...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి మొహంతో దిష్టి బొమ్మ- మనోజ్‌కు 5 కోట్ల విల్లా ఆఫర్- మీనాకు పెళ్లి సంబంధం

Gunde Ninda Gudi Gantalu Serial April 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 23వ ఎపిసోడ్‌లో ప్రభావతి మొహంతో దిష్టి బొమ్మలు అమ్ముతాడు. వాటన్నంటిని మనోజ్ కొంటాడు. దాంతో మనోజ్‌కు 10 లక్షల లాభంతోపాటు 5 కోట్ల విల్లా 3 కోట్ల ఆఫర్‌కు వస్తుంది. ప్రభావతి దిష్టి బొమ్మపై బాలు సెటైర్లు వేస్తాడు.

Published on: Apr 23, 2026, 08:56:00 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు మీనా కాల్ చేసి ఒకడు వెంటపడుతున్నాడని బాలు శిష్యుడి గురించే చెబుతుంది. దాంతో బాలు కోప్పడుతాడు. వాడు ఇంకోసారి కనిపిస్తే నాకు కాల్ చేయమని, పెప్పర్ స్ప్రే ఒకటి కొనుక్కో. వాడి కళ్లలో కొడితే వాడే పారిపోతాడు అని బాలు చెబుతాడు. సరేనని మీనా అంటుంది.

బాగా లాభాలు వస్తున్నాయి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 23rd ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 23rd ఎపిసోడ్

మరోవైపు ముంబై ముఖేష్‌తో బిజినెస్ చేసినప్పటి నుంచి బాగా లాభాలు వస్తున్నాయిగా అని రోహిణి అంటే.. అవును. కానీ ఎంత వస్తుందో తెలియట్లేదు. కొన్నిరోజులు పోతే తెలుస్తుందని మనోజ్ అంటాడు. ఇంతలో ఒకతను వచ్చి మీ మీద దిష్టి పడిందని, అంది పోవాలంటే దిష్టి బొమ్మ పెట్టుకోవాలని భయపెడతాడు. అతను ఇచ్చిన దిష్టిబొమ్మ ఇదివరకు ప్రభావతిపై పిండి పడినప్పుడు శ్రుతి తీసిన ఫొటో.

ప్రభావతి ఫొటోనే దిష్టిబొమ్మలా చేసి అమ్ముతారు. ఆ దిష్టిబొమ్మలు దేశమంతా పాపులర్ అవుతున్నాయని అతను చెబుతాడు. దీన్ని చూస్తుంటే ఏదో శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. నాలో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయంటాడు మనోజ్. ఆ ఫొటో చూసిన రోహిణి అది ప్రభావతి పిండి పడిన ఫొటో అని కనిపెడుతుంది. శ్రుతి ఫొటో తీసి స్టేటస్ పెట్టిన విషయం, దీన్ని ఎవరో స్క్రీన్ షాట్ తీసి బిజినెస్ చేసుకుంటున్నారని మనోజ్‌కు చెబుతుంది రోహిణి.

ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనోజ్ అడిగితే.. ఇది తమిళనాడు నుంచి వచ్చిందని, ఒక్కో ఫొటో 200 అని అతను చెబుతాడు. ఆ ఫొటోలన్నీ తనే కొంటానని, ఇంకోసారి ఈ ఫొటోలు అమ్మితే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పంపిస్తాడు మనోజ్. ఈ ఫొటో అమ్మ కంటికి కనిపించకూడదని రోహిణితో మనోజ్ చెబుతాడు. మరోవైపు మీనా దగ్గరికి వెంటపడే అతను మళ్లీ వస్తాడు. మీనా పెప్పర్ స్ప్రేతో అతని దగ్గరికి వెళ్తుంది.

పారిపోయిన బాలు శిష్యుడు

సరే వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసా అని బాలు అడిగితే.. తెలుసు, వాళ్ల నాన్న కళ్లజోడు పెట్టుకుని తెల్లగా ఉంటాడు. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు వదినలు ఉన్నారని మీనాకు మామ సత్యంను నాన్నను, మనోజ్, రవిలను అన్నయ్యలను చేస్తాడు బాలు శిష్యుడు. వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి కాళ్లమీద పడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మావయ్య అని చెప్పు అని బాలు ఐడియా ఇస్తాడు. దాంతో సరేనని వెళ్లిపోతాడు బాలు శిష్యుడు.

మరోవైపు ఇంట్లో ప్రభావతిని దిష్టి బొమ్మతో పోలుస్తాడు బాలు. దాంతో ప్రభావతి కోప్పడుతుంది. ఓసారి అటు చూడు అని మనోజ్ చేతిలో ఉన్న ప్రభావతి దిష్టి బొమ్మను చూపిస్తాడు బాలు. దాంతో షాక్ అవుతుంది ప్రభావతి. నార్త్ నుంచి సౌత్ వరకు ఇలాంటి దిష్టి బొమ్మలే కావాలని అంటున్నారట అని తన క్రేజ్ గురించి చెబుతాడు మనోజ్. అదే విని దేశానికే దిష్టి పోతుందట దీని ద్వారా అని బాలు అంటాడు. దాంతో ఇంట్లేవాళ్లంతా నవ్వుతారు.

దిష్టి బొమ్మల బిజినెస్

దిష్టి బొమ్మలన్ని నేనే కొన్నా అని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి కోప్పడుతుంది. రవి రెస్టారెంట్‌కు, మా అమ్మ ఇంటికి పంపుతానని శ్రుతి అంటుంది. దాంతో సరేనని మనోజ్ అంటాడు. దాంతో కోపంతో ఫొటో పడేస్తుంది ప్రభావతి. అది సత్యం కాళ్ల ముందు పడుతుంది. అది చూసిన సత్యం ఇంతకాలం నేను దిష్టిబొమ్మన పెళ్లి చేసుకుని కాపురం చేసిందని మరింత సెటైర్లు వేస్తాడు సత్యం. నీ నిజరూపం ఇదా. వాడికి ఎలా తెలిసిందబ్బా అని సత్యం అంటాడు.

దీనంతటికి కారణం నీ పెళ్లామని మీనాను అంటుంది ప్రభావతి. మీ మొహం దిష్టి బొమ్మలా ఉంటుందని నేను ఎవరికి చెప్పలేదని మీనా అనడంతో అంతా పగలబడి నవ్వుతారు. నీకు బాగా దిష్టి తగులుతుంది మీనా. ఇదే దిష్టి బొమ్మను లాకెట్‌లా వేసుకో దిష్టి పోతుందని బాలు అంటాడు. ఆహా ఇంతమంచి ఐడియా బాలుకు తప్పా ఎవరికి రాదు. దీని పెటెంట్ రైట్స్ నీకే. డీలర్ షిప్ మాకు ఇవ్వు అని శ్రుతి అంటుంది.

నీకు నార్త్ ఇండియా, పార్లరమ్మకు సౌత్ ఇండియా. మలేషియా డీలర్‌షిప్ అమ్మకు. వెళ్లి జైలు ముందు కూర్చుని అమ్ముకుంటుంది అని బాలు అంటాడు. దాంతో అంతా తెగ నవ్వేస్తారు. దానికి బాలును కిందపడేసి చితక్కొడుతుంది. ప్రభావతి ఫొటోనే పట్టుకుని నాకు ఏ దిష్టి తగలకుండా చూడమ్మా అని బాలు అంటాడు. మళ్లీ మీనానే నిందిస్తుంది. దాంతో మీ వల్లే పిండి మీద పడిందని, బాగా గుర్తు చేసుకోమ్మని చెబుతుంది మీనా.

కొడుకులు అమ్ముకోని

ఈ ఫొటో నా వల్ల బయటకు వెళ్లిందని, నేనే స్టేటస్ పెట్టుకున్నా. అది ప్రింట్ తీసుకుని బాగా బిజినెస్ చేస్తున్నారు అని శ్రుతి అంటుంది. అమ్మ దిష్టి బొమ్మను అమ్ముకునే హక్కు మనకే ఉంటుందని బాలు అంటాడు. ఒక్కోటి రెండు వందలు అని మనోజ్ అంటే.. వంద అమ్మితే 20 వేలు కదరా అని బాలు అంటాడు. వేరే వాళ్ల బదులు మన కొడుకులు అమ్ముకోని అని సత్యం అంటాడు. షాప్‌లో ఉన్న దిష్టి బొమ్మలు తగలబెట్టమని మనోజ్‌ను ప్రభావతి అంటుంది.

నేను అమ్మకుంటే ఇంకోడు అమ్ముతాడమ్మా అని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి అరుస్తుంది. మరోవైపు షాప్లో ప్రభావతి దిష్టి బొమ్మకు వర్కర్ పూలు పెడతాడు. దాంతో కోప్పడి తీయించేస్తాడు మనోజ్. ఇంతలో ముఖేష్ కాల్ చేసి 10 లక్షల లాభం వచ్చిందని చెబుతాడు. దాంతో మనోజ్ తెగ సంతోషిస్తాడు. ఇదంతా అత్తయ్య ఎఫెక్టేనా అని రోహిణి అంటుంది. అవును అని చెప్పిన మనోజ్ తల్లి దిష్టి బొమ్మను తీసుకొచ్చి పెట్టమని, పూలదండ కూడా వేయమని ఐదు వందలు ఇస్తాడు.

అత్తయ్య చూస్తే సమస్య అవుతుందని రోహిణి చెప్పడంతో వద్దని మళ్లీ ఐదు వందలు తీసుకుంటాడు మనోజ్. ఇంతలో మనోజ్ ఫ్రెండ్ వచ్చి ఏంటీ గుడ్ న్యూస్ అని అడుగుతాడు. బిజినెస్ సీక్రెట్ అని చెప్పడు. నాకు పార్క్‌లో ఒకతను కలిశాడు. ఇక్కడ ఐదు కోట్ల విలువ చేసే విల్లా ఉంది. అది మూడు కోట్లకు ఇస్తానంటున్నాడని. మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మీ వాల్యూ పెరుగుతుందని చెబుతాడు.

మీనాకు పెళ్లి సంబంధం

ముందు వెళ్లి చూద్దాం. తర్వాత ఆలోచిద్దామని రోహిణి అంటుంది. ఇవాళ అంత మంచే జరుగుతుందని తల్లి దిష్టి బొమ్మ ఫొటోను షాప్‌లో పెడతాడు మనోజ్. అమ్మ తన ఫొటో రూపంలో లాభం తీసుకొస్తుందని మనోజ్ అంటాడు. మరోవైపు సత్యం ఇంటికి బాలు శిష్యుడు మీనా పెళ్లి సంబంధం గురించి మాట్లాడేందుకు వస్తాడు. నా పేరు మురళి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. నెలకు 50 వేల జీతం మావయ్య అని చెబుతాడు.

ఎవరు కావాలి, ఎందుకు బయోడేటా చెబుతున్నావని రవి అడుగుతాడు. నా పెళ్లి విషయం మాట్లాడేందుకు వచ్చాను. మావయ్య గారు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని మురళి అంటాడు. మా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడ పిల్లలు లేరు అని రవి అంటాడు. ఇంతలో మీనా వస్తుంది. అచ్చం మీలాగే ఉన్న మీనా మీ కూతురే కదా అని మురళి అంటాడు.

నువ్వు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చింది తనకేనా అని రవి అంటే.. అవును అని మురళి అంటాడు. దాంతో సత్యం షాక్ అవుతాడు. మురళిపై మీనా తెగ కోప్పడుతుంది. అతను ఎందుకు వచ్చాడో శ్రుతి చెప్పడంతో తెగ షాక్ అవుతుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe