గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 584వ ఎపిసోడ్ కూడా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ చుట్టూ తిరిగింది. మరో మూడు రౌండ్లు నిర్వహించిన తర్వాత మీనా, బాలును బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తారు. దీంతో మనోజ్, రోహిణితోపాటు ప్రభావతి కూడా షాక్ తింటారు.
ప్రభావతిని ఏడిపించిన బాలు, కామాక్షి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ ప్రభావతి నడుము విరిగే సీన్ తో మొదలవుతుంది. అయితే స్టేజ్ పైనే రోహిణి, శృతిలతో కలిసి మీనా సెట్ చేస్తుంది. అయితే అక్కడితో ప్రభావతి పోటీ ముగుస్తుంది. దీంతో బాలు, కామాక్షి ఆమెను ఏడిపిస్తారు.
తాను గెలవకపోయినా నువ్వు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని కామాక్షి అంటుంది. ఇక వెళ్దాం.. ముందు కిలోల లెక్కన చీరలు అమ్ముతున్నారంటా అంటూ ప్రభావతితో కామాక్షి చెబుతుంది. మీరే గెలిచి రావాలని, తాను ఇంటి దగ్గర హారతి పట్టుకొని ఉంటానని మనోజ్, రోహిణిలకు ప్రభావతి చెప్పగా.. మీరే గెలవాలంటూ బాలు, మీనాలకు సత్యం చెబుతాడు. తర్వాత ఆ రెండు జంటలు వెళ్లిపోతాయి.
స్టేజ్‌పైన జంటలు.. జీతాల గురించి ప్రశ్నలు
ఇక చివరిగా ఈ పోటీలో మూడు జంటలు మిగులుతాయి. మనోజ్, రోహిణి.. రవి, శృతి.. బాలు, మీనాలను స్టేజ్ మీదికి పిలుస్తారు. వాళ్లను భార్యాభర్తల జీతాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ముందుగా రవి, శృతిని అడిగితే రవి జీతం తనకు తెలియదని, తన దాంట్లో పావు వంతు కూడా ఉండదని శృతి అంటుంది.
అటు మనోజ్ ను ఇదే ప్రశ్న అడిగితే తన సంపాదన గురించి మీకెందుకు చెబుతానంటూ అడ్డదిడ్డంగా వాదిస్తాడు. ప్రశ్న మార్చుకోమంటాడు. దీంతో రోహిణి సర్ది చెబుతుంది. చివరిగా బాలు, మీనాలను ఇదే ప్రశ్న అడిగితే.. వాళ్లు ఒకరి సంపాదన గురించి మరొకరు ఎంతో అర్థవంతంగా వివరణ ఇస్తారు. అది జడ్జీలకు బాగా నచ్చుతుంది.
రోహిణి కంటతడి.. స్టేజ్‌పై రవి, శృతి గొడవ
{{/usCountry}}అటు మనోజ్ ను ఇదే ప్రశ్న అడిగితే తన సంపాదన గురించి మీకెందుకు చెబుతానంటూ అడ్డదిడ్డంగా వాదిస్తాడు. ప్రశ్న మార్చుకోమంటాడు. దీంతో రోహిణి సర్ది చెబుతుంది. చివరిగా బాలు, మీనాలను ఇదే ప్రశ్న అడిగితే.. వాళ్లు ఒకరి సంపాదన గురించి మరొకరు ఎంతో అర్థవంతంగా వివరణ ఇస్తారు. అది జడ్జీలకు బాగా నచ్చుతుంది.
రోహిణి కంటతడి.. స్టేజ్‌పై రవి, శృతి గొడవ
{{/usCountry}}ఆ తర్వాత భార్యాభర్తలను స్టేజ్ మీదికి పిలిచి ఒకరి గురించి ఒకరు కళ్లలోకి చూసుకుంటూ మాట్లాడుకోవాలని చెబుతారు. మొదట రోహిణి, మనోజ్ లను పిలుస్తారు. మనోజ్ తనపై చూపిస్తున్న నమ్మకానికి ఎమోషనల్ అయిన రోహిణి కంటతడి పెడుతుంది. మనోజ్ ఆమెను ఓదారుస్తాడు.
తర్వాత రవి, శృతి వస్తారు. శృతి గురించి రవి మంచిగా చెబుతాడు. అయితే తనకు నలుగురు సంతానం కావాలని అనడంతో శృతి ఆవేశంగా అతన్ని తిడుతుంది. నన్ను అడగకుండా నలుగురు సంతానం కావాలని నువ్వే ఎలా డిసైడ్ చేస్తావంటుంది. ఇద్దరూ మాటామాటా అనుకొని వెళ్లిపోతారు.
బాలు, మీనా ఒకే సమాధానాలు
చివరిగా బాలు, మీనాలను పిలుస్తారు. వాళ్లు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. ఏమీ మాట్లాడుకోరు. తాము ఇలాగే మాట్లాడుకుంటామని అంటారు. తమకు అర్థం కావాలంటే ఇలా కుదరదు అంటూ నిర్వాహకులు వాళ్లకు ఒకే ప్రశ్నలు అడిగి, వాళ్ల సమాధానాలను బోర్డుపై రాయిస్తారు. ఇద్దరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఇద్దరూ ఒకే రకమైన సమాధానాలు రాస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
డ్రీమ్ హౌస్ కట్టిన జంటలు
బెస్ట్ కపుల్ పోటీలో చివరి రౌండ్ గా డ్రీమ్ హౌస్ కట్టాలని చెబుతారు. వాళ్లకు ఇచ్చిన బ్లాక్స్ తో భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఇల్లు కట్టుకోవాలని అంటారు. ఇందులోనూ బాలు, మీనా అందరి కంటే ముందుగా ఓ అందమైన ఇంటికి కడతారు. గొప్పలకు పోయి మనోజ్ చతికిలపడతాడు.
ఇక అన్ని రౌండ్లలోనూ జడ్జీలను మెప్పించిన బాలు, మీనా విజేతలుగా నిలుస్తారు. వాళ్లకు రూ.లక్ష ప్రైజ్ మనీ దక్కుతుంది. దీంతో ఇద్దరూ డప్పులు, మేళ తాళాలతో ఇంటికి ఊరేగింపుగా వెళ్తారు. అది చూసి ప్రభావతి షాక్ తింటుంది. ఇంట్లో మరో రచ్చ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.