...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: దెయ్యంలా మారిన ప్రభావతి.. శృతిని అడ్డం పెట్టుకొని ఇంట్లో గొడవకు శోభ ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ లో ప్రభావతితో శృతి ఆడుకుంటుంది. దీంతో ఆమె ప్రవర్తన మితిమీరిపోయిందంటూ ఆమె తల్లికి ప్రభావతి ఫిర్యాదు చేస్తుంది. ఇదే అదునుగా మరో గొడవ పెట్టడానికి ఆమె రెడీ అవుతుంది.

Published on: Jan 27, 2026, 07:53:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 606వ ఎపిసోడ్ లో అత్త ప్రభావతితో ఓ ఆట ఆడుకుంటుంది శృతి. దీంతో ఆమె ప్రవర్తనకు విసిగి వేసారిపోయిన ప్రభావతి.. ఆమె తల్లి శోభకు చెబుతుంది. మీనాకు దూరంగా ఉండమంటుంది. ఇదే అదునుగా గొడవ పెద్దది చేయడానికి ఆమె ప్లాన్ చేస్తుంది.

సుమతి జీతం కట్

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: దెయ్యంలా మారిన ప్రభావతి.. శృతిని అడ్డం పెట్టుకొని ఇంట్లో గొడవకు శోభ ప్లాన్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: దెయ్యంలా మారిన ప్రభావతి.. శృతిని అడ్డం పెట్టుకొని ఇంట్లో గొడవకు శోభ ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ సుమతిని డాక్టర్ మందలించే సీన్ తో మొదలవుతుంది. ఉద్యోగం నుంచి తీసేశామని అంటుంది. దీంతో సుమతి ఆమెను వేడుకుంటుంది. అయితే ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈ నెల సగం జీతం మాత్రమే ఇస్తామని చెబుతుంది. నీ వల్ల మేము లక్షలు కోల్పోయాం.. నువ్వు వేలు కూడా నష్టపోకపోతే డబ్బు విలువ తెలియదంటుంది. జాబ్ కాపాడుకోవడం కోసం సుమతి సరే అంటుంది.

పూల ఆర్డర్ మిస్ చేసుకున్న మీనా

ఇటు పెళ్లికి పెద్ద పూల ఆర్డర్ వచ్చిందని మీనా దగ్గరికి బస్తీ వాళ్లు వస్తారు. కానీ మా ఆయన వస్తే ఇంట్లో ఆయనను ఎవరూ పట్టించుకోరు రాలేనని చెప్పి వాళ్లను పంపిస్తుంది. ఇంతలో బాలు ఫోన్ చేసి తనకు ట్రిప్ వచ్చిందని, రాత్రికి రాలేనని అంటాడు. సరే అని బస్తీ వాళ్లకు ఫోన్ చేసి వస్తానని మీనా చెబుతుంది. కానీ అప్పటికే మరొకరిని మాట్లాడినట్లు చెప్పడంతో మీనా పెద్ద ఆర్డర్ ను కోల్పోయినట్లు అవుతుంది.

రవికి శృతి వార్నింగ్.. మీనాకు ఫోన్

ఇంటికి వచ్చిన తర్వాత బాలు కూడా రావడం లేదని శృతి తెలుసుకుంటుంది. దీంతో లేడీస్ నైట్ ప్లాన్ చేద్దామని మీనాతో అంటుంది. ఇద్దరం కలిసి దెయ్యాల సినిమా చూద్దామని చెబుతుంది. దెయ్యాలంటే భయమని మీనా చెబుతున్నా.. ఇద్దరూ కలిసి లైట్లు ఆర్పేసి మూవీ చూస్తుంటారు.

ప్రతి సీన్ కూ మీనా భయంతో వణికిపోతుంది. గట్టిగా అరుస్తుంటుంది. ఆ అరుపులకు ప్రభావతి వచ్చి లైట్ వేయడంతో దెయ్యం అంటూ మీనా అరుస్తుంది. ఏం చేస్తున్నారని ప్రభావతి అడిగితే.. దెయ్యాల సినిమాలు చూస్తుంటే మీనా భయంతో అరుస్తోందని శృతి చెబుతుంది. తనకు దెయ్యాలంటే భయం లేదని, మరో ఊళ్లో జాతరకు తాను ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్లేదాన్నని ప్రభావతి గొప్పలకు పోతుంది.

ప్రభావతితో ఆడుకున్న శృతి

దీంతో అత్తతో ఆడుకోవాలని శృతి డిసైడవుతుంది. ప్రభావతి రూమ్ బయట నిల్చొని దెయ్యంలా అరుస్తుంది. ప్రభావతి అంటూ పేరు పెట్టి పిలుస్తుంది. దీంతో ఆమె వణికిపోతుంది. ఆ అరుపులకు ఇటు మనోజ్ కూడా లేస్తాడు. తల్లీకొడుకులు ఇద్దరూ కలిసి వణికిపోతూ హాల్లోకి వస్తారు. ఏం జరుగుతోందంటూ మనోజ్ భయపడుతూ అంటాడు. అక్కడ కూడా శృతి వాళ్లను ఇంకా భయపెడుతుంది.

ఇక చాలంటూ మీనా వచ్చి లైట్ వేస్తుంది. ఇదంతా నీ పనా అని ప్రభావతి అనగానే.. శృతి కూడా వచ్చి అత్తను వెక్కిరిస్తుంది. దీంతో ఆమెకు మరింత మండుతుంది. ఇటు కిచెన్ లో మీనా ఏదో అందుకోబోతుండగా.. పిండి, కారంపొడి జారి ప్రభావతి మీద పడటంతో ఆమె దెయ్యంలా మారిపోతుంది. ఆమెను చూసి శృతి మరింత ఆటపట్టిస్తుంది. ఇక ఉండబట్టలేక ఆమె తల్లి శోభను పిలిచి ప్రభావతి ఫిర్యాదు చేస్తుంది. మీనాకు దూరంగా ఉండమని చెప్పండంటుంది. ఇదే అదునుగా ఇంట్లో గొడవ పెద్దది చేయాలని శోభ అనుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks