...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: నా ఫ్యామిలీ జోలికి రావద్దంటూ గుణకు రోహిణి వార్నింగ్.. అడ్డంగా బుక్కయిన అరుణ్

Gunde Ninda Gudi Gantalu Serial October 21st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్ లో బాలుకి జరిగింది తెలుసుకున్న రోహిణి.. గుణకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. అటు బాలు విషయంలో అరుణ్ కావాలని చేసిన తప్పు బయటపడుతుంది.

Published on: Oct 21, 2026, 07:21:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు చేసిన పని ఇంట్లో తెలవడం, అది విని రోహిణి షాకైపోయి గుణకు పోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, సత్యం ఉగ్రరూపం చూపించడం, మరోవైపు అరుణ్ బండారం బయటపడిపోవడం చూడొచ్చు.

కారు బ్రేకులు పని చేయలేదని తెలిసినా నిజం దాచిన అరుణ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్

బాలు కారు తీసుకొని కానిస్టేబుల్.. అరుణ్ దగ్గరికి వచ్చే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. అతడు గాయాలతో ఉండటంతో ఏం జరిగిందని అరుణ్ అడుగుతాడు. కారు బ్రేకులు పని చేయలేదని, గోడకు గుద్దేయడంతో ఇలా జరిగిందని చెబుతాడు.

అంటే బాలు చెప్పింది నిజమేనన్న మాట అని అరుణ్ అంటాడు. అవును సార్.. అనవసరంగా బాలు కారు సీజ్ చేసి, లైసెన్స్ కూడా రద్దు చేయాలని చూస్తున్నా.. ఇది కరెక్ట్ కాదు సార్ అని కానిస్టేబుల్ అంటాడు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.. వ్యక్తిగత కక్ష ఉన్న వ్యక్తుల విషయంలో ఇలా చేయడంలో తప్పేమీ లేదు.. వాడు ఓ ఆరు నెలలు ఇంట్లో కూర్చుంటే వచ్చే నష్టమేమీ లేదు అని అరుణ్ అంటాడు.

ఇంట్లో జరిగిన విషయం చెప్పిన బాలు, మీనా.. నోరు జారిన మనోజ్

ఇటు ఇంట్లో బాలు, మీనా రాకపోవడంతో అందరూ ఎదురు చూస్తుంటారు. అప్పుడే ఇద్దరూ బాధతో ఇంట్లో వస్తారు. బాలు కారు అదుపు తప్పి పోలీస్ బైకును గుద్దేసిందని మీనా చెబుతుంది. అది విని సత్యం షాక్ తింటాడు. కానీ మనోజ్, ప్రభావతి, రోహిణి మాత్రం తమకు అలవాటైన రీతిలో నోరు పారేసుకుంటారు.

ఆ తర్వాత మీనా అసలు విషయం చెబుతుంది. కారు బ్రేకులు ఫెయిలయ్యాయని, దారిలో ఓ గర్బిణి, పిల్లలు ఉండటంతో వాళ్లను తప్పించబోయి పక్కనే ఉన్న అరుణ్ బైకును గుడ్డేశాడని మీనా చెబుతుంది. ఆ విషయం విని రోహిణి షాక్ తింటుంది. ఇది గుణ చేసిన పనే అని అర్థం చేసుకుంటుంది. బ్రేకులు ఫెయిలైన విషయం విని సత్యం కంగారు పడతాడు. నీకేం కాలేదు కదా అని బాలుని అడుగుతాడు. తనకేమీ కాలేదని బాలు అంటాడు. కానీ కారు సీజ్ చేసి, లైసెన్స్ రద్దు చేస్తానంటున్నాడని మీనా చెబుతుంది.

అక్కడి వరకూ బాగానే వెళ్లిన కారు అక్కడే ఎందుకు అదుపు తప్పింది.. ఆ అరుణ్ తో గొడవ పడటం వల్ల వాడు కావాలనే కేసు పెట్టి ఉంటాడు అని మనోజ్, ప్రభావతి మళ్లీ బాలునే నిందిస్తారు. వీడికి జైలుకి వెళ్లడం కొత్త కాదు కదా అని ప్రభావతి అంటుంది. మనోజ్ కూడా మరోసారి నోరు జారుతాడు.

సత్యం ఉగ్రరూపం.. మనోజ్ కాలర్ పట్టుకొని.. ప్రభావతి, రోహిణిలకు క్లాస్ పీకి..

దీంతో సత్యం ఉగ్రరూపం చూపిస్తాడు. మనోజ్ కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. మరోసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే నీ పెళ్లాం ముందే నిన్ను బయటకు గెంటేస్తానని అంటాడు. నీ కొడుకుని జైల్లో షర్ట్ విప్పి కూర్చోబెడితే కాపాడింది ఈ బాలునే.. కళ్లు పోతే అప్పు చేసి రక్షించింది ఈ బాలు, మీనాలే.. అలాంటి కళ్లతో బాలుని తప్పుగా ఎలా చూడాలని అనిపిస్తోంది.. రోహిణి వంద తప్పులు చేసి కాపురం కూలే పరిస్థితి వస్తే.. కాపురం నిలబెట్టింది కూడా ఈ బాలు, మీనాయే..

నా కొడుకును అనే అర్హత ఎవరికీ లేదు.. ఈరోజు నా కొడుకు ప్రాణాలతో ఇంటికి వచ్చాడు.. నాకు అదే చాలు.. కారు పోయినా నా కష్టార్జితంతో అతన్ని పోషించుకుంటాను అని సత్యం ఎమోషనల్ అవుతాడు. నేనేం అన్నాను.. జాగ్రత్తగా ఉండమన్నానంతే అని ప్రభావతి నంగనాచిలా మాట్లాడితే.. మా అత్త మహానటి అంటూ శృతి కౌంటర్ వేస్తుంది.

తన మనుషులను చితకబాదిన గుణ.. ఫోన్ చేసి క్లాస్ పీకిన రోహిణి

అంటే నిజంగానే కారు బ్రేకులు ఫెయిలయ్యాయా అని చివరికి రోహిణి అడుగుతుంది. ఇంతసేపూ చెప్పింది అదే కదా అని మీనా అంటుంది. దీంతో వెంటనే పైకి వెళ్లి గుణకు ఫోన్ చేస్తుంది. అప్పటికే తన ప్లాన్ ఫెయిలైనందుకు తన మనుషులను గుణ చితకబాదుతుంటాడు. రోహిణి ఫోన్ చేసి అతనికి క్లాస్ పీకుతుంది. తనకు సాయం చేస్తావని కారు కీస్ ఇస్తే.. ఇలా క్రిమినల్ పనులు చేస్తావా.. నా ఫ్యామిలీ జోలికి వస్తే బాగుండదు..

నా ఫ్యామిలీలో ఒకరి ప్రాణం తీయాలని ఎలా అనుకుంటావ్.. చీమ చిటుక్కుమన్నా ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది.. మరోసారి ఇలా చేస్తే బాగుండదు అని గట్టి వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తుంది. దీంతో అక్కడే ఉన్న దినేష్ కు రోహిణి వార్నింగ్ విషయం చెబుతాడు గుణ. రోహిణి అంతే.. తాను బాగుండటం కోసం ఎంతమందినైనా వెర్రి వెంగళప్పలను చేస్తుందని దినేష్ అంటాడు. బాలు సంగతి తాను చూసుకుంటానని, నెల రోజులు కనిపించకుండా వెళ్లండని తన మనుషులకు చెబుతాడు గుణ.

బాలుకి క్లాస్ పీకిన మీనా.. కంకణం కట్టి..

ఆ తర్వాత బాలుకి మీనా క్లాస్ పీకుతుంది. మనుషుల మధ్య ఉన్నామా.. మృగాల మధ్య ఉన్నామా అనిపిస్తోంది.. ఓ మనిషికి ప్రమాదం నుంచి బయటపడి వస్తే ఇలా మాట్లాడతారా.. అసలు వాళ్లు మనుషులేనా అని తిడుతుంది. అయినా తన మాట వినకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని మీనా అంటే.. తానేం చేశానని బాలు అడుగుతాడు. మీకు ఏదో కీడు శంకిస్తోందని, కంకణం కట్టుకోమని చెప్పాను విన్నారా.. ఆ శృతి కూడా జెన్ జీ యుగంలో ఇవన్నీ ఏంటని మీకు సపోర్ట్ చేసింది అని మీనా తిడుతుంది.

దానికీ దీనికేం సంబంధం అని బాలు అంటే.. ఈ విశ్వంలో ఏం జరిగినా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది.. పూలు కట్టుకునే నన్ను మీరు కట్టుకోలేదా.. అందుకే అప్పుడప్పుడూ నా మాట వినండి అంటూ బాలు వద్దంటున్నా ఆ కంకణాన్ని అతనికి కడుతుంది మీనా. కారు పోయిందని బాలు బాధపడుతుంటే.. వెళ్లి అరుణ్ ను అడుగుదామని చెబుతుంది.

అడ్డంగా దొరికిపోయిన అరుణ్

మరుసటి రోజు బాలు, మీనా పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అరుణ్ గురించి సీఐకి చెప్పబోతే.. అరుణ్ అడ్డుపడి ఈ బాలు తనపై పగతో తనను కారుతో గుద్ది చంపాలని చూశాడని అరుణ్ అంటాడు. అయితే కానిస్టేబుల్ రావడంతో అసలు ఏం జరిగిందో చెప్పాలని మీనా అడుగుతుంది. కానీ చెప్పొద్దంటూ అరుణ్ సైగ చేయడంతో అతడు సైలెంట్ గా ఉంటాడు.

అప్పుడే ఈ ప్రమాదం నుంచి బయటపడి మహిళ వచ్చి అసలు విషయం చెబుతుంది. ఆయన వల్లే తమ ప్రాణాలు మిగిలాయని అంటుంది. దీంతో కానిస్టేబుల్ కూడా నోరు విప్పుతాడు. అరుణ్ బండారం బయటపెడతాడు. బాలుపై కావాలనే అరుణ్ సర్ కేసు పెట్టాడని అంటాడు. దీంతో అరుణ్ షాకవుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks