...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మొగుళ్లపై పెళ్లాల తిరుగుబాటు.. మీనా, రోహిణి, శృతి రచ్చ.. మూగబోయిన బాలు, మనోజ్, రవి

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 27 ఎపిసోడ్ లో మొగుళ్లపై పెళ్లాలు తిరుగుబాటు చేస్తారు. ఇంట్లో మీనా, రోహిణి, శృతి రచ్చతో సత్యం, ప్రభావతి షాక్ తింటారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: May 27, 2026, 07:48:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మనోజ్, రవి చేసిన పనికి మీనా, రోహిణి, శృతి వాళ్లతో గొడవ పడటం లేెటెస్ట్ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో తమ భర్తలపై తిరుగుబాటు చేయడంతో అత్తమామలకు ఏం చేయాలో తోచదు.

రోహిణిపై బాలు సెటైర్లు, రవిలోనూ అనుమానం

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మొగుళ్లపై పెళ్లాల తిరుగుబాటు.. మీనా, రోహిణి, శృతి రచ్చ.. మూగబోయిన బాలు, మనోజ్, రవి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మొగుళ్లపై పెళ్లాల తిరుగుబాటు.. మీనా, రోహిణి, శృతి రచ్చ.. మూగబోయిన బాలు, మనోజ్, రవి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 27) ఎపిసోడ్ మలేషియా దంపతులు మీనాపై పొగడ్తల వర్షం కురిపించి వెళ్లిపోయే సీన్ తో మొదలవుతుంది. వాళ్లు వెళ్లిన తర్వాత రోహిణి ఎక్కడ అని మనోజ్ అడిగితే.. బాలు ఆమెపై సెటైర్లు వేస్తాడు. సడెన్ గా పంటి నొప్పి వచ్చి, చెంప ఇంత లావుగా వాచిపోయిందని అంటాడు. రవిలోనూ రోహిణిపై అనుమానం వస్తుంది.

మలేషియా అని చెప్పగానే ఆమెకు పంటి నొప్పి రావడమేంటో అని బాలు అంటాడు. ఆ తర్వాత రోహిణి, శృతి ఇంటికి వస్తారు. ఆమె పన్ను పుచ్చిపోయిందని, డాక్టర్ పన్ను పీకేశాడని శృతి చెబుతుంది. కాస్త ముందు వచ్చి ఉంటే మలేషియా వాళ్లతో మీ నాన్న గురించి మాట్లాడి జైలు నుంచి విడిపించే వాళ్లం కదా అని ప్రభావతి అంటుంది. తనకు నొప్పిగా ఉందని, పడుకుంటానని చెప్పి రోహిణి వెళ్లిపోతుంది.

రోహిణి గుట్టు రట్టు చేస్తానన్న బాలు

ఆ తర్వాత బాలు, మీనా కూడా రోహిణి డ్రామాను పసిగడతారు. మలేషియా అనగానే తన గుట్టు బయట పడుతుందేమో అని రోహిణి పన్ను డ్రామా ఆడిందని బాలు అంటాడు. అప్పుడే శృతి కూడా వచ్చి అదే అనుమానం వ్యక్తం చేస్తుంది. పన్ను బాగానే ఉందని, పుచ్చిపోకపోయినా పీకించుకుందని చెబుతుంది. ఎలాగైనా రోహిణి గుట్టు రట్టు చేస్తానని బాలు శపథం చేస్తాడు.

ఫ్రెండ్స్‌తో కలిసి బాలు మందు పార్టీ.. మీనా పర్మిషన్

ఇటు రెస్టారెంట్లో నీతూతో రవి మీటింగ్ లో ఉంటాడు. మన రెస్టారెంట్ ను ఇంకా బాగా డెవలప్ చేసి, కస్టమర్లను ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్పండని నీతూ తన స్టాఫ్ ను అడుగుతుంది. అందరూ ఐడియాలు చెబుతుంటారు. ఇంతలో రవికి శృతి ఫోన్ చేస్తుంది. కట్ చేసినా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది. అయినా రవి ఫోన్ లిఫ్ట్ చేయడు. పైగా పదే పదే ఫోన్ రావడంతో నీతూ కూడా రవికి క్లాస్ పీకుతుంది. అటు శృతిలో ఆవేశం పొంగుకొస్తుంది.

మనోజ్ దగ్గర మళ్లీ దొరికిపోయిన రోహిణి

ఇంట్లో పన్ను నొప్పి అంటూ బాధగా కూర్చొంటుంది రోహిణి. చాలా నొప్పిగా ఉందా అని మనోజ్ అడుగుతాడు. అవునని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకు ఓ ఫోన్ వస్తుంది. మనోజ్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వ్యక్తి రెంట్ కోసం అడుగుతాడు. ప్రతి నెలా 5వ తేదీనే వేస్తావు కదా.. ఈసారి ఏమైంది.. ఎందుకు వేయలేదు అని అడుగుతాడు.

రెంట్ ఏంటి అని మనోజ్ అంటే.. రోహిణిని అడుగు అని ఆ వ్యక్తి పెట్టేస్తాడు. ఆ తర్వాత రోహిణిని మనోజ్ నిలదీస్తాడు. మళ్లీ దొరికిపోయానని అనుకున్న రోహిణి.. తన ఫ్రెండ్ విద్య జాబ్ పోయింది కదా.. ఆమె కోసం రెంట్ కడుతున్నానని అబద్ధం చెబుతుంది. ఆ విషయం కూడా తనకు ఎందుకు చెప్పలేదని నిలదీయడంతో ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది. మనోజ్ కోపంగా వెళ్లిపోతాడు.

తాగి ఇంటికి వచ్చిన బాలు.. క్లాస్ పీకిన మీనా

ఇటు బాలు తాగి ఇంటికి వస్తాడు. మీనా కనిపెట్టకుండా జామ ఆకులు నములుతూ ఇంట్లోకి వెళ్తాడు. కానీ మీనా వాసనతో కనిపెట్టేస్తుంది. బాలుకి క్లాస్ పీకుతుంది. తాగొద్దని చెప్పినా వినరా అని నిలదీస్తుంది. బాలు ఫ్రెండ్స్ ను కూడా తిడుతుంది. నన్నేమన్నా అను కానీ నా ఫ్రెండ్స్ ను అనొద్దని బాలు అంటాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది.

రవి, శృతి గొడవ

అటు ఇంటికి వచ్చిన తర్వాత రవితో శృతి గొడవ పడుతుంది. ఈ మధ్య తనను అస్సలు పట్టించుకోవడం లేదని, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది. నీతూతో మీటింగ్ లో ఉన్నానని అనడంతో శృతి మరింత రెచ్చిపోతుంది. కనీసం మీటింగ్ లో ఉన్నానని చెప్పేంత టైమ్ కూడా లేదా అని నిలదీస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే నేను ఎంత బిజీగా ఉన్నా కూడా లిఫ్ట్ చేస్తాను కదా అని అంటుంది. రవి, శృతి మధ్య కూడా పెద్ద గొడవే జరుగుతుంది.

డైనింగ్ టేబుల్ దగ్గర తిరుగుబాటు

ఆ తర్వాత అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. మొదట బాలుని చూడగానే మీనా రుసరుసలాడుతుంది. ఎవరికీ వడ్డించను.. ఎవరికి వాళ్లు పెట్టుకోండి.. అంటూ కేవలం సత్యంకు మాత్రం వడ్డిస్తుంది. ఏమైందని అడిగితే.. మీ కొడుకునే అడగండని ప్రభావతితో అంటుంది.

ఆ తర్వాత రోహిణి వస్తుంది. మనోజ్ అక్కడే ఉండటం చూసి ఆమె కూడా చిర్రుబుర్రులాడుతూ తాను తర్వాత వస్తానని వెళ్లిపోతుంది. తర్వాత శృతి వస్తుంది. రవిని చూసి ఆమె రెచ్చిపోతుంది. ఈ స్టుపిడ్ కూడా ఇక్కడే ఉన్నాడా అని అంటుంది. ఏమైందని ప్రభావతి అడిగితే.. ఆ పాలడబ్బా మొహాన్నే అడగండి అని చెప్పి వెళ్లిపోతుంది. ముగ్గురు కొడుకులు, కోడళ్ల గొడవలతో సత్యం, ప్రభావతి బిక్కమొహం వేస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe