...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యభామలా ఉగ్రరూపం చూపించిన మీనా.. కిడ్నాపర్ల అంతు చూసి.. స్పృహ తప్పి పడిపోయిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ లో మీనా సత్యభామలా మారి ఉగ్రరూపం చూపిస్తుంది. తనను కిడ్నాప్ చేసిన వాళ్లను రోహిణి కళ్ల ముందే చితగ్గొడుతుంది. అది చూసి బాలు షాక్ తింటాడు.

Published on: Oct 21, 2025, 08:06:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 536వ ఎపిసోడ్ లో రోహిణి అనుకొని మీనాను కిడ్నాప్ చేస్తారు దినేష్ మనుషులు. అయితే ఆమెను కాపాడటానికి వెళ్లి ప్రమాదంలో పడిని బాలును కూడా ఆ కిడ్నాపర్ల నుంచి కాపాడుతుంది మీనా. ఈ క్రమంలో ఆమె ఉగ్రరూపం చూపిస్తుంది.

నరకాసుర వధ కథ చెప్పిన శృతి, సత్యం.. విద్య ఇంటికి మీనా

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యభామలా ఉగ్రరూపం చూపించిన మీనా.. కిడ్నాపర్ల అంతు చూసి.. స్పృహ తప్పి పడిపోయిన బాలు
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యభామలా ఉగ్రరూపం చూపించిన మీనా.. కిడ్నాపర్ల అంతు చూసి.. స్పృహ తప్పి పడిపోయిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ ఇంట్లో దీపావళి వేడుకల హడావిడితో మొదలవుతుంది. మీనా అందరికీ పాయసం చేసి తీసుకొస్తుంది. అప్పుడే వచ్చిన శృతి సత్యభామ, నరకాసుర వధ గురించి తాము ఇప్పుడే ఓ డబ్బింగ్ చెప్పి వచ్చానంటూ అదే భాషలో మాట్లాడుతుంది. ఆ క్రమంలో కృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ ఎలా నరకాసురుడిని చంపిందో శృతి వివరిస్తుంది.

అప్పుడే సత్యం కూడా ఆ కథ గురించి చెబుతూ.. సత్యభామ ధైర్యసాహసాల గురించి చెబుతాడు. అది విని అచ్చూ మీనా కూడా అలాగే ఉంది కదా అని బాలు అంటాడు. అవునని సత్యం అంటాడు. అప్పుడే మీనాకు విద్య ఫోన్ చేసి పూలు కావాలని, ఇంటికి తెచ్చివ్వాలని అడుగుతుంది. సరే ఆమె వెళ్తుంది.

రోహిణికి దినేష్ ఫోన్.. మళ్లీ బ్లాక్‌మెయిల్

అటు దినేష్.. రోహిణిపై కోపంతో రగిలిపోతుంటాడు. ఎవరో తనను బాగా కొట్టారని అనడంతో అతని పక్కనున్న రౌడీలు అది రోహిణియే అయి ఉంటుందని అనడంతో అతనిలోనూ అనుమానం మొదలవుతుంది. దానిని ఊరికే వదిలిపెట్టను అంటూ.. రోహిణికి దినేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. ఆమె కట్ చేస్తున్నా పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు.

దీంతో రోహిణి వణికిపోతూ విద్య ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇంటి బయటకు రాగానే దినేష్ మనిషి అక్కడ ఉంటాడు. రోహిణి ఫొటో తీసి దినేష్ కు పంపిస్తాడు. ఆమెనే రోహిణి.. ఆమె ఎక్కడికి వెళ్లిన ఫాలో అవ్వు.. ఏం చేసినా నాకు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత రోహిణి.. విద్య ఇంటికి వెళ్తుంది.

శృతికి తల్లి శోభ ఫోన్.. గొడవకు ప్లాన్

మరోవైపు శృతికి తల్లి శోభ ఫోన్ చేస్తుంది. పండుగకు వస్తున్నారా అని అడుగుతంది. ఈసారి ఇక్కడే పండుగ జరుపుకుంటాం.. అయినా అక్కడికి వస్తే నేను ఒక్కదాన్నే క్రాకర్స్ కాల్చుకోవాలి.. ఇక్కడైతే అందరం ఉంటాం.. అయినా ఇప్పుడే గొడవ సద్దుమణిగి అందరం పండుగ కోసం సిద్ధమవుతున్నాం అని శృతి అంటుంది. మళ్లీ ఏం గొడవ అనగానే రూమ్ కోసం జరిగిన గొడవ గురించి చెబుతుంది. అది విని ఆ ఇంట్లో మరో గొడవ పెట్టడానికి తనకు ఛాన్స్ దొరికిందని శోభ అనుకుంటుంది.

రోహిణికి బదులు మీనా కిడ్నాప్

అటు విద్య ఇంటికి రోహిణి వెళ్తుంది. ఆ విషయం దినేష్ కు ఫోన్ చేసి చెబుతాడు అతని మనిషి. అక్కడే ఉండమని, ఆమె బయటకు రాగానే కిడ్నాప్ చేసి తీసుకురావాలని చెప్పి మరింత మందిని పంపిస్తాడు. దినేష్ ఫోన్ గురించి విద్యకు చెప్పి రోహిణి బాధపడుతుంది. లక్ష ఇవ్వాల్సిందే అని విద్యకు చెబుతుండగా మీనా అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అనగానే.. డెకరేషన్ కోసం తానే పిలిచానని విద్య కవర్ చేస్తుంది.

రోహిణి బయటకు రాగానే కిడ్నాప్ చేసి బండిలోకి ఎక్కించండి అని చెప్పి ఆ వ్యక్తి మిగిలిన వారికి చెబుతాడు. ఆమె ఎర్ర చీర కట్టుకుందని అంటాడు. అప్పుడే మీనా బయటకు వస్తుంది. బాలుతో ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమెనే రోహిణి అనుకొని ముగ్గరు వచ్చి ఆమెను బలవంతంగా బండిలోకి ఎక్కించుకొని తీసుకెళ్తారు.

ఉగ్రరూపం చూపించిన మీనా

అటు మీనాను వెతుక్కుంటూ బాలు విద్య ఇంటికి వస్తాడు. ఆమె అప్పుడే వెళ్లిపోయింది కదా అని విద్య చెబుతుంది. తర్వాత బయటకు వచ్చి ఫోన్ చేస్తే.. ఫోన్ అక్కడ పడి ఉండటం చూసి బాలు షాక్ తింటాడు. అటు నీ భర్త తనకు బాకీ ఉన్నాడంటూ మీనాను కట్టి పడేస్తాడు దినేష్. అప్పుడే బాలు అక్కడికి వచ్చి దినేష్ ను నిలదీస్తాడు. కొడతాడు.

అతని పక్కనున్న మనుషులు బాలు తలపై గట్టిగా కొట్టడం అతడు స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి మీనా ఉగ్రరూపం చూపిస్తుంది. దినేష్ తోపాటు అడ్డొచ్చిన అందరినీ చితకబాదుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe