గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 577వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి, సత్యంలను కలపాలన్న సుశీల, బాలు ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ ఇద్దరూ బాగా కలిసిపోతారు. అయితే చివర్లో బాలు ఎవరో తెలియదంటూ చెల్లి మౌనిక అతన్ని మెడపట్టి బయటకు గెంటేయించడంతో బాలు షాక్ తింటాడు.
ఆ లెటర్‌పై మనోజ్ టెన్షన్.. రోహిణిలోనూ అనుమానం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్ మనోజ్ తనకు అందిన లెటర్ గురించి టెన్షన్ పడుతున్న సీన్ తో మొదలవుతుంది. అసలు ఈ పనిని ఎవరు చేశారా అని ఆలోచిస్తుంటాడు. బాలు, మీనానా లేక ఇంకా ఎవరైనా చేశారా అంటూ.. రోహిణి వెంట వచ్చిన విద్యను కూడా అతడు అనుమానిస్తాడు. అటు మనోజ్ ను టెన్షన్ పడొద్దని చెప్పి విద్యతో కలిసి పక్కకు వెళ్లిన రోహిణి కూడా లెటర్ పై ఆందోళన చెందుతుంది. దినేష్ ఏమైనా చేశాడా అని విద్యతో అంటుంది.
రెండో పెళ్లాన్ని తీసుకొచ్చిన బాలు
ఇటు ఇంటికి రెండో పెళ్లాన్ని తీసుకొచ్చానంటూ బయట నుంచి మీనాకు ఫోన్ చేసి చెబుతాడు బాలు. రెండో కారు అని ఆమె అర్థం చేసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరికీ రెండో కారు విషయం చెప్పి బయటకు తీసుకెళ్తుంది. అందరూ కారు చూసి మురిసిపోతుంటారు. కానీ ప్రభావతి మాత్రం రోహిణి ఇచ్చిన డబ్బుతోనే కదా అంటుంది. నువ్వు, మనోజ్ మింగిన డబ్బే కదా అని రవి అంటాడు. దీంతో ప్రభావతి అతన్ని మందలిస్తుంది. తర్వాత మీనా కారుకు హారతి ఇచ్చి, పూజ చేస్తుంది. కారులో అమ్మానాన్నలను గుడికి తీసుకెళ్లమని సుశీల చెబుతుంది.
కారులో ఒక్కటైన సత్యం, ప్రభావతి
సరే అంటూ బాలు, మీనాతోపాటు సత్యం, సుశీల గుడికి బయలుదేరుతారు. కారులోనూ వాళ్లు మాట్లాడుకోకపోవడంతో బాలు ఓ ప్లాన్ వేస్తాడు. రోడ్డు బాలేదంటూ కారును కావాలని అటూఇటూ తిప్పుతూ ఒకరిపై మరొకరు పడిపోయేలా చేస్తాడు. ఇలా అయితే మేం నడుచుకుంటూ వెళ్తామని ప్రభావతి అంటుంది. నువ్వు నా చేయి పట్టుకొని కూర్చో అంటూ సత్యం ఆమెకు చెబుతాడు. ఆమె భర్త చేయి పట్టుకొని మురిసిపోతూ కూర్చొంటుంది. ఇద్దరూ ఒక్కటవడంతో బాలు, మీనా సంతోషిస్తారు.
రవి సిగ్గు బిళ్ల ఫొటో శృతికి చూపించిన సుశీల
{{/usCountry}}సరే అంటూ బాలు, మీనాతోపాటు సత్యం, సుశీల గుడికి బయలుదేరుతారు. కారులోనూ వాళ్లు మాట్లాడుకోకపోవడంతో బాలు ఓ ప్లాన్ వేస్తాడు. రోడ్డు బాలేదంటూ కారును కావాలని అటూఇటూ తిప్పుతూ ఒకరిపై మరొకరు పడిపోయేలా చేస్తాడు. ఇలా అయితే మేం నడుచుకుంటూ వెళ్తామని ప్రభావతి అంటుంది. నువ్వు నా చేయి పట్టుకొని కూర్చో అంటూ సత్యం ఆమెకు చెబుతాడు. ఆమె భర్త చేయి పట్టుకొని మురిసిపోతూ కూర్చొంటుంది. ఇద్దరూ ఒక్కటవడంతో బాలు, మీనా సంతోషిస్తారు.
రవి సిగ్గు బిళ్ల ఫొటో శృతికి చూపించిన సుశీల
{{/usCountry}}ఇటు ఇంట్లో శృతి.. సుశీలకు ఆమె బర్త్ డే ఫొటోలు చూపిస్తుంటుంది. బాలు మీకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని అంటుంది. మీ బాయ్‌ఫ్రెండ్ గోపాల్ కూడా బాగున్నాడని శృతి అనడంతో సుశీల మురిసిపోతుంది. మీ గోపాలం ఫొటో కూడా చూపిస్తానని రవి చిన్నప్పుడు సిగ్గు బిల్లతో ఉన్న ఫొటోను శృతికి చూపిస్తుంది. అది చూసి రవిని ఆమె ఆట పట్టిస్తుంది. ఆ ఫొటో డిలీట్ చేయమని ఆమె వెంట పడతాడు. అప్పుడే బాలు, మీనా కూడా రావడంతో ఏం జరుగుతోందని వాళ్లు అడిగినా రవి చెప్పొద్దని అంటాడు.
ఒక్కటిగా తిరిగొచ్చిన సత్యం, ప్రభావతి.. ఆట పట్టించిన మీనా
ఆ వెంటే సత్యం, ప్రభావతి కూడా నవ్వుతూ ఇంటికి రావడం చూసి సుశీల, రవి, శృతి ఆశ్చర్యపోతారు. ఇందుకేనా మమ్మల్ని వెళ్లొద్దన్నది అని సుశీలతో రవి అంటాడు. ఇద్దరూ కలిసిపోయారా అని అడిగితే.. ఆ మనోజ్ గాడి వల్లే ఇదంతా జరిగిందని ప్రభావతి అంటుంది. పిల్లలను ప్రేమించడమే కాదు.. వాళ్లు తప్పు చేస్తే మందలించడం కూడా అవసరమనే తాను చెబుతున్నానని సత్యం అంటాడు. ఆ తర్వాత సత్యం మెడకు ప్రభావతి స్టిక్కర్ ఉండటం చూసి మీనా వాళ్లను ఆట పట్టిస్తుంది.
అంతా కలిసి ఆనందంగా ఉన్నారనుకుంటున్న సమయంలో ఎపిసోడ్ చివర్లో మౌనిక ఇచ్చిన షాక్ ఆశ్చర్యపరుస్తుంది. ఓ రైడ్ కోసం వెళ్లిన బాలుకి మౌనిక కనిపిస్తుంది. ఆమె తన పర్స్ పడేసుకొని వెళ్లడంతో అది ఇవ్వడానికి బాలు వెంట వెళ్తాడు. ఆమెతో మాట్లాడుతుండగా.. సెక్యూరిటీ వచ్చి బాలును అడ్డుకుంటాడు. తను మా చెల్లెలు అని అతడు చెప్పగా.. అతనెవరో తనకు తెలియదని ఆమె అనడంతో బాలు షాక్ తింటాడు. దీంతో సెక్యూరిటీ బాలు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. అది చూసి సంజూ మురిసిపోతాడు అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.