Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యంకు స్వీట్స్ ఇస్తే ప్రభావతి వచ్చి తిడుతుంది. దాంతో ప్రభావతిని వారిస్తాడు సత్యం. ఇంతలో బాలు వస్తే.. తన డెకరేషన్ అందరికి నచ్చిందని, ఇక మంచి ఆర్డర్స్ వస్తాయని మీనా చెబుతుంది. బాలు సంతోషిస్తాడు. ఈ పనులన్నీ పెట్టుకుంటే ఇక అది చేతికి దొరకదు అని ప్రభావతి అంటుంది.
నెత్తిమీద డ్యాన్స్ చేస్తుంది

ఇప్పుడు మీనా అన్ని పనులు చేసే వెళ్తుందిగా అని బాలు అంటే.. ఇలాగే వెనుకేసుకురా ఏదో రోజు అది నీ నెత్తిమీద డ్యాన్స్ చేస్తుందని ప్రభావతి అంటుంది. అలాంటి రోజు రాదని బాలు అంటాడు. తర్వాత బాలు, మీనా మాట్లాడుకుంటారు. ఇంకో మెట్టు ఎక్కావన్నమాట అని బాలు అంటాడు. చిన్న మీనా కాస్తా పెద్ద మీనా అవుతుందని మీనా అంటుంది. నేను ఎంత సంపాదించిన ఆ డబ్బు మీ దగ్గరే ఉండాలని డబ్బు ఇస్తుంది మీనా.
ఈ డబ్బులు రావడం చూస్తుంటే మనం త్వరలోనే పైన రూమ్ కడతామనిపిస్తుంది. ఇలాగే వస్తే మీ కన్న ఎక్కువ డబ్బు సంపాదిస్తానేమో అనిపిస్తుందని మీనా అంటుంది. దాంతో బాలు కొంచెం అప్సట్ అయి మీనా సంపాదనపై అసూయపడతాడు. ఇలాగే బిజినెస్ డెవలప్ అయితే కార్లు కూడా కొనుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకో కారు కొనిస్తానేమో. మీరు డ్రైవర్‌గా కాకుండా నా బిజినెస్‌లోకి వస్తారని మీనా అంటుంది. కాస్తా నిరాశపడిన బాలు నీకు నచ్చినట్లే చేద్దామంటాడు బాలు.
మీనాకే డబ్బు ఇచ్చి లోపల పెట్టమంటాడు బాలు. మరుసటి రోజు ఉదయం మీనా కోసం కస్టమర్ వచ్చి అడుగుతాడు. బాలు ఉంటాడు. తను పూలకోసం వెళ్లింది. నాకు చెప్పండని బాలు అంటే.. అది మీకెలా తెలుస్తుంది. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఏ పూలు కావాలి, ఎంత అవుతుంది ఆమె చెబుతుందని అతను అంటాడు. ఆ మాటలు ప్రభావతి చూస్తుంది. ఫోన్ రావడంతో కస్టమర్ వెళ్తాడు.
కూలోడిని చేస్తుందిరా
బాలును పిలిచి ప్రభావతి తెగ నవ్వుతుంది. ఛీ ఏం బతుకు అయిందిరా నీది. అది పెద్ద బిజినెస్ వుమెన్ అయింది. అది నిన్ను కూలోడిని చేస్తుందని ఎక్కిస్తుంది ప్రభావతి. ఇంతలో మీనా వచ్చి కస్టమర్‌ను లోపలికి తీసుకొస్తుంది. డిజైన్స్ చూపిస్తానని మొబైల్ కోసం పైకి వెళ్తుంది. బాలు కూర్చొంటే ఆ కుర్చీలో తను కూర్చొంటానని కూర్చొంటాడు. నీళ్లు అడుగుతాడు. దాంతో బాలు తెస్తాడు. అదంతా చూస్తూ ప్రభావతి నవ్వుతుంది.
{{/usCountry}}బాలును పిలిచి ప్రభావతి తెగ నవ్వుతుంది. ఛీ ఏం బతుకు అయిందిరా నీది. అది పెద్ద బిజినెస్ వుమెన్ అయింది. అది నిన్ను కూలోడిని చేస్తుందని ఎక్కిస్తుంది ప్రభావతి. ఇంతలో మీనా వచ్చి కస్టమర్‌ను లోపలికి తీసుకొస్తుంది. డిజైన్స్ చూపిస్తానని మొబైల్ కోసం పైకి వెళ్తుంది. బాలు కూర్చొంటే ఆ కుర్చీలో తను కూర్చొంటానని కూర్చొంటాడు. నీళ్లు అడుగుతాడు. దాంతో బాలు తెస్తాడు. అదంతా చూస్తూ ప్రభావతి నవ్వుతుంది.
{{/usCountry}}మీనా వచ్చి డిజైన్స్ చూపిస్తుంది. అతను చూసి ఒకటి ఓకే చేస్తాడు. ఇంతలో ప్రభావతి పిలిచి కాఫీ పెట్టివ్వు అంటుంది. దాంతో సరేనంటుంది మీనా. ఆవిడ ఏదైనా పని మీద వెళ్లారా అని కస్టమర్ అంటే.. మీరు తొందర్లో ఉన్నట్లున్నారు. అడ్వాన్సే కదా నేను ఇస్తానని బాలు అంటాడు. మీరు ఆవిడ భర్త. ఆర్డర్ తీసుకునేది ఆవిడ కదా. ఏదైనా డిస్కౌంట్ అడిగితే ఆవిడే కదా ఇచ్చేదని కస్టమర్ అంటాడు.
ఇలా ప్రతి విషయంలో బాలును అవమానిస్తాడు కస్టమర్. ప్రభావతికి కాఫీ ఇచ్చి మీనా వస్తుంది. డిస్కౌంట్ గురించి అడిగితే 100కి పది తక్కువ తప్పా ఎక్కువ తీసుకోనంటుంది మీనా. అది చాలని రూ. 10 వేలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లిపోతాడు ఆ కస్టమర్. అతనికి ఎంత పొగరు అని తనకు అడ్వాన్స్ ఇవ్వనిది, తనను నమ్మలేదని చెబుతాడు బాలు. ఆయనకు మీ గురించి తెలియదుగా. పది వేలు అడ్వాన్స్ వచ్చింది. మీకంటే ఎక్కువ సంపాదిస్తానేమో. ఒక్కరోజులోనే మీకంటే ఎక్కువ సంపాదించాను. జాగ్రత్త మీనా మేడమ్ అని పిలవాలని చెప్పి మీనా వెళ్లిపోతుంది.
నీతో చెప్పులు మోయిస్తుందిరా
అదంతా చూసిన ప్రభావతి వచ్చి బాలు మొహం చూసి తెగ నవ్వుతుంది. కొంచెం డబ్బు సంపాదిస్తే అది నీతో చెప్పులు మోయిస్తుందిరా అని నవ్వుకుంటుంది ప్రభావతి. తర్వాత మీనా వచ్చి బాలు గురించి అడిగితే.. ప్రభావతి నవ్వి వెళ్లిపోతుంది. సత్యం వచ్చి బాలు గురించి అడుగుతాడు. కాసేపటికి బాలుకు కాల్ చేస్తుంది మీనా. కానీ, బాలు లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. ఈయనకు ఏమైందని అనుకుంటుంది మీనా.
ఇంతలో శ్రుతి, ప్రభావతి, సత్యం వస్తారు. టిఫిన్ ఏం చేశావ్. అన్ని నీ మొగుడుకి నచ్చినవే చేస్తావా అని అరుస్తుంది ప్రభావతి. ఎహే.. ఏంటీ లొడలొడ వాగుతున్నారు. ఆయనకోసం పూరీ కుర్మా చేస్తే ఒక్కడే తింటాడా. అంతా కూడా ఇష్టంగానే తింటారు. మీకోసం ఇడ్లీ సాంబార్ చేశానని చెప్పేలోపే అరుస్తున్నారు. ఆయన గురించి అడిగితే నవ్వారు. మీకు మతిస్థిమితం తప్పిందని నేను అన్నానా అని అత్త ప్రభావతిపై విరుచుకుపడుతుంది మీనా.
దాంతో భయపడిపోయిన ప్రభావతి సైలెంట్‌గా వచ్చి టిఫిన్ చేస్తుంది. మీనానా కొంచెం చిరాకుగా ఉంటుంది. అది గమనించిన సత్యం ఏమైందని అడుగుతుంది. బాలు తినకుండా వెళ్లింది చెప్పి ఫీల్ అవుతుంది మీనా. మళ్లీ బాలుకు మీనా ఎన్నిసార్లు కాల్ చేసిన కట్ చేస్తాడు. దాంతో భయపడిన మీనా రాజేష్‌కు కాల్ చేసి అడుగుతుంది. ఇందాకే అరగంట సేపు మాట్లాడాడు అని రాజేష్ చెబుతాడు.
ప్రభావతి డ్యాన్స్ అకాడమీ
నేను ఫోన్ చేస్తే కట్ చేస్తారా. అదే రాజేష్ అన్నయ్యతో అరగంట మాట్లాడుతారా అని మీనా అనుకుంటుంది. మరోవైపు ప్రభావతి మొహం దిష్టిబొమ్మకు కామాక్షి హారతి ఇస్తుంది. అది చూసిన ప్రభావతి కోపంతో చూసి ఆ ఫొటోను తీస్తుంది. అది చాలా మహిమగల ఫొటో అని, నీ మొహం ఎవరికి ఉపయోగపడదు. అందరికి ఉపయోగపడుతుంది. మార్కెట్‌లో బ్రహ్మరాక్షసి ఫొటో అంటే బాగా డిమాండ్ ఉందని చెబుతుంది కామాక్షి.
కోపంతో ఆ ఫొటోను బయటపడేస్తుంది. దాంతో కుక్కలు మొరుగుతాయి. మళ్లీ ఆ ఫొటోను తిరిగి తీసుకొస్తుంది ప్రభావతి. తీసుకెళ్లి స్టోర్ రూమ్‌లో పెడుతుంది ప్రభావతి. మనోజ్ వాళ్లు కొత్త ఇల్లు కొనబోతున్నారు. 3 కోట్లతో కొత్త విల్లా కొంటున్నారు. అక్కడ ఒకేసారి 100 మందికి డ్యాన్స్ చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నవాళ్లు వస్తే వస్తారు లేకుంటే లేదు. అక్కడ అంతా డబ్బున్నవాళ్లే కదా. వాళ్లే వస్తారు. ఇక నా డ్యాన్స్ స్కూల్‌ని డ్యాన్స్ అకాడమీగా మారుస్తాను అని ప్రభావతి అంటుంది.
ఆ మాటలు విన్న ప్రేమ్, ప్రియ నిరాశపడుతారు. క్లాస్ మార్చేస్తే ఎలా. మనం పెళ్లి చేసుకుందామా అని ప్రియ అంటుంది. ఏదోటి చేస్తాలే అని ప్రేమ్ అంటాడు. అలా పెళ్లికి రెడీ అవుతుంది ప్రేమజంట. మరోవైపు బాలుకు కాల్ చేస్తే బిజీ వస్తుంది. దాంతో ఏమైందని మీనా బాధపడుతుంది. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగదు కదా అని దేవుడిని మొక్కుంటుంది మీనా. ఇంతలో సత్యం వచ్చి అడుగుతాడు.
తాగి పడిపోయాడేమో
మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని సత్యం అంటాడు. అలాంటిదేం లేదని మీనా చెబుతుంది. ఏం లేకుండానే కాల్ లిఫ్ట్ చేయడా. వాడు చిన్న దానికే కోప్పడుతాడు అని ప్రభావతి అంటుంది. నేను ఏమైనా అన్నానా అని ఎంత ఆలోచించినా తెలియట్లేదని మీనా అంటుంది. పొరపాటున నీ నెంబర్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లిపోయిందేమో అని సత్యం అంటాడు. అయితే, ఎన్నిసార్లు కాల్ చేసిన లాభం లేదు అంటుంది మీనా.
ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. లేదా ఎవరో కొట్టి పడేసి ఉంటారు అని ప్రభావతి అంటుంది. దాంతో ప్రభావతిని తిడుతాడు సత్యం. ఆయన మందుకు దూరంగా ఉంటున్నారు. ఆ నమ్మకం నాకుందని మీనా అంటుంది. ఇలా మీనా కాపురంలో కస్టమర్ వల్ల కలతలు వస్తాయి. మీనాపై బాలు అసూయ పుట్టి కోపంగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.