Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి నిజ స్వరూపం, మోసం, ద్రోహం అన్ని కల్పన ద్వారా బయటపడిపోయాయి. కల్పన దగ్గర అసలు నిజం తెలుసుకున్న బాలు ఇంటికొచ్చి ఇల్లునే కోర్టు బోన్ చేస్తాడు. ఆ కోర్టు బోన్‌లో మనోజ్‌ను నిలబెడతాడు.
సత్యం కష్టం గురించి

జడ్జిగా ప్రభావతిని, దోషులుగా మనోజ్, రోహిణిలను, లాయర్‌గా బాలు ఉంటాడు. బాలు వాదనలు మొదలుపెట్టి సత్యం రాజమండ్రికి వచ్చి చదువుకుని కష్టపడింది, డబ్బు సంపాదించింది అంతా చెబుతాడు. జీవితాంతం సంపాదించిన రూ. 40 లక్షలను మనోజ్ ఎత్తుకెళ్లి, లవర్‌కు ఇచ్చేసి మోసపోవడం అంతా చెబుతాడు. అదంతా తెలుసుని రవి అంటాడు.
అదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే మరోవైపు మనకు తెలియని వింత కథ ఉందని, అదంతా మనోజ్ వికృత రూపమని బాలు చెబుతాడు. ఈ లక్షలు మింగినోడు రెండోసారి కూడా లక్షలు మింగాడు. ఆ 40 లక్షలను మనోజ్ తన ప్రియురాలి దగ్గరి నుంచి వసూలు చేసుకున్నాడని అందరిముందు నిజం బయటపెడతాడు బాలు. దానికి అంతా షాక్ అవుతారు. షటప్ బాలు, నోటికొచ్చినట్లు అనకు అని రోహిణి అంటుంది.
రోహిణి ద్రోహం
నువ్వు చేసిన మోసం, ద్రోహం అన్ని నాకు తెలుసు అని బాలు అంటాడు. తెలుసు అంటే సరిపోదు సాక్ష్యం కావాలి అని రోహిణి అంటుంది. సాక్ష్యమే కాదు సాక్షే వస్తుందని బాలు అంటే ఎవరని రోహిణి అడుగుతుంది. నీ మొగుడి మాజీ ప్రియురాలు కల్పన అని బాలు అనడంతో అంతా అవాక్కవుతారు. రామ్మా కల్పనమ్మా.. అని బాలు పిలవగానే కల్పన వస్తుంది. కల్పనను చూసి మనోజ్, రోహిణి దడుసుకుంటారు.
అప్పుడు అందరిముందు రోహిణి, మనోజ్ నిజ స్వరూపాలను బయటపెడుతుంది కల్పన. మీ 40 లక్షలు మాత్రమే కాదు వడ్డీతో కలిపి రూ. 45 లక్షలు ఇచ్చాను అని కల్పన అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సత్యం నోరెళ్లబెడతాడు. తను వచ్చి ఏదోటి చెబితే నిజమైపోతుందా. మనోజ్ మీద కోపంతో తను, అసూయతో నువ్వు ఇదంతా చేస్తున్నారని రోహిణి ఆరోపిస్తుంది. నువ్వు ఇలా అంటావని తెలిసే సాక్ష్యాలతో కూడా వచ్చాను పార్లరమ్మ అని బాలు అంటాడు.
45 లక్షలు ఇచ్చా
{{/usCountry}}అప్పుడు అందరిముందు రోహిణి, మనోజ్ నిజ స్వరూపాలను బయటపెడుతుంది కల్పన. మీ 40 లక్షలు మాత్రమే కాదు వడ్డీతో కలిపి రూ. 45 లక్షలు ఇచ్చాను అని కల్పన అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సత్యం నోరెళ్లబెడతాడు. తను వచ్చి ఏదోటి చెబితే నిజమైపోతుందా. మనోజ్ మీద కోపంతో తను, అసూయతో నువ్వు ఇదంతా చేస్తున్నారని రోహిణి ఆరోపిస్తుంది. నువ్వు ఇలా అంటావని తెలిసే సాక్ష్యాలతో కూడా వచ్చాను పార్లరమ్మ అని బాలు అంటాడు.
45 లక్షలు ఇచ్చా
{{/usCountry}}దాంతో మనోజ్‌కు 45 లక్షలు ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్‌లో పెట్టిన సంతకం డాక్యుమెంట్, బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ చూపిస్తుంది కల్పన. దాంతో అది నిజమే అని తేలుతుంది. మీ కొడుకు ఇంత పెద్ద విషయం దాచాడు అంటే అది వాడి తెలివితేటలు కాదు మీ ఖిలాడీ కోడలివి అని కల్పన అంతా చెబుతుంది. ఇప్పుడు పూర్తిగా నిజమేంటో, అబద్ధమేంటో అర్థమైందనుకుంటాను అని బాలు అంటాడు.
దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని లాగి తిడుతుంది ప్రభావతి. నేను ఇంట్లో ఇచ్చేద్దామనే చెప్పాను అమ్మా. షో రూమ్ ఓపెన్ చేద్దామని ప్లాన్ చేసింది రోహిణియే, నాకు ఏం తెలియదమ్మా అని ఇరికిస్తాడు మనోజ్. దానికి మరింతగా అంతా అవాక్కవుతారు. వాడితో ఎందుకు అబద్ధం చెప్పించావ్ చెప్పు అని రోహిణిని నిలదీస్తుంది ప్రభావతి. నేను అలా చేయకపోతే మీ అబ్బాయి అడుక్కు తినేవాడని రోహిణి రివర్స్ అవుతుంది.
ప్రభావతి చెంపదెబ్బలు
దాంతో రోహిణిని ఏమన్నావే అని లాగి చెంపదెబ్బ కొడుతుంది అత్త ప్రభావతి. రోహిణి ఎడాపెడా బాదుతుంది. అయితే, ఇప్పటివరకు తనను అత్త కొట్టినట్లు కలలు మాత్రమే కనేది. ఈసారి మాత్రం రియల్‌గా జరిగింది. అసలు రాబట్టిన డబ్బులు ఎవరివి నీ బాబువా.. చెప్పు అని రోహిణిపై కోపంతో ప్రభావతి ఉగ్ర తాండవం చేస్తుంది. ఉగ్రరూపం చూపిస్తుంది అత్త. అలా మనోజ్ షో రూమ్‌కి డబ్బులు ఇచ్చింది రోహిణి తండ్రి కాదనే నిజం తెలుస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ సీరియల్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.