...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: ముక్కలైన మీనా కాపురం-పుట్టింట్లో వదిలేసిన అత్త-బయటపడిన బాలు గొప్పతనం-శివ సూసైడ్!

Gunde Ninda Gudi Gantalu Serial March 27th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 27 ఎపిసోడ్‌లో ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. తనను అవమానించినందుకే అలా చేశానని శివ చెబుతాడు. మీనాను పుట్టింట్లోనే వదిలేసి, అత్తింటికి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అత్త ప్రభావతి. మీనా కాపురం ముక్కలవుతుంది.

Published on: Mar 27, 2026, 08:24:51 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివను మీనా, సుమతి కొట్టి తిడతారు. వాళ్లను ఆపి వీడి అంతు చూస్తాను, ఇంతకింత బదులు తీర్చుకుంటాను అని ప్రభావతి అంటుంది. మీనా క్షమించమని అంటుంది. అయినా ప్రభావతి వినదు.

ముష్టి ఎత్తుకోవడం నయం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 27 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 27 ఎపిసోడ్‌

నేను తెచ్చుకున్న కోడళ్లు ధనవంతులు, నువ్వే ముష్టి కుటుంబం నుంచి వచ్చావ్. ఇలా చేసేకన్నా ముష్టి ఎత్తుకోవడం నయం. నువ్ నా కోడలు అని తెలిస్తే ఊరంతా పరువు పోతుంది. ఇకనుంచి నువ్వు ఈ కొంపలోనే పడి ఉండు. మళ్లీ మా ఇంట్లో అడుగుపెడితే గుమ్మం ముందే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.

కూతురు కూడా పుట్టింట్లో ఉంటే ఆ బాధ తట్టుకోలేవమ్మా. వాడు చేసినదానికి దీనికి శిక్ష వేయకండని ప్రభావతి కాళ్లు పట్టుకుంటుంది పార్వతి. మీనా ఆపుతుంది. అయినా ప్రభావతి వినదు. ఆరోజు సారీ చెబుదామని వస్తే బ్యాగ్ వెతికించి అవమానించారు. ఆ కోపంతో చేశాను కానీ కావాలని చేయలేదు క్షమించక్కా అని మీనా కాళ్లపై పడతాడు శివ.

నాటకాలు ఆపమంటుంది ప్రభావతి. డబ్బుందన్న విషయం ఉప్పు అందించింది ఇదే. అందుకే చేశావ్. నిన్ను పోలీసులకు అప్పజెప్పి జైలుకు పంపించకుంటే నా పేరు ప్రభావతే కాదు అని కాలర్ పట్టుకుని బయటకు లాక్కొస్తుంది ప్రభావతి. బయట పెద్ద గొడవ చేస్తుంది. దాంతో ఇంటి ఓనర్ వచ్చి ప్రభావతిని ఆపుతాడు. నీకు బుద్ధి చెప్పేందుకే చేశాను అంటున్నాడుగా వదులు అంటాడు.

రోహిణి సర్దిచెప్పడంతో

నీ వల్ల మీనా కాపురం ముక్కలైందిగారా అని లోపలికి వెళ్లి ఏడుస్తుంది పార్వతి. కొడుకును దారికి తేలేకపోయాను అని భర్త ఫొటోకు చెబుతూ మొరపెట్టుకుంటుంది. మీనా వచ్చి ఓదారుస్తుంది. శివను మాట్లాడకమని చెబుతుంది పార్వతి. దీని పెళ్లి లేకుంటే నీ బతుకు నిన్ను చావమని ఎప్పుడో చచ్చేదాన్ని అని పార్వతి అంటుంది.

దాంతో పార్వతి కాళ్లపై పడి నేను డబ్బుకోసం దొంగతనం చేయలేదమ్మా అని శివ అంటుంది. ఆరోజు మీ అత్తగారు నన్ను అవమానించారు. అందుకే చేశాను. ఇది గుణ గాడి సలహా ఇచ్చాడు. బావ మొబైల్ ఫోన్‌లోనే ఆ వీడియో ఉంది. బావ మొబైల్ నుంచి బయటపడింది. నేనే ఆ దొంగతనం చేసింది అని బావకు ఎప్పుడో తెలుసు. అది తెలిసే నా చేయి విరగ్గొట్టాడు అని బామ్మర్ది శివ జరిగింది అంతా, బాలు గొప్పతనం గురించి చెబుతాడు.

అంతగొప్ప మనిషిని మాటలు అనేలా

అదంతా విన్న బాలు ఎందుకు అలా చేశాడు, బాలును అన్న మాటలు తలుచుకుని మీనా, పార్వతి బాధపడతారు. ఆయన్ను అపార్థం చేసుకుని నానా మాటలు అన్నాను అని మీనా అంటుంది. అంతగొప్ప మనిషిని నేను కూడా మాటలు అనేలా చేశావు కదరా. కనీసం బావ అని కూడా పిలవలేదు కదరా ఛీ.. అని చీదరించుకుంటుంది పార్వతి. ఇప్పుడు అది బావకు తెలియకుండా బయటపడి ఉంటుందని సుమతి అంటుంది.

తండ్రిలా బావ మనల్ని అందరిని కాపాడుకుంటూ వస్తున్నాడు అని శివ కాలేజ్ సస్పెండ్ గురించి చెబుతుంది సుమతి. ఇదంతా జరుగుతుందనే ఆయన చెప్పకుండా దాచారు అని మీనా అంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల దీని పెళ్లి జరుగుతుందా అని ఏడుస్తుంది సుమతీ. మరోవైపు సత్యంకు జరిగింది చెబుతుంది ప్రభావతి.

మీనాకు అంతా తెలిసిన బాలు నోర్మూయించింది అని రోహిణి మరింత ఎక్కిస్తుంది. ఇంతలో బాలు వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీనాను పిలుస్తే ఇక ఇంటికి రాదని చెబుతుంది ప్రభావతి. ఏం చేశారు నా భార్యను అని అరుస్తాడు బాలు. అప్పుడు శివ దొంగతనం వీడియో బాలుకు చూపిస్తాడు మనోజ్. అది చూసి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతాడు బాలు.

శివ సూసైడ్

తర్వాత పార్వతి ఇంటికి బాలు వెళ్తాడు. శివను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు. కానీ, శివ ఉండడు. ఏదైనా చేసుకోడానికి వెళ్లి ఉంటాడని అంతా గాలిస్తారు. ఓ ఇంటిపైన నిలబడి సూసైడ్ చేసుకునేందుకు ఉంటాడు శివ. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks