గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ప్రభావతి పెట్టిన చిచ్చుతో మీనా, శ్రుతి ఇద్దరు గొడవ పడినట్లు నానా మాటలు అనుకుంటారు. మీనాను శ్రుతి పొగరుబోతని, బాలు కంటే గయ్యాలి అని తిడుతుంది. ఇకనుంచి కాఫీ, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా అత్తయ్యనే ఇస్తుందని మీనా వెళ్లిపోతుంది.
ఉప్పు నిప్పులా మీనా శ్రుతి

శ్రుతి కూడా అత్తయ్యే పెడతారని చెప్పి వెళ్లిపోతుంది. వీళ్ల గొడవ నేను వండటం మీదకు వచ్చిందేంటీ. నేను వండి పెట్టాలా. అయితే ఏంటీలే వీరిద్దరు మాత్రం గొడవ పెట్టుకున్నారు. ఇక నుంచి ఈ తోడి కోడళ్లు ఇద్దరు ఉప్పు నిప్పులానే ఉంటారు. ఎప్పటికీ కలవరు, హమ్మయ్యా అని ప్రభావతి తెగ సంతోషిస్తుంది.
రోహిణి ఎక్కడి వెళ్లింది, ఇంత మంచి న్యూస్ చెబుదామంటే రోహిణి లేదేంటీ అని ప్రభావతి అనుకుంటుంది. మరోవైపు సొంతూరికి కల్యాణిగా రోహిణి వెళ్తుంది. అక్కడ చింటు ఏడుస్తూ కనిపిస్తాడు. రోహిణి తల్లి సుగుణను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. స్పృహలోకి వచ్చిన సుగుణ కూతురు రోహిణితో మాట్లాడుతుంది.
నేను ఎంత కాలం ఉంటానో నాకు తెలియదు. నేను పోతే చింటు పరిస్థితి ఏమవుతుందో అని భయంగా ఉంది. నీ కొడుకు బారం ఇకనుంచి నీమీదే ఉంది. నువ్వే వాడిని చూసుకోవాలి. మీ అత్తింట్లో ఏం చెప్పైనా సరే చింటును తీసుకెళ్లు. లేకుంటే వాడు అనాథల బతకాల్సి వస్తుందని సుగుణ అంటుంది.
నా కొడుకు బారమయ్యాడా
తల్లి మాటలు విన్న రోహిణి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో చింటును ఎలా తీసుకెళ్లాలి, ఏం చెప్పి మ్యానేజ్ చేయాలి. నా కొడుకు బాధ్యత నాకే బారంగా మారిందేంటీ. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావేంటీ దేవుడా అని రోహిణి కుమిలిపోతుంది.
మరోవైపు ఓ ప్యాసెంజర్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు బాలు. ప్యాసెంజర్ అర్జంట్‌గా వెళ్లాలని తొందరపెడతాడు. ఎక్కడికి వెళ్లాలి సర్ అని బాలు అడుగుతాడు. తన పెళ్లికి వెళ్లాలి అని ప్యాసెంజర్ అంటే.. పెళ్లి చూపులకా. ఎందుకు సర్ ఏరి కోరి డేంజర్లో పడతానంటారు అని సెటైర్లు వేస్తాడు బాలు.
{{/usCountry}}మరోవైపు ఓ ప్యాసెంజర్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు బాలు. ప్యాసెంజర్ అర్జంట్‌గా వెళ్లాలని తొందరపెడతాడు. ఎక్కడికి వెళ్లాలి సర్ అని బాలు అడుగుతాడు. తన పెళ్లికి వెళ్లాలి అని ప్యాసెంజర్ అంటే.. పెళ్లి చూపులకా. ఎందుకు సర్ ఏరి కోరి డేంజర్లో పడతానంటారు అని సెటైర్లు వేస్తాడు బాలు.
{{/usCountry}}పెళ్లి గురించి ఇంతలా చెబుతున్నావ్. ఇంతకీ నీకు పెళ్లి అయిందా అని అతను అడుగుతాడు. అయింది సర్ అని బాలు అంటే.. నీ లైఫ్ ఎలా ఉందని ప్యాసెంజర్ అడుగుతాడు. ఆమె లేకపోతే ఉండలేను, ఆమె ఉంటే తట్టుకోలేను. అదొక తీయ్యటి గొడవ అని బాలు చెబుతాడు.
బాలు మీనా గొడవ
ఇంతలో ఎదురుగా స్కూటీ మీద మీనా వస్తుంది. కారుకు కొద్దిగా తాకుతుంది. బాలు కోపంగా అరుస్తూ కారు దిగుతాడు. ఏ కారబ్బాయి.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నావ్ అని మీనా అంటుంది. నీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నావ్. ఆ పూలగంపలో దాచుకున్నావా అని బాలు రివర్స్ అవుతాడు. ప్యాసెంజర్ ఏమో టైమ్ అవుతుందని ఎదురుచూస్తుంటాడు.
నా పెళ్లికి టైమ్ అవుతుంది అని కంగారుగా అంటాడు ప్యాసెంజర్. ఆగండి సర్. ఏం పెళ్లి చేసుకుంటారు. చేసుకుని మేము ఏం సుఖపడుతున్నాం అని బాలు అంటాడు. ఇతని పెళ్లాం మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు అని మీనా అంటుంది. అలా బాలు, మీనా ఒకరినొకరు ఇన్‌డైరెక్ట్‌గా అనుకుంటూ నడిరోడ్డు మీదే కారు, స్కూటీ ఆపి మరి గొడవ పడుతుంటారు.
ఇంతలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏంటీ గొడవ అని నిలదీస్తాడు. జరిగింది అంతా చెబుతారు. రాంగ్ రూట్‌లో వచ్చినందుకు ఐదు వందలు ఫైన్ వేస్తున్నాను. ఫైన్ కట్టాల్సిందే అని పోలీస్ హెచ్చరిస్తాడు. 500 ఆ అని బాలు షాక్ అవుతాడు. ఇక బాలును కాపాడటానికి చివర్లో ఈయన మా ఆయన సర్ అంటూ ట్విస్ట్ ఇస్తూ నిజం చెబుతుంది మీనా.
స్వీట్ టార్చర్ వైఫ్
దానికి ట్రాఫిక్ పోలీస్, ప్యాసెంజర్ ఇద్దరు షాక్ అవుతారు. ఇద్దరి గొడవ సరదా కోసం అని అర్థం చేసుకుని ట్రాఫిక్ పోలీస్ వెళ్లిపోతాడు. నువ్వు చెప్పిన స్వీట్ టార్చర్ వైఫ్ ఈవిడేనా అని మీనా గురించి బాలు చెప్పినవన్నీ మాట్లాడుతాడు ప్యాసెంజర్.
ఆ మాటలన్నీ విన్న కోపంతో ఊగిపోతుందు. మీరు ఇంటికి రండి చెబుతాను మీ సంగతి అని బాలుకు తాను ప్రేమగా పిలుచుకునే పూలగంప మీనా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.