Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు ఉగ్రరూపం చూపించాడు. సుమతి ప్రేమిస్తున్నది అరుణ్ నే అని తెలుసుకొని చెలరేగిపోతాడు. అరుణ్ ను కొట్టడమే కాదు.. అత్త, బావ మరిదికి ఆ విషయం చెప్పి అతనితో పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తాడు.
రవి, నీతూతో గొడవ.. జాబ్ మానేసి వెళ్లిపోయిన శృతి

నీతూతో శృతి గొడవ పడే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. రవిని కాదని నీతూ మరొకరిని హెడ్ షెఫ్ గా చేయాలన్న నీతూ నిర్ణయాన్ని ధిక్కరిస్తుంది. జాబ్ మానేసి వెళ్లిపోదామని రవితో అంటే అతడు మాత్రం నీతూకి సపోర్ట్ చేస్తాడు. ఆమె ఓనర్.. ఆమెదే ఫైనల్ నిర్ణయం అని అంటాడు.
ఓనర్ అయితే కింద పని చేసే వాళ్ల పనిని గుర్తించాలి కానీ.. ఇలా చేయొద్దు అని శృతి అంటుంది. నువ్వు కావాలంటే ఇక్కడే పని చెయ్.. నేను వెళ్లిపోతున్నాను.. జాబ్ మానేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. శృతి విషయంలో రవిని కూడా నీతూ మందలిస్తుంది. తాను చూసుకుంటానని అతడు చెబుతాడు.
అరుణ్‌ను అక్క, బావకు పరిచయం చేయబోతున్న సుమతి
మరోవైపు అరుణ్ ను అక్క, బావకు పరిచయం చేయాలని సుమతి అనుకుంటుంది. గుడికి రమ్మంటుంది. అతడు ముందే వచ్చేసి ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. మీ బావ ఎలాంటి వాడు అని అరుణ్ అడుగుతాడు. మంచి వాళ్లకు మంచోడు అని సుమతి అంటుంది. తర్వాత ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అటు బాలు, మీనా కారులో వస్తూ.. సుమతి, అరుణ్ గురించి మాట్లాడుకుంటారు. అమ్మాయి తరుఫు వాళ్లం ముందే వెళ్లాలి అని బాలు తొందరపెడుతుంటాడు.
అరుణ్‌ను చూడగానే రెచ్చిపోయిన బాలు.. శత్రువు అంటూ..
ఇటు గుడికి రాగానే మీనా పూల కోసం వెళ్తుంది. అటు సుమతితో అరుణ్ నవ్వుతూ మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఎక్కడికెళ్దాం అని అడుగుతాడు. ఆమె సిగ్గుపడి వెళ్లిపోతుంటే చేయి పట్టుకుంటాడు. అది చూసిన బాలు రెచ్చిపోతాడు. ఒరెయ్ అంటూ దూరం నుంచే అరుస్తూ అరుణ్ మీదికి దూసుకొచ్చి అతన్ని కొడతాడు. సుమతి అడ్డుకున్నా ఆగడు. వీడు నీ వెంటపడి వేధిస్తున్నాడా అని అడుగుతాడు. అటు అరుణ్ కూడా బాలు కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరూ గొడవ పడతారు.
{{/usCountry}}ఇటు గుడికి రాగానే మీనా పూల కోసం వెళ్తుంది. అటు సుమతితో అరుణ్ నవ్వుతూ మాట్లాడుతూ పెళ్లి తర్వాత ఎక్కడికెళ్దాం అని అడుగుతాడు. ఆమె సిగ్గుపడి వెళ్లిపోతుంటే చేయి పట్టుకుంటాడు. అది చూసిన బాలు రెచ్చిపోతాడు. ఒరెయ్ అంటూ దూరం నుంచే అరుస్తూ అరుణ్ మీదికి దూసుకొచ్చి అతన్ని కొడతాడు. సుమతి అడ్డుకున్నా ఆగడు. వీడు నీ వెంటపడి వేధిస్తున్నాడా అని అడుగుతాడు. అటు అరుణ్ కూడా బాలు కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరూ గొడవ పడతారు.
{{/usCountry}}తాను ప్రేమించింది అరుణ్ నే అని సుమతి చెప్పడంతో బాలు మరింత రెచ్చిపోతాడు. వీడిని ప్రేమించివా.. వీడు అసలు మనిషేనా.. ఓ శాడిస్టు.. వీడి కారణంగా రెండుసార్లు జైలుకి వెళ్లాను.. నా లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ప్రత్నించాడు. కారు సీజ్ చేశాడు. వీడు నా అతిపెద్ద శత్రువు.. నాపై కోపంతో నిన్ను ట్రాప్ చేస్తున్నాడు.. పెళ్లి అంటే నిన్ను మోసం చేసి వెళ్లిపోతాడు అని బాలు అంటాడు. వీడి వల్ల నేను రెండుసార్లు సస్పెండ్ అయ్యాను.. డిపార్ట్మెంట్ లో నా పరువు పోయిందని అరుణ్ కూడా అంటాడు.
బాలుని కూల్ చేయాలని చూసిన మీనా
వీడితో పెళ్లికి నేను ఒప్పుకోనే ఒప్పుకోను అంటూ బాలు ఆవేశంగా వెళ్లిపోతాడు. తాను సర్దిచెబుతానని మీనా అతని వెంట వెళ్తుంది. ఆవేశం తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అని అంటుంది. కానీ బాలు మాత్రం వినడు. నువ్వు మాట్లాడుకో.. గుడే కదా.. వీలైతే పసుపు కొమ్ము కూడా కట్టించి పెళ్లి చేసెయ్.. నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్లిపోతాడు. అటు మీనా వెళ్లి సుమతిని అరుణ్ కు దూరంగా తీసుకెళ్తుంది.
పార్వతి, శివకు సుమతి, అరుణ్ విషయం చెప్పిన బాలు
అటు బాలు నేరుగా అత్తగారింటికి వెళ్తాడు. ఆవేశంగా మాట్లాడతాడు. అతన్ని చూసి ఏమైందని పార్వతి, శివ అడుగుతారు. సుమతి విషయం మీకు తెలియదా.. ఆమె ఒకరిని ప్రేమిస్తోంది అని చెప్పడంతో వాళ్లు షాకవుతారు. ఎవరా వ్యక్తి అని పార్వతి అడిగితే.. వదిలేయండి.. వాడి గురించి మాట్లాడటం వేస్ట్.. వాడు మనిషే కాదు.. వాడి సంగతి నేను చేసుకుంటాను అని బాలు అంటాడు.
సుమతి ఎవరినో ప్రేమిస్తుందన్న అనుమానం తనకూ ఉందని పార్వతి అంటుంది. వాడో ట్రాఫిక్ పోలీస్ అని బాలు చెప్పడంతో అతని పేరు అరుణా అని పార్వతి అడుగుతుంది. అవును అని బాలు అనడంతో అతని తల్లి తరచూ సుమతి హాస్పిటల్ కు వచ్చి వెళ్తుంది అని పార్వతి అంటుంది.
పెళ్లి వద్దే వద్దన్న బాలు
వాడితో పెళ్లి వద్దే వద్దు.. సుమతికి మంచి సంబంధం నేను తీసుకొస్తాను అని బాలు అంటాడు. శివ, పార్వతి కంగారు పడతారు. బాలు ఆవేశంగా వెళ్లిపోతాడు. ఇటు శివ, పార్వతి ఏం జరగబోతోందో ఊహించుకొని భయపడతారు. సుమతి ఎవరినో ప్రేమించిందంటే అన్నీ ఆలోచించే చేసి ఉంటుంది.. ఆమె ఏమంటుందో కూడా విందామని శివ అంటాడు.
మనోజ్‌తో రోహిణి గొడవ.. సర్దిచెప్పిన మనోజ్
మరోవైపు ఇంట్లో రోహిణి ఇచ్చిన చెయిన్ వేసుకొని మురిసిపోతుంది ప్రభావతి. రోహిణి మంచి గిఫ్టే ఇచ్చింది అని అనుకుంటుంది. అటు రోహిణి మాత్రం మనోజ్ తో గొడవకు దిగుతుంది. అత్తయ్యకు నేను ఇంత చేస్తున్నా నామీద కోపం తగ్గదా అని అడుగుతుంది. అమ్మకు నా తర్వాత ఈ ఇంట్లో నీవంటే ఎక్కువ ఇష్టం కానీ.. నువ్వు చేసిన పనికి దూరం పెడుతోందని మనోజ్ అంటాడు.
ఇంకెన్నాళ్లిలా అని రోహిణి నిలదీస్తుంది. మనోజ్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అమ్మతో తప్ప నీకోసం ఎవరినైనా ఎదిరిస్తాను అని మనోజ్ అంటాడు. ఇంట్లో అందరూ నన్ను ఏడిపిస్తున్నా.. అమ్మ మాత్రమే నాకు అండగా నిలుస్తుంది.. ఆమెను నేను ఎదురించలేను అని మనోజ్ అంటాడు. దీంతో రోహిణి అలుగుతుంది. ఇంకెన్నాళ్లు ఇలా భరించాలి అని అంటుంది.
మీనాతో బాలు గొడవ
అటు సుమతికి బాలు చాలా సంబంధాలు తీసుకొచ్చానని అంటాడు. ఈ ఫొటోలు పంపించి ఎవరు నచ్చారో చెప్పమను అని మీనాతో అంటాడు. కానీ మీనా మాత్రం సుమతికి నచ్చకుండా మరొక సంబంధం ఎందుకు.. కాస్త ఆవేశం తగ్గించుకొని మాట్లాడి చూద్దాం అని అంటుంది. దీంతో బాలు మరింత రెచ్చిపోతాడు. ఒకవేళ తనను కాదని అరుణ్ ను పెళ్లి చేసుకుంటే నేను జన్మలో ఆ ఇంట్లో అడుగుపెట్టను.. నువ్వు కూడా నీ పుట్టింటికి దూరమవుతావ్ అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.