...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: సుమతి ఆరోగ్యం విషమం.. బాలు వల్లే అన్న మీనా.. అరుణ్‌ను గెంటేసి..మనోజ్ నోటికి సీల్

Gunde Ninda Gudi Gantalu Serial November 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 25 ఎపిసోడ్ లో సుమతి ఆరోగ్యం విషయంలో బాలునే మీనా నిందిస్తుంది. దీంతో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. అటు అరుణ్ ను బాలు కాలర్ పట్టుకొని గెంటేస్తాడు.

Published on: Nov 25, 2026, 07:04:23 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి, అరుణ్ పెళ్లి విషయంలో మరోసారి బాలు, మీనా గొడవ పడతారు. సత్యం, ప్రభావతి ముందే పంచాయితీ పెడతారు. మరోవైపు సుమతి విషయంలో తప్పుగా మాట్లాడి బాలు చేతిలో దెబ్బలు తిన్న మనోజ్ మూతికి సీల్ పడుతుంది.

సత్యం ముందే బాలు, మీనా గొడవ.. మీనాకు ప్రభావతి సపోర్ట్

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 25 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు నవంబర్ 25 ఎపిసోడ్

సుమతి పెళ్లి విషయం చెబుతూ అరుణ్ ప్రవర్తన గురించి సత్యంతో మీనా మాట్లాడే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ అస్సలు మంచి వాడు కాదని, అతడు తనపై పగతో కావాలని సుమతిని ట్రాప్ చేసి ఇదంతా చేస్తున్నాడని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం మీనాకు సపోర్ట్ చేస్తుంది. ఊళ్లో వాళ్లందరితో గొడవ పడుతూ ఉంటే ఇలాగే ఉంటుందని అంటుంది.

వాడు తన కార్ సీజ్ చేశాడని, చాలా ఇబ్బంది పెట్టాడని బాలు చెబుతాడు. సత్యం ముందే బాలు, మీనా గొడవ పడతారు. అసలు అరుణ్ కు సుమతి నా చెల్లెలు, మీ మరదలు అనే విషయం తెలియదని మీనా అంటుంది. కానీ వాడు చాలా డేంజర్.. అన్నీ తెలిసే చేస్తున్నాడని బాలు స్పష్టం చేస్తాడు.

అరుణ్ గురించి అసలు నిజం బయటపెట్టిన బాలు

ఈ క్రమంలోనే అరుణ్ నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవడానికి మనకు పోలీస్ స్టేషన్ లో సాయం చేసిన అప్పలరాజు అనే కానిస్టేబుల్ ను కలిసినట్లు బాలు చెబుతాడు. అరుణ్ చాలా దుర్మార్గుడు అని, తనకు ఇష్టం లేని వారిపై పగ సాధిస్తాడని అతడు చెబుతాడు.

కానీ మీనా మాత్రం అది నమ్మదు. మీరు ఎవరో ఏదో చెప్పారని అతనిపై పగ పెంచుకుంటున్నారు.. ఒకసారి అతని కోణంలో నుంచి కూడా ఆలోచించండి.. అతడు మంచివాడు కాకపోతే నాకు డబ్బు అవసరం ఉన్నదని తెలియగానే ఎందుకు ఇస్తాడు.. ఆ డబ్బు పోయిందని తెలిసినప్పుడు పోతేపోయిందిలే అని ఎందుకు అంటాడు అని మీనా అంటుంది. డబ్బు ఇస్తే మంచివాడు అయిపోతాడా అని పక్కనే ఉన్న ప్రభావతి అంటే.. అదీ అలా అడుగు.. ఈ మధ్య నాకు కనెక్ట్ అయిపోతున్నావని బాలు అంటాడు. నేను నీకు ఎప్పటికీ కనెక్ట్ కాను అని ప్రభావతి అంటుంది.

అరుణ్ కేవలం మీ ముందు మంచివాడిగా నటిస్తున్నాడు.. అది మీకు అర్థం కావడం లేదు అని బాలు అంటాడు. మీ గురించి అతడు కూడా అలాగే అనుకుంటే ఎలా ఉంటుంది అని మీనా అనడంతో.. వాడు నేను ఒకటేనా అని బాలు అరుస్తాడు. దీంతో సత్యం జోక్యం చేసుకొని సర్దిచెబుతాడు. కాస్త ఓపిగ్గా ఉండు.. ఏంటా అరవడం.. మీనా కూడా అరుణ్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయనీ.. అప్పుడు అతని గురించి పూర్తిగా తెలుస్తుంది.. అంత వరకూ ఓపిక పట్టు అని బాలుకి సూచిస్తాడు. అంతటితో ఆ గొడవ ముగుస్తుంది.

బాలు దెబ్బ.. మనోజ్ నోటికి సీల్

మరోవైపు మనోజ్ నోటికి సీల్ తో ఇంటికి వస్తాడు. అతని వెంటే పార్లరమ్మ ఉంటుంది. తల్లి పక్కనే వచ్చి మనోజ్ నిల్చొంటాడు. అతన్ని చూసి ప్రభావతి భయపడుతుంది. ఏం జరిగిందని అడిగితే మనోజ్ చెప్పలేకపోతాడు. మీనా, బాలు కూడా మనోజ్ ను చూసి షాకవుతారు. నిజానికి అది బాలు అతన్ని మూతిపై గుద్దడం వల్లే తగిలిన దెబ్బ అని తెలిసినా.. మనోజ్ చెప్పలేకపోతాడు.

బాలు దానిని బయటపెట్టడు. రోహిణి మాత్రం మంచం పైనుంచి కింద పడ్డాడని చెబుతుంది. బాలుని మనోజ్ గుర్రుగా చూస్తూ ఉంటాడు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పే పరిస్థితి ఉండదు. ఇదే అదును బాలు మరోసారి అతనితో ఆడుకుంటాడు. సత్యం కూడా వచ్చి మనోజ్ ను చూసి షాకవుతాడు. కింద పడ్డాడని రోహిణి చెప్పడంతో అతడు ఇక్కడే ఉంటే అందరూ ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు.. పైకి తీసుకెళ్లు అని సత్యం చెబుతాడు. దీంతో రోహిణిని కాదని ప్రభావతి అతన్ని పైకి తీసుకెళ్తుంది.

మంచాన పడ్డ సుమతి.. ఆటోలో వెళ్లడం చూసి ఫాలో అయిన అరుణ్

మరోవైపు సుమతి మంచాన పడుతుంది. ఆమెను పార్వతి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎంత లేవమని చెప్పినా ఆమె లేవదు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈరోజు నీ పెళ్లి పనులతో ఇల్లు కళకళలాడేది.. కానీ మీ బావ వల్ల ఇలా జరుగుతోంది అని అంటుంది. ఎంత మాట్లాడినా సుమతి నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో పార్వతి దగ్గరికి వెళ్లి చూస్తే సుమతి ఒళ్ల కాలిపోతుంది.

దీంతో ఆమె కంగారుగా శివను పిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఆటోలో ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. దారిలోనే డ్యూటీ చేస్తున్న అరుణ్ ఆటోలో వాళ్లు వెళ్లడం చూస్తారు. సుమతి అని పిలిచినా వాళ్లు పట్టించుకోరు. దీంతో అరుణ్ వాళ్లను ఫాలో అవుతాడు.

బాలుని నిలదీసిన మీనా

ఇటు ఇంట్లో మనోజ్ నోటికి సీల్ వేయడంపై బాలునే అనుమానిస్తుంది మీనా. ఏం జరిగింది.. మీరే మనోజ్ ను కొట్టారు కదా అని అడుగుతుంది. తానేమీ కొట్టలేదని మొదట బుకాయించినా తర్వాత ఒప్పుకుంటాడు. ఎందుకు కొట్టారని అడిగితే.. సుమతి గురించి తప్పుగా వాగాడని ఎలా చెప్పాలనుకొని బాలు ఏమీ చెప్పడు.

హాస్పిటల్లో బాలు, అరుణ్ గొడవ

సుమతి గురించి పార్వతి చెప్పడంతో బాలు, మీనా హాస్పిటల్ కు వెళ్తారు. అప్పుడే అరుణ్ కూడా అక్కడికి వస్తాడు. ఏం జరిగింది, ఎలా ఉంది అని బాలు ముందే అరుణ్ అడుగుతాడు. అసలు మా ఇంటి అమ్మాయి గురించి అడగడానికి నువ్వెవెడివి రా.. ముందు బయటకు వెళ్లు అంటూ అతని కాలర్ పట్టుకొని గెంటేస్తాడు.

సుమతి మనసులో ఏదో ఉందని, అది అలాగే ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో మీనా, పార్వతి ఆలోచనలో పడతారు. దీనికి కారణం మీరే అని బాలుని మీనా నిందిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks