గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో బాలు అన్నయ్య పుణ్యం చేశాడు కాబట్టి ముందుగా బాలు అన్నకే ముందు పుడతాడు అని రవి అంటాడు. కాదు మనోజ్‌కే పుడతాడు అని ప్రభావతి అంటుంది. మాకు నడిచి వచ్చే బిడ్డ పుడతాడని పంతులు చెప్పాడని మనోజ్ అంటాడు.
ముందు ఇల్లు కట్టుకోవాలి

రోహిణి నడిపించుకుంటూ వస్తుందేమో అని మీనా అంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతాడు. మాకు ఇప్పుడే పిల్లలు పుట్టాలని లేదు, ముందు ఇల్లు కట్టుకోవాలని బాలు అంటాడు. తర్వాత దేవుడికి దండం పెట్టుకున్న మీనా రోహిణి గురించి తెలిసిన నిజం గురించి ఎలా తెలుసుకోవాలనో మొక్కుకుంటుంది.
ఇంతలో బాలు వచ్చి తన వైరల్ అయిన వీడియో చూపిస్తాడు. మీనా పరధ్యానంగా ఉండటంతో ఏం జరిగింది, సంతోషంగా ఎందుకు లేవని నిలదీస్తాడు బాలు. మీకు మంచి పేరు వస్తే ఎక్కువగా సంతోషించేది నేనే కదా అన్న మీనా వంట గదిలో పని ఉందని వెళ్లిపోతుంది.
తర్వాత సీరియల్ స్టోరీ గురించి ఫోన్‌లో శ్రుతి మాట్లాడతుంది. ఒక పాత్ర బిడ్డ పుట్టిన చెప్పకుండా పెళ్లి చేసుకుందా అని ఆశ్చర్యపోతుంది. ఆ మాటలు విని మీనా షాక్ అయి పాల గిన్నె కింద పడేస్తుంది. దాంతో శ్రుతి వెళ్లి మాట్లాడుతుంది. సీరియల్ పాత్ర గురించి శ్రుతి చెబుతుంది. దాంతో అయోమయంగా మాట్లాడుతుంది మీనా.
శ్రుతికి ముందు చెప్పిన మీనా
ఎందుకు నీ చేయి వణుకుతుంది, ఏదో దాస్తున్నావ్, నాకు చెప్పు తగ్గుతుంది అని శ్రుతి అంటుంది. సరే ఎవరికి చెప్పకు అని రోహిణి రెండో బిడ్డను కనాలనుకుంటుంది అనే నిజాన్ని చెబుతుంది మీనా. దాంతో శ్రుతి షాక్ అయిపోతుంది. శ్రుతి చేతులు వణుకుతాయి. ఇద్దరు చేతులు పట్టుకుంటారు. మనోజ్‌ను మోసం చేస్తుందా, ఇంట్లో వాళ్లను ఎర్రివాళ్లను చేస్తుందా అని మాట్లాడుకుంటారు.
ఈ విషయం వాళ్లకు తెలిస్తే, పదా రోహిణిని అడుగుదాం అని శ్రుతి అంటే.. వద్దు. రోహిణి అబద్ధాలు చాలా అందంగా చెబుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద నింద వేశానని అత్తయ్యతో తిట్టిస్తుంది. ఎవరికి చెప్పకు అని మీనా అంటుంది. కట్ చేస్తే రోహిణి విషయం రవికి చెబుతుంది శ్రుతి. ఎవరు చెప్పారని రవి అంటే.. మీనా చెప్పిందని శ్రుతి అంటుంది.
{{/usCountry}}ఈ విషయం వాళ్లకు తెలిస్తే, పదా రోహిణిని అడుగుదాం అని శ్రుతి అంటే.. వద్దు. రోహిణి అబద్ధాలు చాలా అందంగా చెబుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద నింద వేశానని అత్తయ్యతో తిట్టిస్తుంది. ఎవరికి చెప్పకు అని మీనా అంటుంది. కట్ చేస్తే రోహిణి విషయం రవికి చెబుతుంది శ్రుతి. ఎవరు చెప్పారని రవి అంటే.. మీనా చెప్పిందని శ్రుతి అంటుంది.
{{/usCountry}}అయితే, నిజం అయింటుంది. అయినా మనోజ్ అన్నయ్య ఏం చెప్పలేదేంటీ అని రవి అంటాడు. అసలు కన్సీవ్ అయింది పెళ్లి తర్వాత ముందా. పెళ్లికి ముందు రోహిణికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా అని శ్రుతి అంటే.. అలాంటిది ఏం జరిగి ఉండదు అని రవి అంటాడు. నీకు చెప్పాక రిలాక్స్‌గా ఉందని శ్రుతి అంటుంది. నా తల బద్ధలైపోతుందే అని బాలుకు వెళ్లి చెబుతాడు రవి.
మలేషియాలో బిడ్డ పెరుగుతుందా
నిజంగా నిజమా ఇది అని బాలు తెగ షాక్ అయిపోతాడు. మలేషియాలో బిడ్డ పెరుగుతుందా అంటూ రోహిణి బిడ్డ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు ఇంట్లో ఇంత పెద్ద మోసం జరిగితే నాన్న ఏమైపోతాడు, పరువు సంగతి ఏంటని బాలు కంగారు పడతాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఒట్టే అని రవి వెళ్లిపోతాడు. ఈ గర్భాన్ని నా కడుపులో ఎలా దాచాలి అని బాలు అనుకుంటాడు.
కట్ చేస్తే సత్యంకు రోహిణికి బిడ్డ ఉండటం గురించి బాలు చెబుతాడు. దాంతో సత్యం అవాక్కవుతాడు. రోహిణి చాలా పెద్ద ఫ్రాడ్ నాన్న, ఏదో దాస్తుందని, కచ్చితంగా పెద్ద తప్పు ఉంటుందని, పార్లరమ్మా ఫ్రెండ్‌ని అడుగుదామని, తనకు తెలిసి ఉంటుందని బాలు అంటాడు. మనింటి అమ్మాయి గురించి ఇంకొకరిని అడగడం బాగుండదని సత్యం అంటాడు.
తర్వాత ప్రభావతికి వెళ్లి సత్యం చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. బాలుకు మనోజ్, రోహిణి అంటే పడదు అని ప్రభావతి అంటుంది. ఇందులో ఎంతో కొంత నిజముందని సత్యం అంటాడు. తర్వాత రోహిణిని హాల్లోకి పిలిచి పెళ్లికి ముందే తల్లివి అయ్యావా, ఆ పాపాన్ని దాచి నా ఇంట్లోకి అడుగుపెట్టావా అని ప్రభావతి నిలదీస్తుంది.
చింటునే నా కొడుకు
నువ్వు ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు కదా అని మనోజ్ అంటే.. అయ్యాను అని అరిచి నిజం ఒప్పుకుంటుంది రోహిణి. చింటునే తన కన్నకొడుకు అని, దుబాయ్‌లో ఉంటున్న మేనత్త తానేనని రోహిణి బయటపెడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.