Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్‌లో శివ కోసం రూ. 5 లక్షల అప్పు చేస్తారు బాలు, మీనా. ఆ అప్పు తీర్చేందుకు తనకు ఓ ఉపాయం వచ్చిందని, పెళ్లిళ్లకు ఫ్లవర్ డెకరేషన్ చేస్తారుగా, ఆ ఆర్డర్ తీసుకుంటే ఎలా ఉంటుంది. కావాలంటే సాంపిల్ చేసి చూపిస్తానని మీనా అంటుంది.
నిజం తెలుసుకున్న రోహిణి

దాంతో బాలు ఆశ్చర్యపోయి చాలా మంచి ఐడియా అని, నీ కొత్త ఆలోచనకు స్వాగతం మీనా అని అంటాడు. మరోవైపు అత్తలో మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కామాక్షి ఇంటికి వెళ్తుంది రోహిణి. కామాక్షి పని చేస్తుంది. మీకు బాడీ పెయిన్స్ ఉంటే మసాజ్ చేయనా అని అడుగుతుంది. కామాక్షి వద్దంటుంది. ఏం కాదని కామాక్షికి మసాజ్ చేస్తుంది రోహిణి. మెల్లిగా మాటల్లో పెట్టి అత్తయ్య ఇంటికి రాదనుకున్నా. దేవుడే మనసు మార్చాడు అని రోహిణి అంటుంది.
దేవుడు ఎక్కడ మార్చాడు. లాయర్ ఇచ్చిన రెండు లక్షలు మార్చాయ్ అని కామాక్షి అంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. రెండు లక్షలు ఏంటీ అని రోహిణి అంటే.. మరి ఎవరికి చెప్పకు అని శివ లాయర్ వచ్చి మాట్లాడింది అంతా నిజం చెప్పేస్తుంది కామాక్షి. డబ్బుల కోసం ఇలా చేసిందా. డబ్బు రుచి చూపిస్తే ఏమైనా చేస్తుందా అని రోహిణి అనుకుంటుంది. మీరు అబద్ధం చెబుతున్నారు నేను నమ్మను అని రోహిణి అంటుంది.
దాంతో వంటింట్లోకి తీసుకెళ్లి లాయర్ ఇచ్చిన 2 లక్షలు చూపిస్తుంది కామాక్షి. సరే పిన్ని అత్తయ్య ఇంటికి వచ్చారు అదే చాలు అని వెళ్తుంది రోహిణి. డబ్బు విషయం మాత్రం తెలియనట్లే ఉండమని కామాక్షి అంటుంది. మరోవైపు బాలు కళ్లు మూసి కిందకు తీసుకొస్తుంది మీనా. పెళ్లి మండపం డెకరేషన్ చేసిన డెమో చూపిస్తుంది. అది చాలా బాగుందని, లైటింగ్ కూడా బాగా వేశావని బాలు మెచ్చుకుంటాడు.
ఫ్యాన్సీ చీరలో మీనా
అక్కడ ఉన్న కొటేషన్ కూడా బాలుకు బాగా నచ్చుతుంది. దాన్ని బాలు ఫొటోలు తీస్తాడు. ఇంతలో శ్రుతి వస్తే ఫంక్షన్స్ ఆర్డర్ ఐడియా గురించి చెబుతుంది మీనా. అద్భుతంగా ఉందని శ్రుతి మెచ్చుకుంటుంది. మౌత్ టాక్ పబ్లిసిటీ మాత్రమే కాదు ఆన్లైన్ మార్కెట్ కూడా చేయాలి. వెబ్‌సైట్ పెట్టి పోస్టులు పెడితే బాగా మార్కెట్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ నేను క్రియేట్ చేస్తానని శ్రుతి అంటుంది.
{{/usCountry}}అక్కడ ఉన్న కొటేషన్ కూడా బాలుకు బాగా నచ్చుతుంది. దాన్ని బాలు ఫొటోలు తీస్తాడు. ఇంతలో శ్రుతి వస్తే ఫంక్షన్స్ ఆర్డర్ ఐడియా గురించి చెబుతుంది మీనా. అద్భుతంగా ఉందని శ్రుతి మెచ్చుకుంటుంది. మౌత్ టాక్ పబ్లిసిటీ మాత్రమే కాదు ఆన్లైన్ మార్కెట్ కూడా చేయాలి. వెబ్‌సైట్ పెట్టి పోస్టులు పెడితే బాగా మార్కెట్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ నేను క్రియేట్ చేస్తానని శ్రుతి అంటుంది.
{{/usCountry}}మీనాను కూడా ఫొటోలు తీయాలని, నేను తీసుకొచ్చిన ఫ్యాన్సీ చీరలు కట్టుకోమ్మని శ్రుతి చెబుతుంది. ముందు ఒప్పుకోని మీనా బలవంతం చేయడంతో ఒప్పుకుంటుంది. ఫ్యాన్సీ చీరలో మీనా చాలా అందంగా ఉంటుంది. దాంతో బాలు ఫిదా అయి సూపర్‌గా ఉన్నావని మెచ్చుకుంటాడు. బాలు, మీనాలు రొమాంటిక్ పోజులు పెడితే శ్రుతి ఫొటోలు తీస్తుంది. డెకరేషన్స్ గురించి మీనా చెబుతుంది. దాన్ని శ్రుతి వీడియో తీస్తుంది.
మరోవైపు విద్యకు ప్రభావతి తీసుకున్న డబ్బు గురించి చెబుతుంది రోహిణి. గుణ కాల్ చేసి డబ్బులు అడుగుతాడు. వాడు చస్తే వాడి శవాన్ని నీ ఇంటి ముందు పడేసి వెళ్తానని, వాడు చస్తాడు మీరు జైలుకు వెళ్తారు అని బెదిరిస్తాడు గుణ. అదే విషయం విద్యకు రోహిణి చెబుతుంది. తర్వాత ఎలాగైనా సరే కామాక్షి దగ్గరున్న డబ్బులు కొట్టేయాలని అనుకుంటుంది రోహిణి. విద్యను వెంట పట్టుకుని కామాక్షి ఇంటికి వెళ్తుంది.
విద్యతో రోహిణి దొంగతనం
కిచెన్‌లో అక్కడుంది. అందులో డబ్బు ఉంది అని విద్యకు రోహిణి చెబుతుంది. నువ్వు డైవర్ట్ చేయి నేను చూసుకుంటాను అని విద్య అంటుంది. ఏంటీ ఇలా వచ్చారని ప్రభావతి అడుగుతుంది. పందెంలో మీరు నన్ను గెలిపించాలి. మీరు ఏ పాటకు అయిన అవలీలగా నాట్యం చేయగలరని చెబితే విద్య చేయలేదంది. నేను పంతంతో ఐదు వేలు పందెం కట్టాను అని రోహిణి అంటుంది. అయితే, ఇవాళ నీకు ఆదాయం 5 వేలు అని ప్రభావతి అంటుంది.
ప్రభావతి డ్యాన్స్ చేస్తుంది. రోహిణి వీడియో తీస్తుంది. కామాక్షి కూరగాయలు కట్ చేస్తుంది. కామాక్షి అడ్డుగా ఉండటంతో విద్య వెళ్లలేకపోతుంది. దాంతో స్టూడెంట్‌కు ఫోన్ ఇచ్చి కామాక్షిని తీసుకొస్తుంది రోహిణి. అంతా ప్రభావతి డ్యాన్స్ చూసేలా చేస్తుంది రోహిణి. ఇక వంటింట్లోకి విద్య వెళ్తుండగానే ప్రభావతి డ్యాన్స్ అయిపోతుంది. అంతా చప్పట్లు కొడతారు. దాంతో విద్య ఆగిపోతుంది.
ఇంకో సాంగ్ పెడుతుంది విద్య. దానికి కూడా ప్రభావతి డ్యాన్స్ చేస్తుంటుంది. విద్య మెల్లిగా కిచెన్‌లోకి వెళ్లి డబ్బాలో ఉన్న రెండు లక్షలు కొట్టేస్తుంది. బయటకు వచ్చి సక్సెస్ అని రోహిణికి చెబుతుంది విద్య. ప్రభావతి డ్యాన్స్‌కు కామాక్షి ఫిదా అయి పడిపోతుంది. రోహిణి గెలవడంతో విద్య ఐదు వేలు ఇస్తుంది. ప్రభావతి, కామాక్షి, రోహిణి, విద్య, స్టూడెంట్స్ అంతా కలిసి డ్యాన్స్ చేస్తారు. తర్వాత ముందే గెలుస్తారని తెలిసి స్వీట్స్ తీసుకొచ్చానని ఇస్తుంది రోహిణి.
బాలు ప్రియురాలు
అలా విద్యతో ప్రభావతి రెండు లక్షలు కొట్టేస్తుంది రోహిణి. మరోవైపు మీనాకు ర్యాంప్ వాక్ నేర్పిస్తుంది శ్రుతి. ఫ్యాన్సీ చీరలో మీనా ర్యాంప్ వాక్ చేస్తుంది. మీనా వెళ్లిపోతుంటే బాలు రొమాంటిక్‌గా పట్టుకుంటాడు. ఇంతలో రవి వస్తాడు. ర్యాంప్ వాక్‌కు ఎంకరేజ్ చేస్తాడు. మీనాను డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుంది శ్రుతి. మీనా కొంగు బాలు పట్టుకుని ఉంటాడు. దాన్ని మెట్లపై నుంచి టాప్ యాంగిల్‌లో శ్రుతి ఫొటో తీస్తుంది.
కానీ, అది ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మనోజ్, రోహిణి, ప్రభావతి షాక్ అవుతారు. అమ్మా వీడు వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడని మనోజ్, కొత్త అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడని రోహిణి అంటుంది. రవి, శ్రుతి మెట్లపైనే దాక్కుంటారు. ఎవర్రా అమ్మాయి అని ప్రభావతి అరిస్తే.. ఈవిడ నా కొత్త ప్రియురాలు. ముంబై నుంచి వచ్చిన మోడల్ అనిబాలు చెబుతాడు.
దాంతో అంతా షాక్ అవుతారు. వాళ్లకు మీనాను చూపించకుండా మరింత ఎక్కువగా రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తాడు బాలు. మీనా ఎక్కడరా. మీనా నీ కాపురం వీడు ముక్కలు చేసేలా ఉన్నాడే అని అరుస్తుంది ప్రభావతి. అది పూలమ్మడానికి పోయింది. దీనికి తెలుగులో తిడితే తెలియదు. దీని పేరు మీనాక్షి శేషాద్రి అని చెబుతాడు బాలు. రవి, శ్రుతి నవ్వుతారు. మీనాకు ఫోన్ చేయమని రోహిణి చెప్పి మొబైల్ తీసుకుంటుంది ప్రభావతి.
మీనాపై అత్త ప్రేమ
ఒసేయ్ మీనా ఎక్కడ చచ్చావే అని ప్రభావతి అరిస్తే ఇక్కడే చచ్చాను అని మీనా మొహం చూపిస్తుంది. మీనాను చూసి అంతా షాక్ అవుతారు. మీనా కొత్త బిజినెస్, ఫొటోల గురించి చెబుతుంది. హో అదా.. వీడు నీకు ద్రోహం చేస్తున్నాడనుకున్నాను అని ప్రభావతి అంటుంది. నాకు ద్రోహం జరుగుతుందని మీరు ఆరాటపడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది అని మీనా అంటుంది. అదేం లేదని కవర్ చేసి వెళ్లిపోతుంది ప్రభావతి.
అత్తయ్యకు నా మీద ప్రేమ ఉందని మీనా మురిసిపోతుంది. తర్వాత గుణకు రోహిణి కొట్టేసిన 2 లక్షలు ఇస్తుంది. రోహిణి వాళ్లకు స్వీట్ బాక్స్ ఇచ్చి ఇక దినేష్ గాడి చాప్టర్ క్లోజ్ చేస్తున్నా అని, వాడి గొడవ మీకు ఉండదుగా అని, హ్యాపీగా ఉండొచ్చని చెబుతాడు గుణ. నేరుగా వాడిని కేరళకు పంపించి హెల్త్ సెట్ అయ్యాక నార్త్ పంపిస్తానని గుణ చెబుతాడు. త్వరగా చేయమని రోహిణి, విద్య వెళ్లిపోతారు.
దినేష్‌ను పిలిచి ఈ బంగారు బాతును వదులుకోవద్దు. అవసరమైనప్పుడులా డబ్బు తెప్పించుకోవచ్చని చెబుతాడు గుణ. దినేష్‌కు లక్ష ఇచ్చి 2, 3 నెలలు ఇక్కడికి రాకని, ఇక్కడ తాను చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు గుణ. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.