గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 566వ ఎపిసోడ్ లో మొత్తానికి మీనా నగలను తానే అమ్మేశానని మనోజ్ ఒప్పుకుంటాడు. దీనికి తల్లే సాయం చేసిందని చెప్పడంతో అందరూ కలిసి ఇద్దరినీ తిడతారు. దీంతో ప్రభావతి రెచ్చిపోతుంది. మీనా ముఖంపై బంగారం విసిరికొట్టడంతో ఇంట్లో పెద్ద రచ్చ మొదలవుతుంది.
రెండో నిమ్మకాయ తానే పెట్టానన్న ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 2) ఎపిసోడ్ ఇంట్లో రెండో నిమ్మకాయ ఎలా వచ్చిందని బాలు ఆరా తీయడంతో మొదలవుతుంది. తాను తెచ్చిన నిమ్మకాయ పిల్లను కనిందా అంటాడు. దీంతో ప్రభావతి తానే ఆ నిమ్మకాయ తెచ్చానని అంటుంది. ఇంతకుముందు గుడికి వెళ్తే అక్కడ పంతులు ఇచ్చారని చెబుతుంది. అయినా బాలు మాత్రం ప్రభావతి, మనోజ్ తో ఆడుకుంటాడు.
మనోజ్‌తో బాలు బీపీఎల్
ఇటు మీనాతో బాలు ఇదే విషయం చెబుతాడు. ఆ నిమ్మకాయను ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్లి తీసుకొచ్చారని అంటాడు. ఇక నుంచి తాను మనోజ్ తో బీపీఎల్ ఆడుకుంటానని చెబుతాడు. అంటే ఏంటని మీనా అడిగితే.. బాలు ప్రీమియర్ లీగ్ అని అంటాడు. రాత్రి మనోజ్ పడుకున్న తర్వాత కావాలని డోర్ కొడతాడు.
ఆ తర్వాత డోరు తెరిచి పడుకున్న మనోజ్ పైకి నిమ్మకాయ విసిరి వెళ్తాడు. దానికి దారం కట్టి అటూఇటూ ఆడించడంతో మనోజ్ భయంతో వణికిపోతాడు. వెంటనే తల్లికి ఫోన్ చేస్తాడు. ఆమె కూడా భయంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.
మనోజ్, ప్రభావతిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న బాలు
తల్లీకొడుకులు ఇద్దరూ హాల్లో ఆ నిమ్మకాయను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే వాటిని తీసేసి బయటపారేద్దామని మనోజ్ అంటాడు. సరే అని ప్రభావతి ఆ నిమ్మకాయలను తీస్తుంది. ఇద్దరూ రహస్యంగా బయటకు వెళ్తుండగా.. లైట్లు వేసి రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకుంటాడు బాలు. అందరూ వాళ్లను చూస్తారు. దీంతో సత్యం ఆమెను నిలదీస్తాడు. చేతిలో నిమ్మకాయలను చూసి.. చూశారా నాన్న నగల దొంగలు ఎలా దొరికిపోయారో అని బాలు అంటాడు. అయినా ప్రభావతి మాత్రం బుకాయిస్తుంది.
తానే నగలు అమ్మేశానన్న మనోజ్
{{/usCountry}}తల్లీకొడుకులు ఇద్దరూ హాల్లో ఆ నిమ్మకాయను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే వాటిని తీసేసి బయటపారేద్దామని మనోజ్ అంటాడు. సరే అని ప్రభావతి ఆ నిమ్మకాయలను తీస్తుంది. ఇద్దరూ రహస్యంగా బయటకు వెళ్తుండగా.. లైట్లు వేసి రెడ్ హ్యాండెడ్ గా వాళ్లను పట్టుకుంటాడు బాలు. అందరూ వాళ్లను చూస్తారు. దీంతో సత్యం ఆమెను నిలదీస్తాడు. చేతిలో నిమ్మకాయలను చూసి.. చూశారా నాన్న నగల దొంగలు ఎలా దొరికిపోయారో అని బాలు అంటాడు. అయినా ప్రభావతి మాత్రం బుకాయిస్తుంది.
తానే నగలు అమ్మేశానన్న మనోజ్
{{/usCountry}}మీనా కూడా మనోజ్ ను నిలదీస్తుంది. నగలు మింగినోడా అంటూ రవి, శృతి కూడా మనోజ్ ను తిడతారు. తన భర్తను అందరూ తిడుతుండటంతో రోహిణి జోక్యం చేసుకుంటుంది. తాను నగలు అమ్మలేదని, పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని మనోజ్ అనడంతో తాను అడిగానని, అతడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాలు అంటాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పించమని అనడంతో మనోజ్ కంగారు పడతాడు.
దీంతో మీనా కూడా అతన్ని, రోహిణిని తిడుతుంది. అది చూసి ప్రభావతి ఆమెను కొట్టబోగా.. సత్యం అడ్డుకొని ఆమెను నెట్టేస్తాడు. మనోజ్ ను లాగి కొట్టబోగా.. తానే నగలు అమ్మానని, అమ్మే వాటిని ఇచ్చిందని నిజం చెప్పేస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు.
మీనాను క్షమాపణ అడగాలన్న సత్యం
నగలు దొంగతనం చేసిన విషయం తెలియడంతో మనోజ్, ప్రభావతిలపై సత్యం తీవ్రంగా మండిపడతాడు. దీంతో కామాక్షి రంగంలోకి దిగి ఆమెను క్షమించాలని అడుగుతుంది. అలా అయితే మీనాను ప్రభావతి క్షమాపణ అడగాలని సత్యం అంటాడు. ఈ పూలు అమ్ముకునే దాన్ని నేను క్షమాపణ అడగను అని ప్రభావతి అంటుంది.
అంతేకాదు ఈ బంగారం కోసమే కదా ఇదంతా చేస్తున్నావ్.. నా బంగారం తీసుకో అంటూ చేతులకు ఉన్న గాజులు తీసి మీనా ముఖాన కొడుతుంది. దీంతో బాలు రెచ్చిపోతాడు. నా భార్య మీదే బంగారం కొడతావా.. తల్లివి అని కూడా చూడను అంటూ వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.