Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫొటోలు తీస్తానని రోహిణి అంటే.. వద్దని సెల్ఫీ తీసుకుంటామని పంపించేస్తాడు బాలు. అలాగే సెల్ఫీ తీసుకుంటారు. ఫోన్ తీసుకోవడం కుదరట్లేదని రోహిణి అంటే.. వాళ్లు రోజు రోజుకు తెగ నచ్చేస్తున్నారని విద్య అంటుంది.
బాలును పెళ్లి చేసుకుంటావా

అసలు నీ సమస్య ఏంటీ బాలు అంత నచ్చాడా. పెళ్లి చేసుకుంటావా ఏంటీ అని రోహిణి అడుగుతుంది. అలా కాదు. వాళ్లిద్దరికి పెళ్లి అయిపోయింది. వాళ్ల మధ్యలోకి ఎవరు రాకూడదు. మా పరివార్ అవార్డ్ ఇస్తే వాళ్లకే వస్తుందని విద్య అంటుంది. ముంబై నుంచి డీలర్‌షిప్ ఇచ్చేందుకు ముఖేష్ అనే వ్యక్తి వస్తాడు. అతన్ని అందరికి మణికంఠ పరిచయం చేస్తాడు.
బాలు, రవి వాళ్లు సెల్ఫీలు తీసుకుంటుంటే అది చూసిన మనోజ్ మణికంఠకు సైగ చేస్తాడు. దాంతో మణికంఠ వెళ్లి సెల్ఫీలు దిగొద్దని, ముంబై ముఖేష్ వద్ద మనోజ్ పరువు పోతుందని చెబుతాడు. మీనా ఒప్పుకుంటుంది. దాంతో బాలు, రవి సరేనంటారు. సత్యంతో ముగ్గురు కొడుకుల గురించి ముంబై ముఖేష్ గొప్పగా చెబుతాడు. దాంతో సత్యం ఆశ్చర్యపోతాడు.
అది కవర్ చేసేందుకు సత్యంను ఎవరో పిలుస్తున్నారని పంపించేస్తాడు మనోజ్. ప్రభావతిని పరిచయం చేస్తాడు మనోజ్. క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తుందని చెబుతాడు మనోజ్. మీనాకు ట్రైనింగ్ ఇచ్చింది గుర్తు చేయడంతో ముందు జోక్ చేసి తర్వాత గడగడా చెబుతుంది. ఇంతలో ముఖేష్‌ను మనోజ్ తీసుకొస్తాడు. బాలును పరిచయం చేస్తే మీరు మూవీస్‌లో హీరోగా చేస్తున్నారా అని అడుగుతాడు ముఖేష్.
40 లక్షలతో మొదలుపెట్టి
దానికి బాలు పొంగిపోతాడు. బాలు తన బిజినెస్ గురించి చాలా గొప్పగా చెబుతాడు. దానికి ఆదర్శం మనోజ్ అని 40 లక్షలతో మొదలుపెట్టి రెండు చేతుల సంపాదిస్తున్నాడని ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తాడు బాలు. మీనా పూల బిజినెస్ గురించి చెబుతాడు మనోజ్. పూల గురించి చెబుతూనే మధ్య మధ్యలో మీనా ఒరిజినాలిటీ బయటపడుతుంది. కానీ, మ్యానేజ్ చేస్తుంది.
{{/usCountry}}దానికి బాలు పొంగిపోతాడు. బాలు తన బిజినెస్ గురించి చాలా గొప్పగా చెబుతాడు. దానికి ఆదర్శం మనోజ్ అని 40 లక్షలతో మొదలుపెట్టి రెండు చేతుల సంపాదిస్తున్నాడని ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేస్తాడు బాలు. మీనా పూల బిజినెస్ గురించి చెబుతాడు మనోజ్. పూల గురించి చెబుతూనే మధ్య మధ్యలో మీనా ఒరిజినాలిటీ బయటపడుతుంది. కానీ, మ్యానేజ్ చేస్తుంది.
{{/usCountry}}రవి, శ్రుతి గురించి కూడా గొప్పగా చెబుతారు. తర్వాత మనోజ్, రోహిణి కేక్ కట్ చేస్తారు. ముఖేష్ గిఫ్ట్ ఇస్తాడు. ముఖేష్‌ను మాట్లాడమంటే.. సత్యంను మోటివేషనల్ స్పీచ్ ఇవ్వమంటాడు. కొడుకుల గురించి సత్యం చెబుతాడు. ఆస్తి, ప్రేమ సమానంగా పంచాలని చెప్పి ముగిస్తాడు సత్యం. ప్రభావతి మాట్లాడేందుకు వస్తుంటే అది లాక్కుని మనోజ్ ముఖేష్‌కు ఇస్తాడు.
మనోజ్ గురించి గొప్పగా చెబుతాడు ముఖేష్. సాయంత్రం వరకు ఆగి డీలర్‌షిప్ ఇద్దామనుకున్నా.. కానీ ఇంతమంచి ఫ్యామిలీ చూసి ఇప్పుడే ఈ స్టేట్ డీలర్‌షిప్ ఇస్తున్నా అని ముఖేష్ అంటాడు. అంతా సంతోషిస్తారు. ప్రభావతి మొహం వెలిగిపోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు మనోజ్, రోహిణి. రాత్రి మణికంఠ మందు తీసుకెళ్తుంటే బాలు అడుగుతాడు.
దీని కిక్కు లెక్క వేరు
ఇది ఫారెన్ బ్రాండ్ అని, దీని లెక్క కిక్కు వేరని మణికంఠ చెబుతాడు. ఒక పెగ్ వేస్తావా ఏంటీ అని మణికంఠ అడిగితే.. వద్దని బాలు చాలా బాధగా చెబుతాడు. మణికంఠ మోటివేషన్ ఇచ్చి బాలును తాగేందుకు ఒప్పిస్తాడు. బాలు, మీనా వెళ్తున్నారని విద్య చెబితే రోహిణి ఆపాలని వస్తుంది. మనోజ్‌కు అండగా బాలును ఉండమని సత్యం చెబుతాడు.
వాడిని నోరు జారకుండా చూసుకోవాలని ప్రభావతి అంటుంది. ఈరోజు తాగరు, వాగరు అని హామీ ఇస్తుంది మీనా. అదంతా విన్న రోహిణి మావయ్య తెలియకుండా మంచి పని చేశారు. కానీ, మీనాక దూరంగా బాలును ఉంచి తాగేలా చేసి ఫోన్ కొట్టేయాలని విద్యతో అంటుంది. ఓ ప్లాన్ చెబుతుంది రోహిణి.
ముఖేష్ తాగుతుంటాడు. మనోజ్ వస్తాడు. ఇలా అవమానిస్తారనుకోలేదు. గెస్ట్‌ను ఇలాగే చూసుకుంటారా. పార్టీ కల్చర్ తెలియదా. హోస్ట్ కూడా గెస్ట్‌తోపాటు కలిసి పెగ్ వేయాలి, అదే పార్టీ మ్యానర్స్ అని ముఖేష్ అంటాడు. పెగ్గా అని మనోజ్ నో చెబుతాడు. డీల్ క్యాన్సిల్ అంటాడు ముఖేష్. దాంతో మనోజ్ తాగుతాడు.
రివర్స్ అయిన రోహిణి ప్లాన్
తర్వాత బాలు, రవి వచ్చి కూడా తాగుతారు. తాగిన మత్తులో అంతా నిజం చెబుతాడు బాలు. అది విన్న ముఖేష్ మోసం చేస్తారా అని డీల్ క్యాన్సిల్ చేసుకుంటాడు. ఫోన్ కొట్టేద్దామని బాలుతో తాగించిన రోహిణి ప్లాన్ తన భర్త డీల్ పోయేలా బెడిసికొడుతుంది. తనకే రివర్స్ అవుతుంది. బాలుతో తాగించి తప్పు చేశావని రోహిణి విద్యతో అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.