గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 592వ ఎపిసోడ్ లో మెటర్నిటీ హాస్పిటల్లో మీనాకు దొరికిపోయి మరోసారి ప్రమాదంలో పడుతుంది రోహిణి. ఇటు చింటు దత్తత విషయంలో కాస్త ఆచితూచి ముందుకెళ్లాలని బాలు, మీనా అనుకుంటారు. మొత్తానికి చింటు ద్వారా ఇంట్లో వాళ్లకు అడ్డంగా దొరికిపోయే ప్రమాదంలో పడుతుంది రోహిణి.
చింటు తల్లి గురించి చెప్పిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ చింటు తల్లి గురించి ఇంట్లో వాళ్లకు బాలు నిజం చెప్పే సీన్ తో మొదలవుతుంది. తాను ఓ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నానని, ఇంట్లో వాళ్లందరినీ పిలవాలని తల్లి ప్రభావతితో అంటాడు బాలు. అందరూ వచ్చిన తర్వాత చింటు బర్త్ డేకు వెళ్లామని, అక్కడ అతని తల్లి గురించి ఓ సీక్రెట్ తెలిసిందని అంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న రోహిణి గుమ్మం బయటి నుంచే అది విని భయపడిపోతుంది. అటు నుంచి అటే వెళ్లిపోవాలని అనుకుంటుంది.
రోహిణిని పరోక్షంగా తిట్టిన మనోజ్, ప్రభావతి
చింటు తల్లి దుబాయ్ లో ఉంటోందని, కానీ ఆమె తనను అమ్మ అని కాకుండా అత్త అని పిలవాలని చెప్పిందని బాలు ఇంట్లో వాళ్లతో చెబుతాడు. బాలుకి తెలిసిన నిజం ఇదా అని రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లు తేలిగ్గా తీసుకోరు. అదే ఓ తల్లేనా అని వాళ్లంతా తిడతారు. మనోజ్, ప్రభావతి కూడా పరోక్షంగా చింటు తల్లి అయిన రోహిణిని నానా మాటలు అంటారు. అసలు అది తల్లే కాదని ప్రభావతి అంటుంది. ఆమె దుబాయ్ లో ఎవడో బకరాని తగులుకొని ఉంటుందని, అలాంటి ఆడది ఉన్న ఇల్లు నాశనం అవుతుందని మనోజ్ అనడంతో రోహిణి షాక్ తింటుంది.
చింటు దత్తత విషయం చెప్పిన బాలు, మీనా.. ప్రభావతి రచ్చ
చివరికి తాము చింటుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలు, మీనా చెబుతారు. అతని అమ్మమ్మ ఆరోగ్యం బాగా లేదని, తల్లి పట్టించుకోవడం లేదని అంటారు. అందుకే తాము దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు మీనా చెబుతుంది. దీంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఎవడికో పుట్టిన వాడిని తన ఇంట్లోకి తీసుకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. రవిగాడు ఇంట్లో కుక్కను పెంచుతానంటే వద్దన్నానని అంటుంది. మనోజ్ కూడా దత్తతను వ్యతిరేకిస్తాడు. సత్యం, రవి మాత్రం ఓకే చెబుతారు.
తల్లికి ఫోన్ చేసి క్లాస్ పీకిన రోహిణి
{{/usCountry}}చివరికి తాము చింటుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలు, మీనా చెబుతారు. అతని అమ్మమ్మ ఆరోగ్యం బాగా లేదని, తల్లి పట్టించుకోవడం లేదని అంటారు. అందుకే తాము దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు మీనా చెబుతుంది. దీంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఎవడికో పుట్టిన వాడిని తన ఇంట్లోకి తీసుకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. రవిగాడు ఇంట్లో కుక్కను పెంచుతానంటే వద్దన్నానని అంటుంది. మనోజ్ కూడా దత్తతను వ్యతిరేకిస్తాడు. సత్యం, రవి మాత్రం ఓకే చెబుతారు.
తల్లికి ఫోన్ చేసి క్లాస్ పీకిన రోహిణి
{{/usCountry}}చింటుని బాలు, మీనా దత్తత తీసుకుంటే తాను పూర్తిగా ఇరుక్కుపోతానని భయపడిన రోహిణి.. తల్లికి ఫోన్ చేసి క్లాస్ పీకుతుంది. ఆ మీనాతో మాటలు కలపొద్దని ఎన్నిసార్లు చెప్పాను.. వాళ్లు ఇప్పుడు చింటుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు అని చెబుతుంది. చింటు గురించి నిజం తెలిసి వాళ్లు అలా భావించి ఉంటారని సుగుణ అంటుంది. కానీ రోహిణి మాత్రం ఇక నుంచి వాళ్లు ఫోన్ చేస్తే మాట్లాడొద్దని, ఇంటికి వచ్చినా నోటికి వచ్చినట్లు మాట్లాడి పంపించేయాలని అంటుంది. చేసేది లేక సుగుణ సరే అంటుంది.
సుగుణకు మీనా ఫోన్..
బాలు మాత్రం దత్తత విషయంలో వెనక్కి తగ్గడు. వెంటనే సుగుణకు ఫోన్ చేసి దత్తత విషయం చెప్పాలని మీనాతో అంటాడు. ఆమె ఫోన్ చేస్తుంది. కానీ సుగుణ మాత్రం ఫోన్ తీయదు. ఇక నుంచి వాళ్లు ఫోన్ చేసినా తీయకూడదని చింటుకి కూడా చెబుతుంది. వాళ్లతో మాట్లాడటం మీ అమ్మకు ఇష్టం లేదని అంటుంది. ఆమె ఫోన్ తీయకపోవడంతో బాలు, మీనా కూడా దత్తత విషయాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాలని అనుకుంటారు.
ఇటు తన ఫ్రెండ్ విద్యను కలిసిన రోహిణి ఇంట్లో జరిగిన విషయం గురించి చెబుతుంది. చింటు విషయం ఇంట్లో చెప్పేస్తానని అంటుంది. అయితే అంతకంటే ముందు తాను రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. విద్యతో కలిసి హాస్పిటల్ కు వెళ్తుంది. డాక్టర్ ను కలిసి తనకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, రెండో బిడ్డ కావాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అప్పుడే మీనా, సుమతి అదే హాస్పిటల్ కు వస్తారు. మీనా ఏదో పని ఉండి వెళ్లిపోగా.. సుమతి మాత్రం రోహిణిని చూస్తుంది. మెటర్నిటీ హాస్పిటల్లో రోహిణికి పనేంటి అని మీనాకు ఫోన్ చేసి చెబుతుంది. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.