...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కట్టలు తెంచుకున్న బాలు ఆవేశం.. మనోజ్‌ను నాలుగు పీకాలని నిర్ణయం.. సీన్‌లోకి సుశీల

గుండె నిండా గుడి గంటలు బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ లో నకిలీ నగలతో బాలు, మీనాలకు ఘోరమైన అవమానం జరగడం, బాలు ఆవేశం కట్టలు తెంచుకోవడం, మనోజ్ పైనే అనుమానం రావడం, కానీ మీనా అతన్ని కంట్రోల్ చేయడంలాంటివి చూడొచ్చు.

Published on: Nov 5, 2025, 08:08:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 547వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి, మనోజ్ చేసిన పనికి బాలు, మీనాలకు అవమానం జరుగుతుంది. నకిలీ నగల వల్ల ఇంట్లో మరోసారి రచ్చ జరిగే సూచనలు కనిపించాయి. మనోజ్, ప్రభావతిలను కడిగి పారేయడానికి బాలు సిద్ధం కాగా.. మీనా అతన్ని రెండు రోజులు ఆగమని నియంత్రిస్తుంది.

మీనా నగల గురించి అడిగిన సత్యం.. బాలులో అనుమానం

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కట్టలు తెంచుకున్న బాలు ఆవేశం.. మనోజ్‌ను నాలుగు పీకాలని నిర్ణయం.. సీన్‌లోకి సుశీల
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కట్టలు తెంచుకున్న బాలు ఆవేశం.. మనోజ్‌ను నాలుగు పీకాలని నిర్ణయం.. సీన్‌లోకి సుశీల

గుండె నిండా గుడి గంటలు బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా ప్రభావతిని మీనా నగల గురించి సత్యం అడిగే సీన్ తో మొదలవుతుంది. దీంతో మనోజ్, ప్రభావతి కంగారు పడతారు. వాళ్లిద్దరినీ చూసి బాలులో అనుమానం మొదలవుతుంది.

అయినా శపథం చేసిన తర్వాత ఇప్పుడా నగలు ఎందుకు అని మనోజ్, ప్రభావతి, రోహిణి అడుగుతారు. కానీ శృతితోపాటు సత్యం కూడా మీనా, బాలుకు మద్దతుగా నిలుస్తారు. అది మీకు అనవసరం.. మీనా నగలు ఆమెకు ఇచ్చేయమని సత్యం గట్టిగా చెబుతాడు.

నకిలీ నగలు ఇచ్చిన ప్రభావతి

దీంతో ప్రభావతిలో మరింత ఆందోళన పెరుగుతుంది. నగలు ఎక్కడున్నాయని అడగడంతో బీరువాలోనే ఉన్నాయంటూ ప్రభావతి వెళ్తుంది. అయితే నకిలీ నగలు తెస్తూ ఆమె ఆందోళన చెందుతుంది. వీటిని ఇప్పుడు వీళ్లేం చేస్తారో అని అనుకుంటుంది. నగలు తెచ్చి వాళ్ల మొహాన కొట్టండి అని సత్యంకు చెబుతుంది. దీంతో బాలు ఆవేశంతో ఆ నగలు తీసుకుంటాడు.

మీనా వాటిని చూసి ఇవి కొత్త వాటిలా తళాతళా మెరిసిపోతున్నాయేంటి అని అనుకుంటుంది. బాలులోనూ అదే అనుమానం కలుగుతుంది. తానే పేస్ట్ తో కడిగి దాచానని ప్రభావతి కవర్ చేస్తుంది. తర్వాత బాలు, మీనా వాటిని తీసుకొని బయటకు వెళ్తారు. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది.

షాపులో బాలు, మీనాలకు అవమానం

దీంతో ఆ షాపతను బాలు, మీనాలను అవమానించేలా మాట్లాడతాడు. నకిలీ నగలు తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తారా? ఇలా ఎన్ని షాపుల్లో చేశారు.. పోలీసులకు ఫోన్ చేస్తాం అని అనడంతో బాలు అతనితో గొడవకు దిగుతాడు. మీరే మా నగలను మార్చేశారని బాలు అంటాడు. ఇంతలో షాపు ఓనర్ వస్తాడు. మీనా అతనికి ముందే తెలిసి ఉండటంతో ఈ గొడవ పెద్దది కాకుండా ఆపుతాడు.

ఆవేశంతో రగిలిపోయిన బాలు.. మనోజ్‌పై అనుమానం

ఆ తర్వాత షాపులో నుంచి బయటకు వచ్చిన బాలు ఆవేశంతో రగిలిపోతాడు. ఇది ప్రభావతి పనే అని, ఆమె ఫోన్ చేసి అసలు విషయం తేల్చేస్తానని అంటాడు. కానీ విషయం తెలియకుండా అలా చేయకండి.. ముందు ఇంటికెళ్దాం అంటుంది. సరే అని ఇద్దరూ బయలుదేరుతారు. కారులోనూ బాలు అలాగే ఆవేశంతో ఉంటాడు. ఇంటికి దగ్గరిగా వెళ్లిన తర్వాత మీనాను వెళ్లమని, తాను మనోజ్ గాడి షాపుకి వెళ్లి వాడిని నాలుగు పీకితే అసలు విషయం చెప్పేస్తాడని అంటాడు.

వాడే నగలను అమ్మ దగ్గరి నుంచి మాయం చేసి ఉంటాడు.. లేదంటే ఆమెనే వాడికి ఇచ్చి ఉంటుంది అని బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ మీనా మాత్రం అతన్ని ఆపుతుంది. అమ్మమ్మ ఊరి నుంచి వస్తోంది.. ఇప్పుడీ నగల గొడవ జరిగితే బాగుండదు.. ఆమె వెళ్లిన తర్వాత మాట్లాడదాం అంటూ బాలు చేత బలవంతంగా ఒట్టు తీసుకుంటుంది.

మనోజ్‌పై మండిపడిన ప్రభావతి.. బాలును చూసి వణికిపోతూ..

ఇటు ఇంటి బయట కంగారు పడుతూ నిల్చొన్న ప్రభావతి దగ్గరికి మనోజ్ వస్తాడు. ఇక్కడ ఎందుకు నిల్చొన్నావని అడుగుతాడు. ఆ బాలు గాడు వస్తే తనను ఇంట్లో నుంచి ఎలాగూ గెంటేస్తాడని ఆమె అంటుంది. నీ వల్లే ఇదంతా అంటూ మనోజ్ ను తిడుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి లోనికి వెళ్తారు.

అక్కడ అందరూ సుశీల 75వ పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. బెలూన్లు ఊదుతుంటారు. ఇంతలో బాలు, మీనా రావడంతో వాళ్లను చూసి మనోజ్, ప్రభావతి భయంతో వణికిపోతారు. కానీ మీనా మాత్రం అతన్ని కోపాన్ని నియంత్రించుకోవాలని మరోసారి గుర్తు చేస్తుంది. ఇటు బర్త్ డే కోసం సుశీల వస్తుంది. ఆమెను బాలు రిసీవ్ చేసుకుంటాడు. ఇంటి దగ్గర మీనాతో కాకుండా రోహిణి, శృతితో ప్రభావతి హారతి ఇప్పిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks