...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాను కొడతానన్న ప్రభావతి- 10 లక్షల చెక్ చింపేసిన బాలు- రోహిణికి శాశ్వత వనవాసం

Gunde Ninda Gudi Gantalu Serial August 21st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో మనోజ్ షాప్‌లోకి రోహిణి ఏర్పాటు చేసిన వ్యక్తి వచ్చి పెద్ద ఆర్డర్ ఇస్తాడు. రోహిణి ఉంటేనే ఆర్డర్ తీసుకుంటానంటాడు. ఇంట్లో రోహిణిని డ్రైనేజీతో పోల్చిన ప్రభావతి మీనాను కూడా కొడతానంటుంది.

Published on: Aug 21, 2026, 08:31:36 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ ఈగలు తోలుకుంటూ ఉంటాడు. రోహిణి ఉన్నప్పుడు షాప్ కళకళలాడేది. ఇప్పుడు వెలవెలలాడుతుంది. ఏమైనా చేసి రోహిణి లేకున్నా కూడా షాపును లాభాల్లోకి తీసుకురావాలి అని మనోజ్ అనుకుంటాడు.

అంబానీ చుట్టంలా ఉన్నాడు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 21 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 21 ఎపిసోడ్

ఇంతలో మనోజ్ షాప్ ముందు రిచ్ కార్ ఆగుతుంది. ఎవరితను అంబానీ చుట్టంలా ఉన్నాడు అనుకుంటాడు మనోజ్. అతను బాలు జైలు ఫ్రెండే. అతన్ని కూర్చొబెట్టి మర్యాదలు చేస్తాడు మనోజ్. తర్వాత నాకు ఈ లిస్ట్‌లో ఉన్న వస్తువులు కావాలని పెద్ద లిస్ట్ ఇస్తాడు అతను. చాలా పెద్ద ఆర్డర్. వారంలో రోజుల్లో డెలివరీ ఇస్తానని మనోజ్ అంటాడు.

నేను అప్పుడే ఇస్తాను. ఆవిడ ప్రజెంటేషన్ ఇచ్చాకా. మిసెస్ రోహిణి మనోజ్. ఆవిడ చాలా పెద్ద వ్యాపారవేత్త అవుతారు. ఇది చిన్న షాప్ కానీ, ఆవిడ చెబితే ఏదో మాయ ఉంది. ఆవిడ భర్త గురించి కూడా గొప్పగా చెప్పారు. ఆవిడను పిలవండి అని బాలు ఫ్రాడ్ ఫ్రెండ్ అంటాడు. ఆవిడ లేదు, నేను ఆవిడ భర్తను అని మనోజ్ అంటాడు. కానీ, అతను నమ్మడు.

మీరెందుకో అనుకన్న టైమ్‌లో డెలివరీ చేయలేరనిపిస్తుంది. రోహిణి గారిని పిలిపించు ఆర్డర్ ఇస్తాను. నేను రోహిణి గారిని తప్పా ఇంకెవరిని నమ్మను. నిన్ను కూడా నమ్మను అని బాలు ఫ్రెండ్ వెళ్లిపోతుంటాడు. ఇగో కంటే బిజినెస్ ముఖ్యం అని అతని దగ్గరికి వెళ్లి రోహిణి సాయంత్రం వస్తే ఓకేనా అని మనోజ్ అంటాడు. అతను సరేనంటాడు.

నాకు శాశ్వత వనవాసమే

ఇంతలో రోహిణికి బాలు ఫ్రాడ్ ఫ్రెండ్ కాల్ చేసి జరిగింది చెబుతాడు. సాయంత్రానికి మీ భర్త మీ కాళ్లబేరానికి వస్తాడని అంటాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో పంపిస్తానని రోహిణి అంటుంది. అంతా ఓకే గానీ మీరు ఇచ్చిన చెక్ రాసిస్తే.. రేపు ఏదైనా తేడా వస్తే మళ్లీ నన్ను లోపల వేస్తారేమో అని అతను అంటాడు. చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, డీల్ క్యాన్సిల్ అయిందని చెబుతాలే అని రోహిణి అంటుంది.

ఏమో మిమ్మల్ని ఎవరు నమ్మకపోయిన నేను నమ్మాను అని అతను అంటాడు. నన్ను నమ్మినవాళ్లు ఎవరు మోసపోలేదు. సాయంత్రం నా గురించి మరింత ఎక్కువగా చెప్పండని రోహిణి అంటుంది. అతను సరేనంటాడు. అమ్మా కొడుకులు నన్ను షోరూమ్‌కి ఎలా రానివ్వరో చూస్తానంటుంది రోహిణి. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అంతా తింటుంటారు.

రోహిణి డ్రైనేజీ కంపు అన్న ప్రభావతి

రోహిణి వచ్చి ఆగుతుంది. మీనా కూర్చోమని పిలుస్తుంది. ప్రభావతి అడ్డుకుంటుంది. బాలు సెటైర్లు వేస్తాడు. బాలుకు శ్రుతి పంచ్ వేస్తుంది. రోహిణిని డ్రైనేజీ కంపుతో పోలుస్తుంది ప్రభావతి. తర్వాత తింటానని రోహిణి అంటే.. మేమిద్దరం కలిసి తింటామని మీనా అంటుంది. వద్దు నేను గదిలో తింటానని రోహిణి అంటుంది.

పూలమ్ముకునేదానితో తినడానికి నామోషిగా ఉందా, మోసాలు కుట్రలు చేయలేదని మీనా అంటుంది. అమ్మా, అయ్యా లేకుండా పెరిగినవాళ్లకు ఇంత పొగరు ఉండకూడదు రోహిణి అని శ్రుతి అంటుంది. బాలు పంచ్ వేస్తాడు. ట్రిప్ లేదా అని సత్యం అంటాడు. బాలు చెబుతాడు. ఏం చేసిన చిల్లర బతుకే, ఎదుగు బొదుకు ఉండదు. అదే మనోజ్ అయితే షాప్‌లో అని ప్రభావతి అంటుంది.

అందరి సొమ్ము మింగేయొచ్చు. మీ పెద్దకొడుకు గురించి ఎవరికి తెలియదని మాకు చెబుతున్నారని అత్తపై కోప్పడుతుంది మీనా. తొందర్లోనే కోటీశ్వరుడు అయి విల్లా కొంటాడని ప్రభావతి అంటే.. 30 లక్షలతోనా మీనా పంచ్ ఇస్తుంది. బాలు గురించి గొప్పగా చెప్పిన మీనా పరాన్న జీవికి మా ఆయనకు పోలిక పెట్టకండి. మీకు రోహిణియే కరెక్ట్. నాలా అనిగిమణిగి ఉండే కోడలు, శ్రుతిలా మాట్లాడే కోడలు మీకు పనికిరారు అని మీనా అంటుంది.

మీనాను కొడతానన్న ప్రభావతి

నమ్మించి నట్టేట ముంచేవాళ్లే మీకు నచ్చుతారు. రోహిణి నువ్వే కరెక్ట్ అని మీనా అంటుంది. దానికి ఎలా పడ్డాయో నీకు అలాగే పడతాయని ప్రభావతి అంటుంది. ఏంటీ.. మేమంతా చూస్తూ ఊరుకుంటాం మరి. మీనాపై చేయి పడితే నీ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం జాగ్రత్తా. కోడలు అంటే అంత అలుసా.. అని అత్తకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది శ్రుతి.

ప్రభావతిని వారిస్తాడు సత్యం. ఇంకోసారి వదినను కొడతాననే ఆలోచన మనసులోకి రానివ్వకు అని రవి కూడా హెచ్చరిస్తాడు. ఇంతలో మనోజ్ వచ్చి ప్రభావతిని పక్కకు తీసుకెళ్తాడు. మళ్లీ ఏదో మునిగిపోయే ప్లానో, ముంచే ప్లాన్ అయింటుందని బాలు అంటాడు. ప్రభావతితో వచ్చిన డీల్ గురించి చెబితే ఇది అందరిముందు చెప్పొచ్చుగారా అని అందరిముందుకు తీసుకెళ్లి చెబుతుంది.

రోహిణి వల్లే ఈ డీల్ వచ్చింది కాబట్టి తను షో రూమ్‌కి రావాల్సి ఉంటుంది. తను ఉండాలని పట్టుబట్టాడని మనోజ్ చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. పక్కకు తీసుకెళ్లి దాన్నెలా షాప్‌కు పంపించాలా అని ప్రభావతి అంటుంది. నాకు లక్షల్లో లాభం వస్తుందని మనోజ్ బతిమిలాడుతాడు. ప్రభావతి ఆలోచిస్తుంది. ఒప్పుకోక ఏం చేస్తుంది డబ్బు పిచ్చిది అని రోహిణి మనసులో అనుకుంటుంది.

మళ్లీ దొరికిపోయిన రోహిణి

నీకు లాభం వస్తుంది కాబట్టి ఇప్పటివరకు ఇది మనల్ని వాడుకుంది కాబట్టి మనం దీన్ని వాడుకోవడంలో తప్పు లేదని ప్రభావతి అంటుంది. డబ్బుకోసం మోసం చేసిన వారిని క్షమించేసింది చూశారా అని బాలు, శ్రుతి సెటైర్లు వేస్తారు. డ్రైనేజీ అన్నావ్, గాలి, కంపు అన్నావ్ అని రవి అంటాడు. రోహిణి షాపునకు వెళ్తుంది.

రోహిణి ఏర్పాటు చేసిన ఫ్రాడ్ 10 లక్షల అడ్వాన్స్ చెక్ ఇస్తాడు. ఆ చెక్‌ను బాలు, మీనా తీసుకుంటారు. నీ గుట్టు బయటపెట్టడమే నా పని అని ఆ చెక్ చించేస్తాడు బాలు. రేయ్ ఏంట్రా ఇది అని మనోజ్ అంటే.. నువ్వు మళ్లీ ఇంకో మోసంలో పడకుండా ఉండేందుకు అని బాలు అంటాడు. పోలీసులకు ఫోన్ చేయమని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe