...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు తరతరాల గిఫ్ట్- ప్రభావతి, మనోజ్ నగల మోసం చెప్పిన మీనా- బయటపడిన షాప్ నష్టం

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 17 ఎపిసోడ్‌లో సుశీల 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. సుశీలను ప్రేమించిన గోపాలం వస్తాడు. చిన్ననాటి కబుర్లు, గోపాలం లవ్ ట్రాక్ అన్ని చెప్పుకుంటారు. బాలుకు తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన వస్తువును గిఫ్ట్‌గా ఇస్తుంది సుశీల. మనోజ్ మోసం బయటపడుతుంది.

Published on: Nov 17, 2025, 07:53:48 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యవతి భర్త, సుశీల ప్రేమికుడు గోపాలంను బాలు తీసుకొస్తాడు. సుశీలను అలాగే చూస్తుంటాడు గోపాలం. సుశీల సిగ్గుపడుతుంది. చిన్నప్పుడు సుశీల, తన ఫ్రెండ్స్, గోపాలం లవ్ ట్రాక్ అంతా చెబుతుంది సత్యవతి.

ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకోవాలని

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్‌

సుశీల, సత్యవతి ఇద్దరు ప్రాణ స్నేహితులం అని, పెళ్లి చేసుకుంటే విడిపోతామని ఇద్దరు ఒక్కరినే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెబుతారు. అలాగే, గోపాలం తన లవ్ లెటర్‌ను సుశీల బ్యాగ్‌లో పెట్టబోయి సత్యవతి బ్యాగ్‌లో పెట్టడంతో పెళ్లి అయిందని చెబుతాడు గోపాలం. సుశీలను లవ్ చేసినట్లు శోభనం గదిలో చెప్పాడు. దాంతో పదేళ్లు మాకు శోభనమే జరగలేదని సత్యవతి చెబుతుంది.

అంతా నవ్వుకుంటారు. సడెన్‌గా సుశీల కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంతా అడిగితే ఏం లేదు. నా మనవడు నా బాల్యాన్ని దోసిట్లో తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చాడు. నా కలను ఇలా తీర్చాడు అని ఎమోషనల్ అవుతుంది సుశీల. నాకు ఇంత అపురూపమైన వరం 75 ఏళ్లకు దొరికింది అని సుశీల అంటుంది. మనమంతా కలిసి వారం రోజులు గోవా ట్రిప్‌కు వెళ్లాలని ఉందని సుబ్బులు అంటుంది.

సెల్ఫీ తీసిన శ్రుతి

దాంతో అందరికి స్పెక్ట్స్, పీచ్ మిఠాయి తీసుకొచ్చి ఇస్తాడు బాలు. శ్రుతి సెల్ఫీ తీస్తుంది. తర్వాత సుశీల కేక్ కట్ చేస్తుంది. ప్రభావతి ఫీల్ అవుతుంటే తను ఇప్పుడు కూడా అందంగా ఉందని, భరతనాట్యం స్కూల్ నడిపిస్తుందని, ముగ్గురు కొడుకులు, కోడళ్లను ఒకతాటిపై నడిపిస్తుందని కోడలి గురించి గొప్పగా చెబుతుంది సుశీల.

నువ్వు గిఫ్ట్ ఇస్తానన్నావ్ అని మనోజ్ అంటుంది. ఒక్కొక్కరు ఏం ఇచ్చారో చెబుతుంది సుశీల. బాలు గురించి గొప్పగా చెబుతుంది. ఇది తరతరాలుగా మా ఇంటి గుర్తుగా వస్తుంది. ఇది మా అత్తగారు ఇచ్చారు. నా మనసుకు నచ్చిన గిఫ్ట్ నా మనవడు ఇచ్చాడు. నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. డబ్బుతో కొనలేనిది స్నేహం. నా మనసుకు ఎన్నడు లేని తృప్తిని, సంతోషాన్ని ఇచ్చావ్ అని సుశీల చెబుతుంది.

బాలుకు సుశీల తరతరాలుగా వస్తున్న వస్తువును బహుమతిగా ఇస్తుంది సుశీల. తర్వాత తల్లికొడుకుల తైతక్కలను చెప్పలేక గింజుకుని చచ్చాను అని బాలు అంటాడు. గోల్డ్ నగలు తీసి కవరింగ్ నగలు పెట్టారు. నగలు ఎక్కడో తాకట్టు పెట్టారు అని మీనా చెబుతుంది. నువ్వే నగలు తీసుకొచ్చి ఇచ్చావ్ ఈ లోపల ఏం జరిగింది అని ప్రభావతిని సత్యం నిలదీస్తాడు.

బయటపడిన ప్రభావతి, మనోజ్ మోసం

అలా ప్రభావతి నగలు మార్చిన విషయం బయటపడుతుంది. మనోజ్‌కు నాలుగు లక్షల డబ్బు, 4 లక్షల ఫర్నిచర్ నష్టం వచ్చిన విషయం ప్రభావతి చెప్పేందుకు చూస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe