...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ముదిరిన బాలు, మీనా గొడవ.. మంట పెట్టిన ప్రభావతి.. మళ్లీ బకరా అయిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ లో బాలు, మీనా మధ్య గొడవ ముదురుతుంది. రాజేష్ విషయంలో వీళ్లు గొడవ పడతారు. అటు మరోసారి మనోజ్‌ను బకరాను చేసిన లక్ష కొట్టేస్తుంది రోహిణి. తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Feb 10, 2026, 07:57:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 616వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజేష్ కు సాయం విషయంలో బాలు, మీనా మధ్య గొడవ మరింత ముదురుతుంది. దానికి ప్రభావతి మరింత ఆజ్యం పోస్తుంది. అటు తన రూమ్ కోసం మనోజ్ ను మరోసారి మోసం చేసి రూ.లక్ష కొట్టేస్తుంది రోహిణి.

రాజేష్‌కు ఏదో రకంగా సాయం చేస్తానన్న బాలు

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ముదిరిన బాలు, మీనా గొడవ.. మంట పెట్టిన ప్రభావతి.. మళ్లీ బకరా అయిన మనోజ్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ముదిరిన బాలు, మీనా గొడవ.. మంట పెట్టిన ప్రభావతి.. మళ్లీ బకరా అయిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 10) ఎపిసోడ్ రాజేష్ కు సాయం చేయలేకపోతున్నానని ఫ్రెండ్స్ దగ్గర బాలు ఫీలయ్యే సీన్ తో మొదలవుతుంది. నువ్వు డబ్బు ఇస్తావన్న ఆశతో వాడున్నాడని, అలా చెప్పకపోయినా బాగుండేదని వాళ్లు అంటారు. అందులో నీ ఒక్కడి డబ్బే లేదు కదా.. పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ కు సాయం చేయడం కుదరదని చెబుతారు. అలా చేయాలని ప్రయత్నిస్తేనే మీనాతో గొడవ జరిగిందని బాలు చెబుతాడు. అయితే ఎలాగైనా రాజేష్ కు సాయం చేస్తానని అతడు అంటాడు.

రోహిణిని నిలదీసిన మనోజ్.. ఇద్దరి మధ్య గొడవ

ఇటు రోహిణికి విద్య ఫోన్ చేస్తుంది. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వాల్సిందేనని, లేదంటే చేజారిపోతుందని అంటుంది. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం కదా అని రోహిణి అంటుంది. ఈ క్రమంలోనే రోహిణి నోటి వెంట దుబాయ్ దుకాణం అనే పదం వస్తుంది. అది విని మనోజ్ ఆమెను నిలదీస్తాడు.

దీంతో ఆమె వెంటనే తన ఫ్రెండ్ వాళ్ల ఆయన దుబాయ్ లో షాప్ పెట్టాడని, కాస్త డబ్బు సాయం చేయాలని అంటుంది. కానీ మనోజ్ మాత్రం ఇవ్వనంటాడు. కల్పన ఇచ్చిన డబ్బు ఉంది కదా.. నువ్వు మాత్రం ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చి మోసపోతావా అంటూ మనోజ్ పై మండిపడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

డబ్బు కోసం బాలు, రోహిణి ప్రయత్నాలు

అటు రవి, ఇటు శృతి వాళ్లకు సలహా ఇస్తారు. వడ్డీకి డబ్బు ఇస్తే వాళ్లకు బాధ్యత తెలుస్తుందని వాళ్లు చెబుతారు. దీంతో మనోజ్ మళ్లీ ఆలోచనలో పడతాడు. కానీ బాలు మాత్రం ఫ్రెండ్ కు వడ్డీకి డబ్బివ్వడం సరి కాదని వాదిస్తాడు. ఇటు రోహిణి కూడా మనోజ్‌ను వడ్డీకి డబ్బు అడగాలని అనుకుంటుంది.

వడ్డీకి రోహిణికి డబ్బు ఇచ్చిన మనోజ్

తర్వాత రోహిణి, మనోజ్ మళ్లీ రూమ్ లోకి వెళ్తారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో గొడవ సద్దుమణుగుతుంది. పదే పదే కల్పన పేరు మధ్యలో తీసుకురావద్దని మనోజ్ అంటాడు. చివరికి రూ.3 వడ్డీకి డబ్బు ఇస్తానని చెబుతాడు. అలా అయితే ఎవరైనా భయపడి అసలు కూడా త్వరగా ఇస్తారని అంటాడు. రోహిణి దానికి సరే అంటుంది. మనోజ్ ను మళ్లీ బురిడీ కొట్టించి తనకు అవసరమైన రూ.లక్ష తీసుకుంటుంది.

రాజేష్‌కు మీనా సలహా

ఇటు రాజేష్ దగ్గరికి వెళ్తుంది మీనా. మీకు డబ్బు ఇవ్వాలన్న విషయంలోనే తనకు, బాలుకి మధ్య గొడవ జరిగిందని చెబుతుంది. తల్లిదండ్రులకు షష్టిపూర్తి చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. దాని కోసం అనవసర ఆడంబరాలకు వెళ్లడం సరి కాదని అంటుంది. మనం ఎంత కష్టపడితే రూ.లక్ష సంపాదిస్తాం.. అలాంటప్పుడు ఒక్క రోజులో దానిని ఖర్చు చేస్తే మళ్లీ సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుందని క్లాస్ పీకుతుంది. మీనా చెప్పినదాంట్లోనూ నిజం ఉందని రాజేష్ గ్రహిస్తాడు.

ఆ తర్వాత బాలు ఎలాగోలా రూ.లక్ష సర్ది రాజేష్ కు ఇవ్వడానికి వెళ్తాడు. కానీ జరిగిన విషయం చెప్పి మీనా తీసుకోవద్దని చెప్పింది రా అని అంటాడు. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇంటికి వెళ్లి మీనాతో గొడవ పడతాడు. అది విని ప్రభావతి దానికి మరింత ఆజ్యం పోస్తుంది. దీంతో ఇద్దరి మధ్యా మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ మొదలవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks