...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: అమ్మవారి సాక్షిగా మీనా మెడలో బాలు తాళి.. ప్రభావతి 50 లక్షల అప్పు.. చింతీ ప్లాన్

Gunde Ninda Gudi Gantalu Serial October 28th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్ లో అమ్మవారి సాక్షిగా మీనా మెడలో బాలు తాళి కడతాడు. అటు శోభనతో కలిసి బాలు, మీనాను దెబ్బకొట్టడానికి చింతామణి ప్లాన్ చేస్తుంది.

Published on: Oct 28, 2026, 06:53:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు నవరాత్రి ఉత్సవాలు మొదలుపెడతాడు. అంతేకాదు అదే అమ్మవారి ముందు మీనాకు బంగారు మంగళసూత్రం మెడలో వేస్తాడు. అటు గుణ, ఇటు చింతామణి మాత్రం వీళ్లను దెబ్బకొట్టడానికి ప్లాన్స్ వేయడంతో పెద్ద ముప్పే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది.

అరుణ్‌తో మళ్లీ బాలు గొడవ.. మండపానికి అనుమతి రాదంటూ..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్

అరుణ్ తో బాలు గొడవ పడే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మండపం కోసం అనుమతి అడగడానికి బాలు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. కానీ అప్పటికే అరుణ్ మాత్రం సీఐతో మాట్లాడి అనుమతి రాకుండా చేస్తాడు. నేను డ్యూటీలో ఉన్నా, సస్పెండ్ అయినా ఎప్పటికీ పోలీస్ నే.. నీకు అనుమతి రానే రాదు అని బాలుని రెచ్చగొడతాడు.

దీంతో బాలు ఆవేశంతో రగిలిపోతుండగా.. రాజేష్ అతన్ని బయటకు తీసుకెళ్తాడు. నవరాత్రు అయ్యేంత వరకు ఎవరితో గొడవ పడనని మాటిచ్చానని, అందుకే ఆగిపోయానని బాలు అంటాడు. ఇంతలో మీనా ఫోన్ చేస్తుంది. అనుమతి రాలేదని చెప్పిన బాలు.. ఆమెకు ఓ ప్లాన్ చెబుతాడు. ఆమె సరే అంటుంది.

శోభనతో కలిసి చింతామణి ప్లాన్

మరోవైపు చింతామణి పగతో రగిలిపోతూ శోభన ఇంటికి వెళ్తుంది. సురేంద్ర తనకు తెలుసు అని, వాళ్ల డిపోల్లో డెకరేషన్లు తానే చేస్తానని శోభతో పరిచయం చేసుకుంటుంది. ఆయన ఇంట్లో లేరని అంటే.. మీతో పని కోసం వచ్చానని, మనం చేతులు కలపాలని అంటుంది. మీరెవరో తెలియదు.. మీతో చేతులు కలపడమేంటని శోభన అంటుంది.

ఇటు బాలు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మీనా తనకు తెలిసిన ఓ లీడర్ ను పోలీస్ స్టేషన్ కు పంపిస్తుంది. వాళ్లు మండపం ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసులకు చెబుతారు. దీంతో వెంటనే అనుమతి ఇస్తూ సంతకం చేస్తాడు సీఐ.

బయట వేచి చూస్తున్న బాలు దగ్గరికి అరుణ్ వచ్చి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావ్.. నన్ను బతిమాలుకోవడానికా.. ఎంత బతిమాలినా నీకు అనుమతి రాదు అని అంటాడు. నీలాంటి వాళ్ల కాలర్ పట్టుకుంటాను కానీ కాళ్లు పట్టుకోను అని బాలు చెబుతాడు. ఇంతలో వాళ్లు వచ్చి పర్మిషన్ లెటర్ బాలు చేతుల్లో పెట్టి వెళ్తారు. ఆ అనుమతి చూపించడంతో అరుణ్ ముఖం వాడిపోతుంది.

బాలు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

మండపానికి అనుమతి లభించడంతో ఇటు బాలు నవరాత్రి ఉత్సవాలు మొదలు పెడతాడు. గుడి దగ్గర అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేస్తాడు. తొలిరోజు ఘనంగా పూజలు మొదలు పెడతారు. ఇంట్లో వాళ్లందరూ వస్తారు. తనకు అలవాటైన రీతిలో మనోజ్ ఇలాంటి వాటిపై డబ్బులు వృథా చేయనని, తాను బిజినెస్ మ్యాన్ అంటూ నోరు జారుతాడు.

అమ్మవారి మండపానికి వచ్చి అలాంటి మాటలు మాట్లాడితే నోరు పడిపోతుందని బాలు శపించడంతో ప్రభావతి, రోహిణి కంగారు పడతారు. ఆ మాట వెనక్కి తీసుకోమంటారు. అది కుదరదంటూ తప్పయిందని మనోజే తన చెంపలు వాయించుకుంటూ క్షమాపణ చెప్పేలా చేస్తాడు.

రవి, శృతి, రోహిణి, సత్యం చందాలు.. మనోజ్ కక్కుర్తి

ఆ తర్వాత తొలిపూజ ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులైతే మొదలుపెడతారు కానీ.. 9 రోజులకు సరిపడా డబ్బులు లేవని రాజేష్ అంటాడు. మనోజ్ ఇరికిద్దామనుకొని వాడి దగ్గరికెళ్లి చందా అడుగు అని బాలు చెబుతాడు. రాజేష్ వెళ్లి చందా అడిగితే మనోజ్ ఇవ్వడు. దీంతో రవి తాను 5 వేలు ఇస్తానంటాడు. అటు శృతి, రోహిణి, సత్యం కూడా తలా 5 వేలు ఇస్తామని చెబుతారు. మనోజ్ మాత్రం చందా నుంచి తప్పించుకోవడానికి తనకు ఫోన్ వచ్చినట్లు బిల్డప్ ఇచ్చి పక్కకెళ్తాడు.

గుణతో రాజేష్ గొడవ.. సపోర్ట్‌గా బాలు.. ఆపిన సత్యం

పూజ పూర్తవగానే గుణ తన మనుషులతో కలిసి వస్తాడు. దీంతో రాజేష్ వెళ్లి మాట్లాడతాడు. వడ్డీ ఇవ్వమంటే మావాళ్లను కొట్టి పంపించారట అని రాజేష్ ను గుణ అడుగుతాడు. నవరాత్రులు పూర్తయ్యే వరకు వడ్డీ ఇవ్వమన్నాం.. కొట్టలేదు.. అయినా 100కి 5 వడ్డీ ఇస్తున్నాం.. ఇప్పుడు 10 చేస్తే ఎలా కడతాం.. అంటూ గొడవకు దిగుతారు. ఇంతలో బాలు వస్తాడు. గుణ కాలర్ పట్టుకుంటాడు.

తన కారు బ్రేకులు తీసింది నువ్వే కదా అని నిలదీస్తాడు. గుణ బుకాయిస్తాడు. ఆ గొడవ చూసిన సత్యం పరుగెత్తుకుంటూ వచ్చి.. నవరాత్రులు అయ్యే వరకు ఎవరితో గొడవ పడనని మాటిచ్చావ్.. ఇప్పుడిలా చేయొద్దు అని చెప్పి బాలుని తీసుకెళ్తాడు. నవరాత్రులు అయిన తర్వాత వడ్డీ ఇస్తామని చెప్పి రాజేష్ వెళ్లిపోతాడు. బాలుని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం అని గుణ తన మనుషులతో అంటాడు. అందుకోసం ప్లాన్ చేస్తాడు.

మీనా మెడలో బాలు తాళి

అటు శోభన ఇంట్లో బాలు, మీనాలను దెబ్బ కొట్టడానికి చింతామణి ప్లాన్ చేస్తుంది. ప్రభావతి తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి రూ.50 లక్షలు అయిందని, వాళ్ల ఇల్లు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లగొడదామని చింతామణి ప్లాన్ వేస్తుంది.

ఇటు మీనా కోసం బాలు బంగారు మంగళసూత్రం తీసుకొస్తాడు. ఈ తాళి కట్టేవరకు నగలు వేసుకోనని మీనా గతంలో చేసిన శపథాన్ని గుర్తు చేస్తాడు. అమ్మవారి సాక్షిగా ఆమె మెడలో ఆ తాళి వేస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks