...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాను కొట్టిన గుణ.. బాలు ఉగ్రరూపం.. చిచ్చు పెట్టిన శివ.. శృతికి సవతి పోరు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్ లో పెద్ద రచ్చే జరిగింది. మీనాను గుణ కొట్టడం, అది చూసి బాలు ఉగ్రరూపంతో అతనిపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్రమవుతుంది. అటు శృతికి సవతి పోరు మొదలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

Published on: Feb 13, 2026, 07:34:26 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 619వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ విషయంలో మరోసారి గుణతో గొడవ పడతారు బాలు, మీనా. అటు చేసిన తప్పు తెలుసుకొని బాలు, మీనాలకు క్షమాపణ చెప్పడానికి వస్తాడు రాజేష్. మరోవైపు రెస్టారెంట్లో శృతికి సవతి పోరు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

సిగ్గు తెచ్చుకో అంటూ బాలు అంతరాత్మ క్లాస్

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాను కొట్టిన గుణ.. బాలు ఉగ్రరూపం.. చిచ్చు పెట్టిన శివ.. శృతికి సవతి పోరు
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాను కొట్టిన గుణ.. బాలు ఉగ్రరూపం.. చిచ్చు పెట్టిన శివ.. శృతికి సవతి పోరు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్ బాలుని తన అంతరాత్మ తిట్టే సీన్ తో మొదలవుతుంది. భార్య చెప్పిన మాట వినకుండా ఎందుకు రా నీకు అంత బలుపు అంటూ అంతరాత్మ బాలుని తిడతాడు. రూ.లక్ష పోయింది.. అంత డబ్బు సంపాదించడానికి ఎంత టైమ్ పడుతుందని అంటాడు. ఇకనైనా సిగ్గు తెచ్చుకో అని క్లాస్ పీకుతాడు. ప్రతి ఒక్కరూ తన భార్యకే సపోర్ట్ చేస్తారంటూ బాలు ఫీలవుతాడు.

ఇంటికి తాగొచ్చిన శివ.. సుమతి, పార్వతిలతో గొడవ

మరోవైపు శివ ఇంటికి తాగి వస్తాడు. ఇంత సేపు ఎక్కడికెళ్లావ్ అని అడిగిన సుమతి, పార్వతి నిలదీస్తారు. వాళ్లతో శివ గొడవ పడతాడు. గుణ ఏదో పని ఉందని చెబితే వెళ్లానని, ఈమాత్రం దానికే ఇంత గొడవ చేస్తారా అని అంటాడు. తమ్ముడి దగ్గరికి వెళ్లిన సుమతి అతడు తాగి వచ్చాడని తెలుసుకుంటుంది. అదే విషయం అడిగితే.. సుమతిని పక్కకు తోసేస్తాడు. వెంటనే ఈ విషయం మీనా అక్కకు చెబుదామని సుమతి ఫోన్ తీయబోతుంటే పార్వతి ఇప్పుడు వద్దని వారిస్తుంది.

క్షమాపణ చెప్పిన రాజేష్.. క్లాస్ పీకిన మీనా

ఇందులో ఎంత ఉందో చూడు.. మిగిలిన డబ్బు కూడా ఇస్తానని రాజేష్ అంటాడు. అప్పుడే మీనా అతనికి క్లాస్ పీకుతుంది. ఇంట్లో ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అన్నారట.. పెళ్లి చేసుకొని వెళ్తుంది కాబట్టే ఆడపిల్లను చదివించాలి.. చదువుకుంటేనే ఆడపిల్లకు గౌరవం అని మీనా అతనికి క్లాస్ పీకుతుంది.

రవికి బాస్ కూతురు షాక్.. శృతి దగ్గర దొరికిపోయి..

రెస్టారెంట్లో రవికి తన బాస్ కూతురు షాక్ ఇస్తుంది. రవి కంటే ముందే వచ్చి వంట చేస్తూ కనిపిస్తుంది. నువ్వు ఎవరు అని రవి అడిగితే నేను ఇక్కడ కొత్త ఛెఫ్... నీ ఉద్యోగం పోయిందని అంటుంది. దీంతో అతడు బాస్ దగ్గరికి వెళ్తాడు. నీ ఉద్యోగమే కాదు నాదీ పోయిందని అతడు నవ్వుతాడు. ఆ తర్వాత ఆమె తన కూతురు అని, విదేశాల్లో హోటల్ మేనేజ్‌మెంట్ చేసి వచ్చిందని, ఇక నుంచి మీ బాస్ ఆమెనే అని చెబుతాడు. రవిని చూసి నీతూ పడిపోతుంది.

క్యూట్ గా ఉన్నావంటూ బేబీ అని పిలుస్తుంది. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. ఇద్దరినీ చూసి కుళ్లుకుంటుంది. రవి ఆమెకు తన నంబర్ కూడా ఇవ్వడం చూస్తుంది. అప్పుడే వచ్చి తనను పరిచయం చేసుకుంటుంది. నీకు పెళ్లయిపోయిందా అంటూ నీతూ బాధపడుతుంది. శృతి ముందే ఉన్నా కూడా రవిని బేబీ అనే పిలుస్తుంది. దీంతో రవికి శృతి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

శివ గురించి మీనాకు చెప్పిన పార్వతి

అటు పార్వతి ఇంటికి వెళ్తుంది మీనా. దీంతో ఆమె శివ గురించి చెప్పి ఆందోళన చెందుతుంది. ఆ గుణ దగ్గరికి వెళ్లి పూర్తిగా చెడిపోతున్నాడు.. చెప్పినా వినడం లేదు.. అసలు చదువుపై ధ్యాస పెట్టడం లేదు అని పార్వతి చెబుతుంది.

దీంతో మీనా ఆవేశంతో గుణ దగ్గరికి వెళ్లి క్లాస్ పీకుతుంది. అతడు ఎదురు తిరగడంతో చెంప మీద కొడుతుంది. గుణ కూడా మీనా చెయ్యి పట్టుకొని తోసేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అది చూసి గుణను చితకబాదుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks