డ్ ఏదని మనోజ్ వెటకారంగా అడుగుతాడు.

ఇంతకీ, మీరెవరు అని అతను అడుగుతాడు. నేను ఈ విల్లా ఓనర్‌ను గొప్పగా చెప్పుకుంటాడు మనోజ్. ఈ విల్లా ఓనర్ నువ్వా. ఎప్పుడు అని అతను అడిగితే.. రెండు రోజుల క్రితమే ఈ ఇల్లును 3 కోట్లకు నేను కొన్నాను అని మనోజ్ చెబుతాడు. ఏంటీ నువ్వు కొన్నావా, మీరు ఇల్లు ఎవరి దగ్గర కొన్నారని అతను అడుగుతాడు. ఇంటి ఓనర్ దగ్గరే కొన్నామని, అసలు ఎవరు మీరు అని ప్రభావతి చెబుతుంది.

విల్లా నుంచి వెళ్లిపోయిన సత్యం ఫ్యామిలీ

ఈ ఇంటి ఓనర్ నేనేనండి అని అతను చెప్పడంతో సత్యం ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. మనోజ్ నోరెళ్లబెడతాడు. మేము నమ్మం. అతనే ఓనర్ అని ప్రభావతి అంటుంది. మీకు అతను ఏమైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాడా అని రూ. 5 కోట్ల విల్లా అసలైన ఓనర్ అడుగుతాడు. లేదని మనోజ్ అంటాడు.

ఎందుకంటే అవి అతని దగ్గర ఉండవు. మీరు మోసపోయారని తెలుస్తోంది. మీరందరూ మర్యాదగా ఖాళీ చేయండని, ఇక మీ డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం కూడా లేదు అని విల్లా ఓనర్ అంటాడు. దాంతో రోహిణి స్పృహ కోల్పోతుంది. కిందపడబోతుంటే ప్రభావతి పట్టుకుంటుంది. అక్షరాల 30 లక్షల రూపాయలు గోవిందా అని రోహిణి అంటుంది. అంతలోనే పోలీసులు వస్తారు.

సత్యం ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయమని పోలీసులు చెబుతారు. దాంతో సత్యం ఫ్యామిలీ అంతా లగేజ్ సర్దుకుని విల్లా నుంచి వెళ్లిపోతారు. పోలీసుల చేత సత్యం ఫ్యామిలీ బయటకు గెండిస్తాడు ధనవంతుడైన విల్లా అసలు ఓనర్. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe