Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గదిలోనుంచి మెల్లిగా లేచి డాబాపైకి వెళ్లి గుణకు కాల్ చేస్తుంది రోహిణి. కీస్ తీసుకోమ్మని గుణకు విసిరేస్తుంది. బాలు కారు కీస్ తీసుకున్న గుణ తన అసిస్టెంట్‌తో బ్యానెట్ ఓపెన్ చేయించి ఏదో చేయిస్తాడు.
బాలు కారు ముట్టుకోకుండా చేస్తా

ఏం చేయించావ్ అని రోహిణి అడిగితే.. రేపు బాలు కారు ముట్టుకోకుండా ఉండేలా చేశానని గుణ వెళ్లిపోతాడు. రోహిణి కిందకు రాగానే ప్రభావతి నీళ్లకోసం వస్తుంది. అది చూసిన రోహిణి షాక్ అయి దిండు కింద కీస్ పెట్టడం కుదరదని పక్కకు పడేసి వెళ్లిపోతుంది. ఎవరో వెళ్లినట్లు ప్రభావతికి డౌట్ వస్తుంది. గదిలో మనోజ్ లేచి ఉంటాడు. ఎక్కడికెళ్లావ్ అని అడుగుతాడు.
మంచినీళ్లు తాగడానికి వెళ్లానని అబద్ధం చెబుతుంది. మరుసటి రోజు ఉదయం స్కూల్‌కి చింటు కోసం వెళ్తున్నట్లు బాలు చెబుతాడు. శ్రుతి మాత్రం కరివేపాకు, జీడి పప్పు ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. మీనా చెబుతుంది. తనకు నచ్చింది ఏదో చేస్తుంది వదిలేయండని బాలు అంటాడు. సత్యంను అడిగితే.. నేను స్కూల్‌కి రావాల్సిన అవసరం లేదని అంటాడు.
తాళింపు గింజలు అడుగుతుంది శ్రుతి. ఏం చేస్తున్నావని రోహిణి అడిగితే.. సర్‌ప్రైజ్ అంటుంది శ్రుతి. మీనా నేను వెళ్తామని బాలు అంటే.. మీనా ఎందుకు టిఫిన్ చేసి వెళ్లు అని ప్రభావతి అంటుంది. అర్జంట్‌గా పూలు ఇవ్వాలని, అటునుంచి చింటుని కలవాలని మీనా అంటుంది. చింటు కోసం ఎందుకు, వాడి మీద ఎందుకంత ప్రేమ, తల్లితండ్రి లేనోడు అంటూ తిడుతుంది ప్రభావతి.
స్టేజ్ ఆర్టిస్టుగా ప్రభావతి
మళ్లీ శ్రుతి వచ్చి పచ్చి బఠానీలు అడుగి వెళ్లిపోతుంది. ఏంట్రా నీ పెళ్లాం వస్తుంది అడుగుతుంది. థ్యాంక్యూ అని వెళ్లిపోతుంది అని శ్రుతిలాగే చేసి చూపిస్తుంది ప్రభావతి. దాంతో అంతా నవ్వుతారు. అబ్బో అమ్మావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని బాలు అంటాడు. మీ అమ్మకు నాట్యమే కాదు నటన కూడా బాగా వచ్చు. మీ అమ్మ స్టేజ్ ఆర్టిస్టు అని సత్యం అంటాడు.
{{/usCountry}}మళ్లీ శ్రుతి వచ్చి పచ్చి బఠానీలు అడుగి వెళ్లిపోతుంది. ఏంట్రా నీ పెళ్లాం వస్తుంది అడుగుతుంది. థ్యాంక్యూ అని వెళ్లిపోతుంది అని శ్రుతిలాగే చేసి చూపిస్తుంది ప్రభావతి. దాంతో అంతా నవ్వుతారు. అబ్బో అమ్మావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని బాలు అంటాడు. మీ అమ్మకు నాట్యమే కాదు నటన కూడా బాగా వచ్చు. మీ అమ్మ స్టేజ్ ఆర్టిస్టు అని సత్యం అంటాడు.
{{/usCountry}}స్టేజ్ ఎక్కి బొమ్మలు వేస్తుందా అని బాలు కౌంటర్ ఇస్తాడు. స్టేజ్ మీద నాటకాల్లో సహజమైన నటనతో ఆకట్టుకుంటారని మనోజ్ అంటాడు. నీకు బాగా తెలుసురా అని బాలు అంటే.. బాగా చదువుకుంటే తెలుస్తుంది. ఊరిలో పొలాల్లో తిరిగితే ఏం తెలుస్తుందని మనోజ్ అవమానిస్తాడు. అవును బాగా చదువుకుని పార్కులో పడుకుని పల్లీలు తినాలని బాలు అంటాడు.
పాతవన్నీ తవ్వడమెందుకని రోహిణి అంటే.. చిన్ననాటి విషయాలు మీ ఆయన గుర్తుచేసి ఎక్కిరించలేదా అని మీనా కౌంటర్ ఇస్తుంది. బాలు, మీనాలను వెళ్లమంటాడు సత్యం. కారు తాళాల కోసం బాలు వెతుకుతాడు. దిండు కింద కీస్ లేవని మీనా అంటుంది. కారు కీస్ వెతుకుతారు. ఇంతలో మనోజ్‌కు కీస్ కనిపిస్తాయి. బాలుకు ఇస్తాడు మనోజ్.
రోహిణితో లాంగ్ డ్రైవ్
నువ్వే తీశావా అని బాలు అడిగితే.. అవునురా.. నీ కారు కీస్ తీసుకుని నేను రోహిణి రాత్రి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లొచ్చామని మనోజ్ వెటకారంగా అంటాడు. ఏంటీ రాత్రి బయటకెళ్లొచ్చారా, ఎవరిని అడిగి వెళ్లారు అని ప్రభావతి కంగారుగా అడుగుతుంది. నేనెందుకు వెళ్తానమ్మా అని మనోజ్ అంటాడు. మరి ఇంకెవరు తీశారని రోహిణివైపు అనుమానంగా చూస్తుంది మీనా.
నేనెందుకు తీస్తాను. నాకేమైనా డ్రైవింగ్ వచ్చా అని రోహిణి అంటుంది. తన అసిస్టెంట్‌లకు గుణ కాల్ చేసి ఈరోజు బాలు కథ ముగుసిపోవాలి. రోహిణి ఏమాత్రం ఊహించదు. కారు కీస్ అడిగింది బ్రేకులు పనిచేయకుండా చేయడానికని. స్పీడుగా వెళితే ఆయిల్ లీక్ అయి బ్రేకులు ఫెయిల్ అవుతాయవని. వాడినే ఫాలో అవ్వండి. ఎవరినైనా గుద్దితో కేస్ అవుతుంది. దేన్నైనా గుద్దితో ప్రాణమే పోతుంది. అదంతా వీడియో తీయండని గుణ చెబుతాడు.
రౌడీలు సరేనంటారు. బాలు, మీనా బయటకు వస్తారు. మీనా కూడా వచ్చి పూలు ఇవ్వాలని అంటుంది. ఇంతలో బాలుకు రాజేష్ కాల్ చేసి మాట్లాడుతాడు. ఇంతలో మీనా పూలు ఇవ్వాల్సిన ఆవిడ వచ్చి పూలు తీసుకెళ్లిపోతుంది. తర్వాత బాలు బానెట్ ఓపెన్ చేస్తాడు. బానెట్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుందిరా అని రౌడీలు అనుకుంటారు.
శ్రుతి స్పెషల్ ఉప్మా
ఏవండి టిఫిన్ చేసి వెళ్లండని మీనా అనడంతో బాలు చూడకుండా లోపలికి వెళ్లిపోతాడు. కిచెన్‌లో శ్రుతి స్పెషల్ డిష్ ఉప్మా అని టిఫిన్ చేస్తుంది శ్రుతి. బాలుకు చెబితే కంగారుపడతాడు. బయటకెళ్లి తిందామంటాడు. ఇంతలో రవి వస్తాడు. శ్రుతి ఉప్మా చేస్తుంది. కుటుంబం మొత్తం హాస్పిటల్ పాలైనట్లు న్యూస్ వస్తుంది. దానికి వేడినీళ్లు పెట్టడం కూడా రాదని వెళ్లి అడుగుతాడు.
నా ఫ్యామిలీని క్షేమంగా ఉండనివ్వు అంటాడు రవి. డైనింగ్ టేబుల్‌పై ఉప్మా పెట్టి బాలు, మీనాను పిలుస్తుంది. ఎలకలా మీద చేయాల్సిన ప్రయోగం మా మీద చేస్తున్నావని బాలు అంటాడు. మీనా మాత్రం మంచిగా చెబుతుంది. ముందు ప్రభావతి, మనోజ్, పార్లరమ్మా మీద ప్రయోగం చేయమన బాలు అంటాడు. శ్రుతి, రవి పిలవడానికి వెళ్తారు.
బాలు కారు బ్రేకులు ఫెయిల్
అర్జంట్‌గా ఫోన్ వచ్చి వెళ్లాడని చెప్పు అని మీనాతో చెప్పి బాలు పారిపోయేందుకు ట్రై చేస్తాడు. బాలు కారులో వెళ్తాడు. బాలు స్లోగా వెళ్తుంటే గుణ రౌడీలు నీ బండి స్లోనా ఏంటీ అని రెచ్చగొడతారు. దాంతో బాలు స్పీడ్ పెంచుతాడు. కారు బ్రేకులు ఫెయిల్ అయి పడవు. బాలు కంగారుపడతాడు. ఎదురుగా ఓ తల్లి, పిల్లాడు ఉంటారు. వాళ్లవైపే బాలు కారు వెళ్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.