గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో బాలుని జైల్లో వేస్తారు. అతన్ని విడిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో శృతి వాళ్ల తల్లిదండ్రుల సాయం కోరడం, వాళ్లు కాస్తా ఇంట్లో చిచ్చు పెట్టడం జరుగుతుంది. అటు బయటకు వచ్చిన బాలు.. గుణ చేతులతోపాటు మెడ కూడా విరగ్గొడతాడు.
జైల్లో బాలు.. పోలీస్ స్టేషన్‌లో మీనా, శివ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ బాలుని జైల్లో వేసే సీన్ తో మొదలవుతుంది. దీంతో మీనా, శివ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అసలు ఏం జరిగిందో, తాము ఆడిన నాటకమేంటో ఎస్సైకి చెబుతారు. కానీ అతడు వినడు. సీఐ మేడమ్ వచ్చిన తర్వాతే తేల్చుకోండని చెప్పి వెళ్లిపోతాడు.
శృతికి మీనా ఫోన్.. తల్లి, తండ్రిని రిక్వెస్ట్ చేసిన శృతి
ఏం చేయాలో తెలియక శృతికి ఫోన్ చేస్తుంది మీనా. దీంతో ఆమె తన తల్లి శోభకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ జైల్లో ఉన్నాడని, డాడీకి చెప్పి విడిపించమని అడుగుతుంది. శోభ తన భర్త దగ్గరికి వెళ్లి చెబితే.. ఆ వ్యక్తి బాలు అని చెప్పాల్సి వస్తుంది.
దీంతో తనను కొట్టిన బాలుని తాను విడిపించనని అతడు తేల్చి చెబుతాడు. అంతేకాదు ఆ బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ అతడు జైల్లో ఉన్నాడని సత్యంకి ఫోన్ చేసి చెప్పమని అంటాడు. దీంతో శోభ.. సత్యానికి అసలు విషయం చెబుతుంది.
మీనాను నిలదీసిన ఇంట్లో వాళ్లు.. నానా మాటలు అన్న సత్యం
ఇటు మీనా ఇంటికి రాగానే ప్రభావతి నిలదీస్తుంది. తర్వాత సత్యం, రవి, శృతి, మనోజ్, రోహిణి కూడా వస్తారు. బాలు ఎక్కడ అని అడిగితే మీనా అబద్ధం చెబుతుంది. ట్రిప్ కు వెళ్లాడంటే పోలీస్ స్టేషన్ కా అని ప్రభావతి అడగడంతో షాక్ తింటుంది. శృతి తల్లి ఫోన్ చేసి తమకు ఈ విషయం చెప్పిందని సత్యం అంటాడు.
{{/usCountry}}ఇటు మీనా ఇంటికి రాగానే ప్రభావతి నిలదీస్తుంది. తర్వాత సత్యం, రవి, శృతి, మనోజ్, రోహిణి కూడా వస్తారు. బాలు ఎక్కడ అని అడిగితే మీనా అబద్ధం చెబుతుంది. ట్రిప్ కు వెళ్లాడంటే పోలీస్ స్టేషన్ కా అని ప్రభావతి అడగడంతో షాక్ తింటుంది. శృతి తల్లి ఫోన్ చేసి తమకు ఈ విషయం చెప్పిందని సత్యం అంటాడు.
{{/usCountry}}దీంతో అసలు ఏం జరిగిందో సత్యంకు చెబుతుంది మీనా. అయినా అతడు కూడా మీనాను, బాలునే తిడతాడు. ఇంటి పరువు తీశారని ప్రభావతి, రోహిణి, మనోజ్ అంటారు. దీంతో సత్యం కూడా తొలిసారి బాలు, మీనాలను నానా మాటలు అంటాడు. మీనాకు చేతులెత్తి దండం పెట్టి ఇంటి పరువు తీసే పనులు చేయద్దని అని వెళ్లిపోతాడు. దీంతో మీనా ఏడుస్తుంది.
సీఐని వేడుకొని బాలుని విడిపించిన మీనా
అటు ఉదయాన్నే మీనా పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. సీఐ మేడమ్ ను వేడుకుంటుంది. అయినా ఆమె వినకుండా కోర్టుకు తీసుకెళ్తానని అంటుంది. నిన్ను రోజూ కొడుతున్నాడట.. తాళి కూడా తాకట్టు పెట్టాడట కదా అని అడుగుతుంది. అయితే తాము ఓ నాటకం ఆడటం వల్లే ఇదంతా జరిగిందని మీనా చెబుతుంది. అప్పుడు శివ బ్యాగులో మందు బాటిల్ ఉండటం, దానిని బాలు తన నెత్తి మీద వేసుకోవడం అంతా సీఐకి మీనా వివరిస్తుంది. దీంతో ఆమె ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది.
బాలు కాళ్లపై పడిన శివ
బయటకు రాగానే బావ బాలు కాళ్లపై పడతాడు శివ. తనను క్షమించమని అడుగుతాడు. ఇదంతా తన వల్లే జరిగిందని అంటాడు. అది చూసి సుమతి సంతోషిస్తుంది. ఒక్క దెబ్బకు గుణ ఏంటో శివకి తెలియడంతోపాటు బాలు బావ మంచితనం గురించి కూడా తెలిసిందని అంటుంది. అప్పుడే రాజేష్ ఫోన్ చేసి గుణ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, రావాలని చెబుతాడు. సరే అని బాలు వెళ్తాడు.
గుణని మళ్లీ చితకబాదిన బాలు
గుణ కోసం బాలు, రాజేష్ కాపు కాస్తారు. వడ్డీ వ్యాపారం చేసే గుణని మాయమాటలు చెప్పి రాజేష్ రప్పిస్తాడు. అతడు రాగానే కారులో బాలు కూడా ఉండటం చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో బాలు అతని పట్టుకొని చితకబాదుతాడు. రెండు చేతులతోపాటు ఈసారి అతని మెడ కూడా విరగ్గొడతాడు బాలు.
అత్తకి గట్టిగానే ఇచ్చుకున్న మీనా
ఇటు ఇంటికి వచ్చిన బాలు, మీనాలను చూసి ప్రభావతి నానా మాటలు అంటుంది. అటు మనోజ్, రోహిణి కూడా బయటకు వచ్చి తిడతారు. చివరికి సత్యం కూడా అతనితో మాట్లాడడు. తన పుట్టింటి వాళ్లను ప్రభావతి మరోసారి తిట్టడంతో మీనా రెచ్చిపోతుంది. నువ్వు ఇన్నాళ్లు చేసిన డ్రామాల సంగతేంటని ప్రభావతితోపాటు మనోజ్, రోహిణిలకు కూడా గట్టిగానే ఇస్తుంది. సత్యంని బాలు క్షమాపణ అడుగుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.