గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనకు చెప్పి శ్రుతిని మందలిస్తే శ్రుతి మీనాకు దూరంగా ఉంటుందనుకుంటుంది ప్రభావతి. కానీ, శ్రుతిని ఏమనలేనని శోభన వెళ్లిపోతుంది. రోహిణికి కాల్ వస్తే వెళ్లి మాట్లాడుతుంది. కల్యాణినా మాట్లాడేది. ఇక్కడ ఒకావిడ పడిపోయింది. ఆమె పేరు సుగుణమ్మా అని చెబుతారు.
తప్పించుకున్న లవర్స్

దాంతో తల్లికి ప్రమాదం ఏర్పడిందని రోహిణి కంగారుగా వెళ్లిపోతుంది రోహిణి. తర్వాత డ్యాన్స్ చేర్చుకునే పిల్లలందరిని ప్రభావతి పిలుస్తుంది. ఇంకో ఇద్దరు ఎక్కడ. ప్రేమ్ కుమార్ ఎక్కడ అని ప్రభావతి అంటుంది. వాళ్లిద్దరు బ్యాగులు ఇక్కడే ఉన్నాయని పిల్లలు అంటారు. ప్రేమ్ కుమార్, రాధిక అని ఇద్దరిని పిలుస్తుంది ప్రభావతి. ఇద్దరు ఒకేసారి పై నుంచి రావడంతో ప్రభావతి షాక్ అవుతుంది.
పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని కవర్ చేస్తాడు ప్రేమ్ కుమార్. ప్రభావతి సరేనంటుంది. అలా లవర్స్ ఇద్దరు తప్పించుకుంటారు. శోభకు దారిలో మీనా కనిపించడంతో కారు ఆపి వెళ్లి పలకరిస్తుంది. మీరా బాగున్నారా అని మీనా అంటే.. ఆ ఇంట్లో నువ్వున్నంత సేపు ఎవరు బాగుంటారు అని శోభ అంటుంది. మీ బాగుకు నేనేం అడ్డొచ్చాను అని మీనా అంటుంది.
శ్రుతితో కలిసి ఇంట్లో గొడవలు పెడుతున్నావట. నీలాంటి వాళ్లతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. దాన్ని ఎందుకు చెడగొడుతున్నావ్ అని శోభ అంటుంది. శ్రుతి చాలా తెలివైనది. అలాంటి శ్రుతి మీలాంటి వాళ్ల కడుపులో ఎలా పుట్టిందా అని ఆశ్చర్యమేస్తుంది. శ్రుతికి నేను అక్కలా ఉంటున్నా అని మీనా అంటుంది.
చిల్లర గొడవలు పెట్టుకోను
ఏంటీ అక్కనా. పూలమ్ముకునేదానివి. మా స్టేటస్కు శ్రుతికి అక్కవా అని శోభ అంటుంది. పూలమ్ముకునేవాళ్లు అంటే అంత చులకనగా ఉందా. నేను నా పని చేసుకుంటూ వెళ్తాను. మీలా రోడ్డు మీద చిల్లర గొడవలు పెట్టుకోను అని మీనా అంటుంది. నువ్వు చస్తే చల్లేది పూలే నోట్ల కట్టలు కాదు. ఒక్క ఫోన్ చేస్తే మార్కెట్ అంతా ఇక్కడ ఉంటుంది అని మీనా పక్కన ఉన్న ఆవిడ అంటుంది.
{{/usCountry}}ఏంటీ అక్కనా. పూలమ్ముకునేదానివి. మా స్టేటస్కు శ్రుతికి అక్కవా అని శోభ అంటుంది. పూలమ్ముకునేవాళ్లు అంటే అంత చులకనగా ఉందా. నేను నా పని చేసుకుంటూ వెళ్తాను. మీలా రోడ్డు మీద చిల్లర గొడవలు పెట్టుకోను అని మీనా అంటుంది. నువ్వు చస్తే చల్లేది పూలే నోట్ల కట్టలు కాదు. ఒక్క ఫోన్ చేస్తే మార్కెట్ అంతా ఇక్కడ ఉంటుంది అని మీనా పక్కన ఉన్న ఆవిడ అంటుంది.
{{/usCountry}}ఫంక్షన్‌లో జరిగిన హారం దొంగతనం గురించి శోభ అంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి అని అని మీనా అంటుంది. నీలాంటి వాళ్లతో గొడవ పెట్టుకోడానికి రాలేదు. నా కూతురు కాపురం గురించి మాట్లాడేందుకు వచ్చాను. మీ అత్తే ఇవన్ని చెప్పింది. నీ మొగుడు తాగుడుకు లేకుంటే నన్ను డబ్బు అడగండి ముష్టి పడేస్తాను అని శోభ అంటుంది.
ఇదే మాట ఇంకెవత్తైనా అంటే ఇటుక రాయిలతో కొట్టేదాన్ని, ముక్కు, మోహం ఏకం చేసేదాన్ని అని మీనా వార్నింగ్ ఇస్తుంది. నీలాంటి వాళ్లతో నాదే బుద్ధి తక్కువ అని శోభ అంటే.. తక్కువ కాదు అసలు ఉంటే కదా అని మీనా అంటుంది. దాంతో శోభ వెళ్లిపోతుంది. ఇంతలో బాలు వచ్చి ఏమైందని అడుగుతాడు. మీనా చెప్పకపోవడంతో పక్కనున్న ఆవిడ మొత్తం చెబుతుంది.
సరిగ్గా బుద్ధి చెప్పాలి
కోపంతో ఊగిపోయిన తనకు సరిగ్గా బుద్ధి చెబితే కానీ ఇంకోసారి జోలికి రాదని మీనాను తీసుకెళ్తాడు బాలు. మరోవైపు తోడి కోడళ్లు విడిపోతారని మాస్టర్ ప్లాన్ చేసినా. కానీ కాలితో తన్ని వెళ్లిపోయింది అని ప్రభావతి అనుకుంటుంది. ఇంతలో రవి, శ్రుతి వస్తారు. తలనొప్పిగా ఉందని, ప్రభావతిపై అరిచి వెళ్లిపోతుంది శ్రుతి. ఏమైందిరా అని రవిని అడుగుతుంది ప్రభావతి.
ఎవరో పనిపాట లేనివాళ్లు పుల్లలు పెడుతున్నారని తెలిసి అని రవి అంటుంది. శోభతో మాట్లాడింది రవికి చెబుతుంది ప్రభావతి. ఇంతలో రవి వచ్చి డబ్బుడమ్మా అని అరుస్తూ వస్తాడు బాలు. తాడో పేడో తేల్చుకుందాం, అందరికి నేనే కనిపిస్తున్నానా, తల్లిని బట్టే కూతురు, పదా తేల్చుకుందామని బాలు, మీనా శ్రుతి దగ్గరికి వెళ్తారు. అక్కా చెల్లెళ్లా కలిసి ఉండేవారు. ఏమైందో అనుకుంటూ రవి వెళ్తాడు.
నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయిందే అనుకుంటుంది ప్రభావతి. పైన బాలు, మీనా-రవి, శ్రుతి గొడవ పడినట్లు డ్రామా చేస్తారు. అరుస్తారు. అదంతా విన్న ప్రభావతి ఆనందంతో తాండవం చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంటుంది. ఆనందం తన్నుకొస్తుందే అని ప్రభావతి అనుకుండగా సత్యం వస్తాడు. ఏమైందని అడిగితే చాలా సంతోషంగా చెబుతుంది ప్రభావతి.
బాలు కంటే గయ్యాలిలా
శ్రుతిని తిడుతూ బాలు, మీనా వస్తారు. ఏమైందిరా అని సత్యం అడుగుతాడు. నాకు చాలా కోపంగా ఉంది. కారు కడుక్కోవాలని బాలు వెళ్తాడు. వెంటే సత్యం వెళ్తాడు. ఇంట్లో చిచ్చు పెడుతున్నావా అని ప్రభావతి అంటే.. అవును కాగడాతో పెట్టాను. శ్రుతికి ఏమైంది మీలా అని మీనా అంటుంది. శ్రుతి వచ్చి నువ్వైతే పొగరుబోతులా కనిపిస్తున్నావ్. బాలు కంటే గయ్యాలిలా తయారయ్యావ్ అని శ్రుతి అంటుంది.
అందుకే నేను చెప్పాను కదమ్మా నీ స్థాయి వాళ్లతో మాట్లాడాలని అని ప్రభావతి అంటుంది. మీ మాటే వినాల్సింది. ఎవరు ఏంటో ఇప్పుడే బాగా అర్థమైంది అని శ్రుతి అంటుంది. అయితే ఇకనుంచి టీ కాఫీకి, భోజనానికి నన్ను అడగొద్దు. ఈవిడనే అడుగు అని మీనా వెళ్లిపోతుంది. అడుగుతాను అని శ్రుతి అంటుంది.
ఇద్దరు గొడవ పడితే వంట నా మీద పడిందే. కానీ, వీళ్లిద్దరు అయితే గొడవ పడ్డారు. ఇకనుంచి దూరంగా ఉంటారు అని సంతోషిస్తుంది ప్రభావతి అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.