Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కేవలం రోహిణిని మాత్రమే అనడం, మనోజ్‌ను తిట్టకపోవడంపై ప్రభావతిని సత్యం మందలిస్తాడు. భార్యాభర్తల విషయాల్లో మనం జ్యోక్యం చేసుకోవద్దు అని సత్యం అంటాడు.
మలేషియా వెళ్లిపోతే

తనకు ఇంట్లో అవమానం జరిగిందని రోహిణి మలేషియా వెళ్లిపోతే ఏం చేస్తారు అత్తయ్య. మీ కోడలు ఇంట్లోంచి వెళ్లిపోతే అందరూ అత్తనే తప్పు బడతారు అని మీనా అంటుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రోహిణి నాకు చేసింది ఏంటీ. వాళ్లద్దరికి నేను పెళ్లి చేశాను. వాళ్లిద్దరు మోసం చేశారు. అది తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇంకేం చెప్పకండి అని ప్రభావతి అంటుంది.
మరోవైపు ఇంట్లో సత్యం, ప్రభావతి అన్న మాటల గురించి విద్యకు చెబుతుంది ఏడుస్తూనే ఉంటుంది రోహిణి. ఆ కల్పన వస్తుందని మనకు తెలియదు కదా అని విద్య అంటుంది. ఆ బాలు నన్ను ఎప్పుడు ఇరికించాలని చూస్తాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు కావచ్చు అని రోహిణి అంటుంది. నువ్వు అన్ని తప్పించుకున్నావ్ కానీ కల్పన విషయంలో దొరికిపోయావ్. తప్పు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు అని విద్య అంటుంది.
రోహిణికి మనోజ్ అండగా నిలబడకపోవడాన్ని తప్పుబడుతుంది విద్య. భయపడి ఉంటాడేమో అని రోహిణి అంటే.. అది ఎస్కేప్ అవ్వడమే అని విద్య అంటుంది. ఈ విషయంలోనే ఇలా అంటే రేపు మలేషియా, చింటు మ్యాటర్ బయటపెడితే. ఎంతైనా జాగ్రత్తగా ఉండటం మంచిదని విద్య సలహా ఇస్తుంది. మరోవైపు మనోజ్, రోహిణి, ప్రభావతిల గురించి బాలు, మీనా మాట్లాడుకుంటారు.
రోహిణిని రమ్మన్న ప్రభావతి
అత్తయ్యతో మావయ్య మాట్లాడతా అన్నారని మీనా చెబుతుంది. మనోజ్ బయటకు వెళ్తుంటే ప్రభావతి ఆపి రోహిణి పొద్దున వెళ్లింది. ఎక్కడికి వెళ్లింది. సరే తనకు ఫోన్ చేసి నేను రమ్మన్నాను అని చెప్పు అని ప్రభావతి అంటుంది. దాంతో సంతోషంగా రోహిణికి మనోజ్ కాల్ చేస్తాడు. కానీ, రోహిణి కోపంతో లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయట్లేదని ప్రభావతికి చెబుతాడు మనోజ్.
{{/usCountry}}అత్తయ్యతో మావయ్య మాట్లాడతా అన్నారని మీనా చెబుతుంది. మనోజ్ బయటకు వెళ్తుంటే ప్రభావతి ఆపి రోహిణి పొద్దున వెళ్లింది. ఎక్కడికి వెళ్లింది. సరే తనకు ఫోన్ చేసి నేను రమ్మన్నాను అని చెప్పు అని ప్రభావతి అంటుంది. దాంతో సంతోషంగా రోహిణికి మనోజ్ కాల్ చేస్తాడు. కానీ, రోహిణి కోపంతో లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయట్లేదని ప్రభావతికి చెబుతాడు మనోజ్.
{{/usCountry}}మనోజ్ మళ్లీ కాల్ చేస్తాడు. అయినా రోహిణి పట్టుదల వీడకుండా కాల్ లిఫ్ట్ చేయదు. మనోజ్‌కు సొంత తెలివితేటలు లేవు. నువ్వు హీరోగా చూస్తావు. కానీ అతను జీరో అని విద్య అంటుంది. నేను వెంటనే లిఫ్ట్ చేస్తే నా విలువ ఏం తెలుస్తుంది. కాసేపు వెతకని. అప్పుడే బుద్ధి వస్తుందని రోహిణి అంటుంది. ఇక రోహిణి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విద్యకు కాల్ చేస్తాడు మనోజ్. విద్యను లిఫ్ట్ చేయకని రోహిణి చెబుతుంది. దాంతో విద్య కాల్ లిఫ్ట్ చేయదు.
విద్య లిఫ్ట్ చేయట్లేదని ప్రభావతికి చెబుతాడు మనోజ్. తర్వాత చాలా సార్లు రోహిణి, విద్యలు ఇద్దరికి మనోజ్ కాల్ చేస్తూనే ఉంటాడు. ఇద్దరం లిఫ్ట్ చేయకుంటే ఏదో ప్లాన్ చేస్తున్నామని డౌట్ వస్తుందని విద్య అనడంతో రోహిణి లిఫ్ట్ చేయమంటుంది. నేను ఇక్కడ ఉన్నట్లు చెప్పకు అని రోహిణి అంటుంది. విద్య వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మనోజ్ రోహిణి ఇక్కడ లేదని నోరు జారుతుంది. నేనేం అడగలేదుగా రోహిణి గురించి ఎందుకు చెబుతున్నావని మనోజ్ అంటాడు.
తోలు బొమ్మలాంటోడు మనోజ్
ఉదయం రోహిణి వస్తుందని చెప్పింది. కానీ, రాలేదు. అందుకే అలా చెప్పా అని విద్య అంటే.. అమ్మ ఇంటికి రమ్మని చెప్పింది. నీ దగ్గరికి వస్తే అదే విషయం చెప్పమని మనోజ్ అంటాడు. సరేనని విద్య కాల్ కట్ చేస్తుంది. వాళ్ల అమ్మ చెబితే తప్పా నాకు కాల్ చేయడా, నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉందని ఒక్క మాట అయిన చెప్పొచ్చుగా. రోహిణి పెద్ద పెద్ద చదువులు చదివాడు కానీ మెచ్యూరిటీ లేదు అని రోహిణి కోపంగా ఉంటుంది.
వాళ్ల అమ్మ చెబితే రమ్మంటున్నాడు. వదిలేయమంటే వదిలేస్తాడా. డబ్బు విషయంలో నిన్ను నెట్టి తప్పించుకున్నాడు. రేపు ఇంకో విషయంలో నీకు సపోర్ట్ చేస్తాడనే నమ్మకం నాకు లేదని విద్య అంటుంది. అత్తయ్య రమ్మంటుందిగా వెళ్తాను అని రోహిణి అంటుంది. వెళ్లు ఏదోటి మ్యానేజ్ చేయి, మనోజ్ మీద కోప్పడకు. మనోజ్ తోలు బొమ్మలాంటోడు అని విద్య అంటుంది. కోపం కాదు మనోజ్‌ను నా వైపు తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని రోహిణి చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు ఇంట్లో అందరు హాల్లో రోహిణి కోసం ఎదురుచూస్తుంటారు. ప్రభావతి కాఫీ పెట్టడంపై మీనా, శ్రుతి సెటైర్లు వేసి నవ్వుతారు. రోహిణి వస్తుంది. చెప్పి ఎందుకు వెళ్లావని ప్రభావతి అడిగితే.. చెప్పకుండా ఎందుకు వెళ్లావ్. ఇష్టమొచ్చినట్లు రావడం, పోవడం ఏంటీ అని తిడుతుంది. ప్రభావతి కాళ్ల మీద పడి క్షమించమని రోహిణి వేడుకుంటుంది. మనోజ్ కూడా కాళ్లమీద పడి క్షమించమంటాడు.
కామాక్షి మాటలతో
కామాక్షి మాటలు గుర్తు చేసుకున్న ప్రభావతి భుజం మీద చేయి వేసి లేపుతుంది. రోహిణి, మనోజ్ ఇద్దరిని ప్రభావతి క్షమిస్తుంది. అబద్ధాలు, మోసాలు ఇంకోసారి చేయడానికి వీళ్లేదు. ఏ నిర్ణయమైన చెప్పి తీసుకోండి అని సత్యం అంటాడు. ఈ గొడవ ఇంకా తేలలేదని బాలు అంటే.. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. నాన్న డబ్బులతో మనోజ్ షాపు పెట్టుకున్నాడు కాబట్టి అందులో వాటా అడుగుతాడు. అంతే కదా అని ప్రభావతి అంటుంది.
నాకు డబ్బులో భాగముంది. రేయ్ రవి నీకు కావాలా అని బాలు అంటే.. నేను మనిషిని, నాకు వద్దు అని రవి అంటాడు. శ్రుతి కూడా వద్దని చెబుతుంది. ఇప్పుడు నేను తీర్పు ఇస్తాను. రేయ్ నువ్వు షాప్ పెట్టింది నాన్న డబ్బుతో. కాబట్టి నువ్వు ఓనర్ స్థానం నుంచి తప్పుకోవాలి. నీ బదులుగా షాప్ ఓనర్‌గా నాన్నను కూర్చోబెట్టాలి అని బాలు తీర్పు ఇస్తాడు. దాంతో మీనా చాలా సంతోషంగా చప్పట్లు కొడుతుంది.
ప్రభావతి కోపంగా చూస్తుంది. శ్రుతి కూడా చప్పట్లు కొట్టమని కొడుతుంది. మేనేజర్‌గా ఉండి ప్రతివారం నాన్నకు లెక్కలు చూపించాలని బాలు అంటాడు. అంతా మెచ్చుకుంటారు. ఇదే ఈ బాలు అంతిమ తీర్పు, పెదరాయుడు తీర్పు అని బాలు అంటాడు. తర్వాత రాత్రి రోహిణి, మనోజ్ మాట్లాడుకుంటారు. ప్రభావతి క్షమించడంపై మనోజ్ సంతోషంగా ఉంటాడు. కానీ, రోహిణి మాత్రం కోపంగా మాట్లాడుతుంది.
నేను నిన్ను ఓనర్‌ను చేశాను
నువ్వు ఏం చేయవా. నీ తల్లి ఏం చేసినా మాట్లాడవు. ఆ బాలు మీ నాన్నను షో రూమ్ ఓనర్ చేసిన మాట్లాడవు. నన్ను ఏం అన్నా నీకు బాధగా ఉండదు. కానీ, నిన్ను ఓనర్‌గా తీసేస్తే బాధపడతావ్. ఇక్కడ కూడా నీ స్వార్థం చూపిస్తున్నావ్ కదా. అయినా ఇదంతా నేను నీకోసమేగా చేశాను. నీకు ఆ ఆలోచనే రాదా అని రోహిణి అంటుంది.
అసలు నీకోసం మీ అమ్మ ఏం చేసింది. నేను నిన్ను ఓనర్‌ను చేశాను. కానీ, రెండేళ్లలో ఏం చేయలేకపోయావ్. మావయ్యను బాలు ఓనర్‌ను చేసి నిన్ను తీసేస్తాడు. మీనా ఎంతలా నవ్విందో చూశావా. నేను లేకుంటే నిన్ను ఎవరు పట్టించుకుంటారు. ఈ ఇంటికి నేను నిందలు పడేందుకే వచ్చినట్టు ఉన్నా. పడతాను. నువ్వు అయితే హ్యాపీగా ఉండు అని రోహిణి వెళ్లిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.