గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బయటపడిన రాజేష్ నిజ స్వరూపం- జైలు నుంచి వచ్చిన దినేష్- చింటుతో సెల్ఫీ,రోహిణిలో వణుకు
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో షష్టిపూర్తి నాడు రాజేష్ తన తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టలేదని బాలుకు తెలుస్తుంది. పూలుగు బొక్క కోసం పెద్ద గొడవతోపాటు బాలుకు అవమానం జరుగుతుంది. జైలు నుంచి వచ్చిన దినేష్ చింటుతో సెల్ఫీ తీసుకుని రోహిణికి పంపిస్తాడు. రోహిణి వణికిపోతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో షష్టిపూర్తి దంపతులను ఇలా మూలకు పెట్టేశారేంటీ అని బాలు అంటాడు. అది మీ ఫ్రెండ్‌నే అడగండి అని రాజేష్ భార్య అంటుంది. ముందు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుందామని మీనా అనడంతో బట్టలు పెడతారు. బయట కూర్చోబెడదాం రండని బాలు అంటాడు.

అన్నం పెట్టించండి
వద్దు బాబు కాస్తా అన్నం పెట్టించండి. కనీసం దీనికైనా పెట్టించండి. షుగర్ ఉందిగా ఆకలికి తట్టుకోలేదు అని రాజేష్ తండ్రి అంటాడు. ఏంటమ్మా వీళ్లకు అన్నం పెట్టలేదా అని బాలు అంటే.. అటువైపు ఆడవాళ్లను రానివ్వట్లేదు. మీరే వెళ్లి చూడండి అని రాజేష్ భార్య అంటుంది. దాంతో బాలు, మీనా వెళ్లి చూస్తారు.
అక్కడ ఫ్రెండ్స్ అందరికి మందు, బిర్యానీతో పార్టీ ఇచ్చి ఫుల్‌గా తాగి తందనాలు ఆడుతాడు రాజేష్. అదంతా చూసిన బాలు, మీనా షాక్ అవుతారు. అన్నయ్య మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఇలా పొద్దున్నుంచి ఏరులై పారుతోంది అని రాజేష్ భార్య అంటుంది. అమ్మనాన్నలకు అన్నం పెట్టకుండా ఏంటీ దరిద్రం. ముందు రెండు ప్లేట్లలో భోజనం తీసుకురండి అని మీనా అంటుంది.
దాంతో బాలు తీసుకొస్తాడు. మీనా తీసుకెళ్లి రాజేష్ తల్లిదండ్రులకు భోజనం పెడుతుంది. బాలును తీసుకెళ్తాడు రాజేష్. బాలును తాగమని రాజేష్ ఫోర్స్ చేస్తే తాగనంటాడు బాలు. ఇందుకే కదా నీ దగ్గర లక్ష తీసుకుంది. ఇదేరా నా బలగం, నేను ఎంత మందు పోయించాను, ఎంత మటన్ పెట్టించానని అంతా గుర్తు చేసుకోవాలి అని రాజేష్ అంటాడు.
పూలుగు బొక్క కోసం
పూలుగు కోసం కొట్టుకోకుంటే చాలు అని బాలు అంటాడు. ఇంతలోనే ముక్కలు సరిగా వేయలేదని ఒకరు గొడవ పడతాడు. వీళ్లంతా పడి దున్నపోతుల్లా తింటున్నారని రాజేష్ బామ్మర్ది అంటాడు. దాంతో గొడవ పడుతారు. మటన్ తక్కువైందని అంతా అంటారు. అంతా బాగానే చేశానుగా ఎందుకు ఇలా అంటున్నారని రాజేష్ అంటాడు. తలా ఒకరు లివర్ ఫ్రై, తలకాయ ఇలా ఏదోటి తక్కువైందని, టెక్కులకు పోయి ఫంక్షన్ చేయడం ఎందుకు రాజేష్‌నే అంటారు.
రాజేష్ కంగారు పడతాడు. నేను చూసుకుంటాను అని వాళ్లందరికి వడ్డిస్తానని బాలు తీసుకెళ్తాడు. బాలు వడ్డించినా పూలుగు బొక్కలు ఏవి. నీ బాబుగాడి సొమ్ము వడ్డిస్తున్నావా అని అంటాడు. బాలు ఆపిన రాజేష్ మీదకు వెళ్తాడు. దాంతో అంతా కొట్టుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. మధ్యలో బాలు నలిగిపోతాడు. దాంతో అందరిని తోసేసి బాలును తీసుకొస్తుంది మీనా.
మీరిచ్చిన లక్ష ఎంత బాగా ఉపయోగపడుతుందో చూశారా అని అంటుంది మీనా. పాప స్కూల్ ఫీజ్ కట్టాలంటే పెళ్లి చేసుకుని వెళ్లిపోయేదానికి ఖర్చు అవసరమా అన్నాడను అని రాజేష్ నిజ స్వరూపం ఏంటో చెబుతుంది భార్య. మా అత్త మామలకు ఒరిగింది ఏం లేదు. ఇతన్నీ నమ్మి లక్ష ఎలా ఇచ్చారని అని రాజేష్ భార్య అంటుంది. వెళ్దామని బాలు, మీనా వెళ్లిపోతారు.
అవమానంగా ఉంది
ఆకలిగా ఉందా అని మీనా అంటే.. బాలు అవమానంగా ఉందని అంటాడు. సత్యం వచ్చి ఫంక్షన్ గురించి అడిగితే మీనా సెటైరికల్‌గా చెబుతుంది. ఎంత మంచి పేరు దక్కిందో అని మీనా అంటుంది. ఇకనుంచి అలాగే చేయు. అన్ని ఫంక్షన్స్‌కి ఇలాగే కలిసి వెళ్లండని సత్యం వెళ్లిపోతాడు. పెళ్లాం చెబితే వినాలి. తప్పులేదు. అపాత్ర ధనం అయింది, భార్య సలహాలు తీసుకోవడం నామోషి కాదు అవసరం అని మీనా అంటుంది.
మరోవైపు చింటు దగ్గరికి దినేష్ వస్తాడు. క్రికెట్ ఆడుతుంటే బాగా ఆడుతున్నావని మచ్చిక చేసుకుంటాడు. నువ్వు చాలా పెద్ద క్రికెటర్ అవుతావు. అందుకు ముందే సెల్ఫీ తీసుకుంటాను అని దినేష్ సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు మనోజ్ బాడీగార్డ్ 20 ఎగ్స్ క్షణాల్లో తింటాడు. అదంతా చూసిన మనోజ్ నేనే ఇప్పటివరకు తినలేదని బాడీగార్డ్ తినేదంతా లెక్కలు వేస్తాడు.
నాకు వచ్చిన సమస్యల నుంచి కాపాడుతాడని వాడిని పెట్టుకుంటే వాడే పెద్ద సమస్య అయ్యేలా ఉన్నాడని మనోజ్ అంటాడు. నేను కూడా వీడిలాగే తింటే నాకు ఇలాగే బాడీ వస్తుందా అని మనోజ్ అంటాడు. నువ్వు కూడా బాడీగార్డ్‌లా వెళ్తావా. ముందు పని చూడు అని రోహిణి అంటుంది. ఇంతలో చింటుతో దినేష్ దిగిన సెల్ఫీ పంపిస్తాడు. అది చూసి రోహిణి వణికిపోయి కాల్ చేస్తుంది.
దినేష్ బ్లాక్‌మెయిల్
నీ కొడుకుతో ఉన్నాను. వాన్ని పట్టుకుంటే నిన్ను పట్టుకున్నట్లే ఉంది. నేను జైలులో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నావుగా. ఇప్పుడు నేను బయటకొచ్చాను. నీ భర్తకు రెండు లెటర్స్ పంపింది నేనే అని దినేష్ అంటాడు. నేను చెప్పినట్లు నువ్వు వినాలి. లేకుంటే నీ కొడుకుని తీసుకెళ్లిపోతా. నీకు సమాధానం కావాలంటే లొకేషన్ పంపిస్తా. అక్కడికి రా అని దినేష్ లొకేషన్ సెండ్ చేస్తాడు.
మరోవైపు రాత్రి బాలు మందు తాగేందుకు బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఇంతలో బాలు అంతరాత్మ వచ్చి బాలుపై తిట్లదండకం మొదలుపెడతాడు. లక్ష గోవిందా అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












