Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి చేసిన తప్పుకు క్షమించేది లేదని ప్రభావతి స్పష్టం చేస్తుంది. అటు ఆమె చేసిన పనికి ఆవేశంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోహిణికి తల్లి సుగుణ కూడా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మనోజ్ పరువు తీసేలా మాట్లాడి వెళ్లిపోయిన రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మనోజ్ కు రోహిణి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. నువ్వు ఎందుకు చేతగానివాడివి.. ఓ దిష్టిబొమ్మవి.. నిన్ను కాపాడటానికి నేను ప్రయత్నిస్తే.. తప్పంతా నాదా అని మీ అమ్మతో కొట్టిస్తావా.. ఆమె కొడుతున్నా చూస్తూ ఊరుకుంటావా.. అని మనోజ్ ను రోహిణి నిలదీస్తుంది.
నువ్వు మాట్లాడింది కూడా తప్పే కదా.. నాకు ఎంత అవమానంగా, బాధగా ఉందో తెలుసా అని మనోజ్ అంటాడు. నాలుగు మాటలు అంటేనే అంత బాధగా ఉంటే.. అందరి ముందూ అత్తయ్య కొడుతుంటే నాకు ఎలా ఉంటుంది అని రోహిణి అంటుంది. ఇక ఇంట్లో ఉండను అంటూ బట్టలు సర్దుకొని వెళ్లిపోతుంది. మనోజ్ అడ్డుకున్నా ఆమె ఆగదు.
ప్రభావతిని నిలదీసిన సత్యం
ఇటు ప్రభావతి దగ్గరికి వెళ్లిన సత్యం.. ఆమెను నిలదీస్తాడు. ఇన్నాళ్లూ రోహిణిని నెత్తి మీద పెట్టుకొని చూసుకొని.. ఇప్పుడు తప్పు చేసిందని తెలియగానే కొడతావా అని అడుగుతాడు. అంతేకాదు ఇందులో మనోజ్ గాడిది కూడా తప్పు ఉంది కదా.. వాడిని ఏమీ అనవా అని అంటాడు. వాడు అమాయకుడు.. వాడిని అది మోసం చేసింది అని ప్రభావతి అంటుంది.
అప్పుడు రూ.40 లక్షలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది కూడా ఆ అమాయకత్వంతోనేనా అని సత్యం అడుగుతాడు. రోహిణి ఇంటి పెద్ద కోడలు.. నీ తర్వాతి స్థానం.. నువ్వు అలా చేయడం తప్పే అని సత్యం స్పష్టం చేస్తాడు. అప్పుడే మనోజ్ వచ్చి రోహిణి వెళ్లిపోయిందని చెప్పడంతో పోతే పోనీ అని ప్రభావతి అంటుంది. సత్యం మాత్రం అతనికి క్లాస్ పీకి, అంతా నీవల్లే అని తిడతాడు.
తల్లి దగ్గరికి రోహిణి.. క్లాస్ పీకిన సుగుణ
{{/usCountry}}అప్పుడు రూ.40 లక్షలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది కూడా ఆ అమాయకత్వంతోనేనా అని సత్యం అడుగుతాడు. రోహిణి ఇంటి పెద్ద కోడలు.. నీ తర్వాతి స్థానం.. నువ్వు అలా చేయడం తప్పే అని సత్యం స్పష్టం చేస్తాడు. అప్పుడే మనోజ్ వచ్చి రోహిణి వెళ్లిపోయిందని చెప్పడంతో పోతే పోనీ అని ప్రభావతి అంటుంది. సత్యం మాత్రం అతనికి క్లాస్ పీకి, అంతా నీవల్లే అని తిడతాడు.
తల్లి దగ్గరికి రోహిణి.. క్లాస్ పీకిన సుగుణ
{{/usCountry}}రోహిణి తన తల్లి సుగుణ దగ్గరికి వెళ్తుంది. జరిగిన విషయం చెప్పి ఓదార్పు కోసం ప్రయత్నిస్తుంది. కానీ సుగుణ మాత్రం కూతురికే క్లాస్ పీకుతుంది. నువ్వు చేసిన తప్పులు అలాంటివి.. ఒక తప్పును దాచడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు.. నీ అసలు మోసం తెలిసిన రోజు ఇంకెలా ఉంటుందో ఊహించుకో అని అంటుంది.
ఓదార్పు కోసం వస్తే నన్నే నానా మాటలు అంటావా.. చిన్న వయసులో పెళ్లి చేసి నా గొంతు కోసి ఉండకపోతే ఈరోజు నేనీ తప్పులు చేయాల్సి వచ్చేదే కాదని రోహిణి అంటుంది. నేను చేసింది ఒక తప్పే.. కానీ నువ్వు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావని సుగుణ తిడుతుంది. ఇది కేవలం డబ్బు సమస్య కాబట్టి ఏదో ఒక రోజు క్షమిస్తారు.. వెళ్లి మీ అత్తను క్షమాపణ అడుగు.. నీ అసలు మోసం తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు అని సుగుణ అంటుంది. దీంతో రోహిణి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది.
ఇంటికి తిరిగొచ్చిన రోహిణి.. మండిపడిన ప్రభావతి
ఇటు ఇంట్లో రోహిణి కోసం మనోజ్ టెన్షన్ పడుతుంటే.. ప్రభావతి మండిపడుతుంది. పోతే పోనీ.. ఎందుకంత ఆందోళన.. నీకు చెప్పి వెళ్లిందా అని అంటుంది. అదే సమయంలో ఏదో ఫన్నీ వీడియో చూసి నవ్వుతున్న మీనా, శృతిలను కూడా ప్రభావతి తిడుతుంది. ఇంట్లో ఇంత గొడవ జరిగి.. మీ తోడి కోడలు వెళ్లిపోయినా పట్టించుకోరా అని అంటుంది. కొట్టింది మీరు.. వెళ్లిపోయింది రోహిణి.. మమ్మల్ని అంటారేంటని శృతి ఎదురు తిరుగుతుంది.
అప్పుడే రోహిణి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెను చూడగానే ప్రభావతి మరింత మండిపడుతుంది. తర్వాత గదిలోకి వెళ్లి అత్తను క్షమించమని అడుగుతుంది రోహిణి. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తుంది. మనోజ్ చేతగానితనంగా గురించి చెబుతుంది. అయినా నిన్ను క్షమించడం జరగని పని అని ప్రభావతి తేల్చి చెబుతుంది. ఇక్కడే ఉంటే పీక పిసికి చంపేస్తానని గద్దించడంతో రోహిణి భయంతో వణికిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రోహిణికి శోభ ఫోన్
అదే సమయంలో రోహిణికి శృతి తల్లి శోభ ఫోన్ చేస్తుంది. నువ్వేదో మోసం చేశావని మీ అత్త కొట్టిందటగా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీంతో రోహిణికి మరింత మండుతుంది. మా ఇంట్లో గొడవల గురించి మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి.. మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అని క్లాస్ పీకి పెట్టేస్తుంది. అప్పుడే రోహిణిని మరోసారి సీరియస్ గా పిలుస్తుంది ప్రభావతి. ఆమె రాకపోవడంతో మనోజ్ ని తిడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.