Sign in

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో ప్రెగ్నెన్సీ విషయం బాలుకి చెప్పిన మీనా.. మనోజ్‌లోనూ అనుమానం

గుండె నిండా గుడి గంటలు సోమవారం (జనవరి 19) ఎపిసోడ్ లో బాలు, మీనా మళ్లీ ఒక్కటవ్వడానికి రెడీ అయిపోగా.. అటు రోహిణి రెండో ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకొని వాళ్లు షాక్ తింటారు. ఇటు మనోజ్ లోనూ కాస్త సందేహం మొదలవుతుంది.

Published on: Jan 19, 2026, 07:44:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 600వ ఎపిసోడ్ లో బాలు, మీనా తమ స్నేహితుల మాటలతో ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే ఎపిసోడ్ చివర్లో రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కు వచ్చి మరోసారి మీనాకు దొరికిపోతుంది రోహిణి. ఆమె పదేపదే ఎందుకు వస్తుందో తెలుసుకొని బాలుకి చెబుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో ప్రెగ్నెన్సీ విషయం బాలుకి చెప్పిన మీనా.. మనోజ్‌లోనూ అనుమానం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో ప్రెగ్నెన్సీ విషయం బాలుకి చెప్పిన మీనా.. మనోజ్‌లోనూ అనుమానం

మీనాకు పార్వతి ఫోన్

గుండె నిండా గుడి గంటలు సోమవారం (జనవరి 19) ఎపిసోడ్ మీనాకు ఆమె స్నేహితులు బాలుని మళ్లీ ఎలా దారికి తెచ్చుకోవాలో చెప్పే సీన్ తో మొదలవుతుంది. అప్పుడే తల్లి పార్వతి కూడా ఫోన్ చేసి తాను అల్లుడిని కలిశానని, శివ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నాడని చెబుతుంది.

ఆ తర్వాత భర్తను దారికి తెచ్చుకోవాలంటే మంచం, కంచెం రెండే దార్లని స్నేహితులు చెబుతారు. తన ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పడంతో అయితే కంచెం దారిలో వెళ్లాలని, బాలుకి ఇష్టమైన చికెన్ చేయాలని చెబుతారు. ఆమె సరే అంటుంది.

బాలు కళ్లు తెరిపించిన మహిళ

ఇటు ట్రిప్ కోసం వెళ్లిన బాలుకి ఓ మహిళ కళ్లు తెరిపిస్తుంది. తన కారులో ఎక్కినప్పటి నుంచీ ఆమె ఏడుస్తూనే ఉంటడంతో ఏం జరిగిందని అడుగుతాడు. తన అన్న హాస్పిటల్లో ఉన్నాడని, అయితే గతంలో తన భర్తతో గొడవ పడటంతో అతన్ని చూడటానికి కూడా వెళ్లకూడదని ఆయన ఆర్డర్ వేశారని, అందుకే తెలియకుండా వెళ్తున్నానని అంటుంది. పెళ్లియినంత మాత్రాన పుట్టింటికి పూర్తిగా దూరం కావాలా అని ఆమె అడగడంతో బాలు కూడా మీనా విషయంలో ఆలోచనలో పడతాడు. ఒకరకంగా తన కళ్లు తెరుచుకుంటాయి.

చింటు కోసం స్కూల్ చూసిన రోహిణి

ఇటు షాపులో ఉన్న రోహిణి దగ్గరికి తాము కొత్తగా స్కూల్ పెట్టామని ఇద్దరు మహిళలు వస్తారు. వాళ్లను స్కూలు గురించి ఆరా తీస్తుంది. పూర్తి వివరాలు తీసుకుంటుంది. ఎవరిని జాయిన్ చేస్తారని అడిగితే మా అబ్బాయినే అని రోహిణి అంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన మనోజ్ మీ అబ్బాయి ఏంటని అడుగుతూ రోహిణిపై సందేహపడతాడు. కంగారు పడిన రోహిణి.. మా పార్లర్ లో పని చేస్తున్న అమ్మాయి వాళ్ల అబ్బాయి అని కవర్ చేస్తుంది. అలాగా అని అతడు అంటాడు.

బాలుకి రాజేష్ సలహా

ఇటు ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి వెళ్తాడు బాలు. తన కారులో ఎక్కిన మహిళ తనతో చెప్పుకున్న బాధల గురించి రాజేష్ కు చెబుతాడు. పుట్టింటికి దూరం కావాలా అని ఆమె అన్న మాట తనకు గట్టిగా తగిలిందని అంటాడు. దీంతో రాజేష్ కూడా బాలుకి సర్ది చెబుతాడు. మీనా విషయంలోనూ ఇలాగే ఆలోచించాలని, తమ్ముడు ఏవో రెండు తప్పులు చేశాడని పూర్తిగా దూరం పెట్టదు కదా అని చెబుతాడు.

అంతేకాదు మనోజ్ విషయం గురించి కూడా చెప్పి.. అతనితో మాట్లాడొద్దని ఎప్పుడైనా చెప్పిందా.. మీ అమ్మ గురించి చాడీలు చెప్పిందా.. ఒకవేళ మౌనికను నీతో మాట్లాడొద్దని సంజూ అంటే నువ్వు ఊరుకుంటావా.. అంటూ నిలదీస్తాడు. దీంతో తప్పు తెలుసుకున్న బాలు.. వెంటనే మీనాతో మాట్లాడతానని వెళ్తాడు.

బాలు కోసం మీనా చికెన్..

ఇటు ఇంట్లో బాలు కోసం మీనా చికెన్ వండుతుంది. ఆ గుమగుమలకు శృతి, మనోజ్, రవి కూడా టెంప్ట్ అయిపోతారు. అదే సమయంలో ప్రభావతి మాత్రం తనదైన స్టైల్లో మీనాను దెప్పి పొడిస్తే.. అత్తతో ఆడుకుంటుంది శృతి. దీంతో ఈ పిల్ల రోజురోజుకీ మరీ ఎక్కువవుతోంది.. తనకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదని బాధపడుతుంది. ఆ విషయంలోనూ మీనాను నిందిస్తుంది. ఇటు అందరూ మీనా వండిన చికెన్ ను ఇష్టంగా తింటారు.

అటు మరోసారి రోహిణిని హాస్పిటల్లో మీనా, సుమతి చూస్తారు. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తుందో అని సందేహిస్తారు. సుమతి వెళ్లి రిసెప్షన్ లో రోహిణి గురించి ఆరా తీస్తుంది. ఆమె రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందని తెలుస్తుంది. అదే విషయం మీనాతో చెబితే.. అంటే ఇప్పటికే రోహిణికి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని అర్థమవుతుంది. అవే విషయం బాలుకి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More