...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాకు అడ్డంగా దొరికిపోయిన మేక మామ.. మొత్తం ఫ్యామిలీ ముందు బుక్.. రోహిణి, మనోజ్ షాక్

Gunde Ninda Gudi Gantalu Serial August 4th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 4 ఎపిసోడ్ లో బాలు, మీనాతోపాటు ఫ్యామిలీ మొత్తం ముందు మేక మామ బుక్కయినట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. దీంతో రోహిణి బండారం మొత్తం బయటపడే ప్రమాదం పొంచి ఉంది.

Published on: Aug 3, 2026, 13:55:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Tomorrow Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ రేపటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. అందులో సుందరి పెళ్లిలో మేక మామ అడ్డంగా బుక్కయినట్లు చూపించారు.

పద్మావతి, పురుషోత్తం నగలు దొంగతనం

Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాకు అడ్డంగా దొరికిపోయిన మేక మామ.. మొత్తం ఫ్యామిలీ ముందు బుక్.. రోహిణి, మనోజ్ షాక్
Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాకు అడ్డంగా దొరికిపోయిన మేక మామ.. మొత్తం ఫ్యామిలీ ముందు బుక్.. రోహిణి, మనోజ్ షాక్

స్టార్ మా రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో పద్మావతి, పురుషోత్తం నగలను దొంగతనం చేస్తారు. ఆ నగలతో ఉన్న బ్యాగును పట్టుకొని హడావిడిగా బయటకు వెళ్తుంటారు. ఇంతలో మీనా ఆమెకు అడ్డు వస్తుంది. ఆమెను చూసి కంగారుగా పద్మావతి బయటకు వెళ్తుంది. దీంతో మీనాలో అనుమానం మొదలవుతుంది.

బాలు, మీనా ఫైట్

అదే విషయాన్ని బాలుతో చెబుతుంది మీనా. వచ్చేటప్పుడు వీళ్లు చిన్న బ్యాగుతో వచ్చారు. ఇప్పుడిలా పెద్ద బ్యాగుతో వెళ్తున్నారు అంటుంది. అంతలో వాళ్లు ఆటోలో ఎక్కి పారిపోతుండగా.. బాలు ఆటోను అడ్డుకుంటాడు. ఆ ఇద్దరితో మీనా, బాలు ఫైట్ చేస్తారు.

మీనాకు గాయం

ఇంతలో పురుషోత్తం తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేస్తాడు. అయినా బాలు వాళ్లను వదలడు. కామాక్షి, రంగారావు కూడా అక్కడికి వస్తారు. అప్పుడే బ్యాగు తీసి చూస్తే అందులో నగలు కనిపిస్తాయి. దీంతో అందరూ షాకవుతారు.

దొరికిపోయిన మేక మామ

మీనా చేతికి గాయం కావడంతో ఆమెకు కట్టు కడతారు. ఇంతలో రంగారావు వచ్చి మీరు చేసిన పనికి అబ్బాయి మేన మామ చాలా సంతోషించాడు.. మీకు సన్మానం చేయడానికి వస్తున్నాడు అని చెబుతాడు. ఇంతలో బ్యాండు మేళంతో చేతిలో దండ పట్టుకొని మేక మామ డ్యాన్స్ చేస్తూ వస్తాడు. బాలు, మీనా అతన్ని చూస్తారు. ఇతనెవరు అని రంగారావును బాలు అడుగుతాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe