గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోతిష్కుడుని మనోజ్ కలుస్తాడు. తాను చెప్పినట్లుగానే రోజు రంగుల బట్టలు వేసుకోవాలని, ఇవాళ ఈ షర్ట్ వద్దని విప్పిస్తాడు జ్యోతిష్కుడు. షర్ట్ విప్పించి కండువా ఇస్తాడు. నీ బట్టలు నీ భార్య మాత్రమే ఉతకాలి. నీకు అదృష్టం మొదలై కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని జ్యోతిష్కుడు అంటాడు.
హుండీ తీసుకొచ్చిన బాలు

అంటే దానికోసం కూడా మావోడు ఏం చేయక్కర్లేదా అని మనోజ్ ఫ్రెండ్ అంటాడు. మరోవైపు బాలు హుండీ డబ్బా తీసుకొస్తాడు. దీంతో అడుక్కుంటున్నావురా అని ప్రభావతి అంటే మీనా పంచ్‌లు వేస్తుంది. ఆయనకు అడుక్కునే గతి పట్టలేదు. ఆయన మనోజ్ కాదు అని మీనా అంటుంది. ఇంతలో మనోజ్ అడుక్కునేవాడిలా పిలుస్తాడు. అంతా చూసి షాక్ అవుతారు.
విచిత్రంగా మాట్లాడుతూ ఎవరిని ముట్టుకోనివ్వడు మనోజ్. హుండి సంగతి చెప్పురా అని సత్యం అంటే.. రోజు ఆదాయం వేసి పొదుపు చేయాలనుకుంటున్నాం అని బాలు చెబుతాడు. బాలు డబ్బు ఇచ్చి సత్యం, ప్రభావతితో హుండిలో వేయిస్తాడు. ఇంతలో రోహిణి వస్తుంది. మనోజ్ గురించి చెబితే పైకి వెళ్లి భర్తను అడుగుతుంది. జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్లింది అంతా చెబుతాడు మనోజ్.
ఇప్పుడు నేను ఎవరిని నమ్మట్లేదు అని మనోజ్ అంటే.. నన్ను కూడా నమ్మట్లేదా అని రోహిణి అంటుంది. అది ఇప్పుడు నేను కచ్చితంగా చెప్పలేను అని నమ్మన్నట్లుగా చెబుతాడు మనోజ్. ప్రభావతిని పిలిచి రోజుకో రంగు వేసుకుంటానని ఆ షర్ట్స్ చూపిస్తాడు మనోజ్. అంతా ఆధ్యాత్మికంగా మనోజ్ మాట్లాడుతాడు. నేను నా బిజినెస్ బాగుండాలంటే కచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాల్సిందే అని మనోజ్ అంటాడు.
మౌనిక గురించి అబద్ధం
తన బట్టలు మీనా కాకుండా నువ్వు మాత్రమే వాష్ చేయాలని రోహిణికి చెబుతాడు మనోజ్. మరోవైపు రాత్రి మౌనిక గురించి బాలు ఆలోచిస్తాడు. మౌనిక తనకు పొద్దున కాల్ చేసి కార్తీక పౌర్ణమి రోజు జరిగిన గొడవ ఇంకా మర్చిపోలేదని, అందుకే మాట్లాడలేదని, వాళ్లంతా కలిసి ఇప్పుడు తిరుపతికి వెళ్లారట అని మీనా అబద్ధంతో సర్ది చెబుతుంది. ఇంటికి కామాక్షి వస్తుంది.
{{/usCountry}}తన బట్టలు మీనా కాకుండా నువ్వు మాత్రమే వాష్ చేయాలని రోహిణికి చెబుతాడు మనోజ్. మరోవైపు రాత్రి మౌనిక గురించి బాలు ఆలోచిస్తాడు. మౌనిక తనకు పొద్దున కాల్ చేసి కార్తీక పౌర్ణమి రోజు జరిగిన గొడవ ఇంకా మర్చిపోలేదని, అందుకే మాట్లాడలేదని, వాళ్లంతా కలిసి ఇప్పుడు తిరుపతికి వెళ్లారట అని మీనా అబద్ధంతో సర్ది చెబుతుంది. ఇంటికి కామాక్షి వస్తుంది.
{{/usCountry}}సత్యమే వెంటపడి మాట్లాడని ప్రభావతి గొప్పగా చెప్పిందని కామాక్షి చెబితే జరిగింది చెబుతాడు బాలు. ఇంతలో రవి వచ్చి అందరిని పిలుస్తాడు. అంతా వస్తారు. తమ రెస్టారెంట్ వాళ్లు బెస్ట్ కపుల్ పోటీ పెడుతున్నట్లు, మనకోసం నాలుగు ఫామ్స్ తీసుకొచ్చాం అని రవి చెబుతాడు. వెళ్తే మనోజ్, రోహిణి వెళ్తారు. వాళ్లే ఆదర్శ దంపతులు అంటుంది ప్రభావతి.
ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను వెళ్తే నా స్టేటస్ ఏమైపోతుంది అని మనోజ్ అంటాడు. అయ్యో అంతా వస్తారనుకున్నానే. ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని శ్రుతి చెబుతుంది. అమ్మో లక్ష అని మనోజ్ అంటాడు. ఎలాంటి పోటీలు పెడతారో అని బాలు అంటాడు. లక్ష అని ప్రభావతి మురిసిపోతుంది. తర్వాత రోహిణితో కాంపిటీషన్‌లో పాల్గొందాం అని మనోజ్ అంటాడు.
బాలు, మనోజ్ ఛాలెంజ్
కచ్చితంగా మనమే గెలుస్తాం. నాలుగు డిగ్రీలు చేశాను. ఇదంతా నాకు నథింగ్ అని మనోజ్ అంటాడు. ఎందుకో మనం కొంచెం అత్యాశ పడుతున్నామనిపిస్తుందని రోహిణి అంటుంది. ఎక్కువగా ఆలోచించకు. మనమే గెలుస్తామని మనోజ్ అంటాడు.
కట్ చేస్తే ఎవరికి తెలియకుండా సత్యం ఫ్యామిలీ అంతా ఆదర్శ దంపతుల పోటీకి వెళ్తారు. ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని మనోజ్, బాలు ఛాలెంజ్ చేసుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.