గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 549వ ఎపిసోడ్ సత్యం తల్లి సుశీల 75వ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవడం, తనను మెప్పించిన వాళ్లకు తానూ ఓ గిఫ్ట్ ఇస్తానని సుశీల చెప్పడం, దానికోసం ప్రభావతితోపాటు మనోజ్ కక్కుర్తి పడటంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే బాలు మాత్రం బాధలో బయటకు వెళ్లిపోతాడు.
సుశీల బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రభావతికి చురకలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (నవంబర్ 7) ఎపిసోడ్ సుశీల తన 75వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం ఇంటికి రావడంతో మొదలవుతుంది. ఆమెకు అందరూ బర్త్ డే విషెస్ చెబుతారు. ఈ వయసులోనూ ఇంత అందంతో ఎలా మెరిసిపోతున్నారని శృతి ఆమెను అడుగుతుంది. ఇది అందం కాదు.. మీ అందరినీ చూసి సంతోషంతో ముఖం వెలిగిపోవడం అని చెబుతుంది.
ఇక తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో చెబుతూ ప్రభావతికి చురకలు వేస్తుంది. ఇంట్లో పనులు, పొలం పనులు చేయడం వల్లే తాను ఇలా ఉన్నానని, ఏ పనీ చేయకుండా కూర్చున్న చోటికీ అన్నీ తెప్పించుకుంటే 40 ఏళ్లకే ముసలివాళ్లు అవుతారని ప్రభావతిని ఉద్దేశించి సుశీల అంటుంది. అంటే మా మీనా ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటుంది కదా అని బాలు అంటే.. అవును మీనా ఎంత పని చేస్తుందో తనకు తెలుసని సుశీల అంటుంది. అది విని ప్రభావతికి మరింత మండుతుంది.
సుశీల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. మనసుకు నచ్చే గిఫ్ట్ ఇవ్వాలంటూ..
ఇక ఈ సందర్భంగానే సుశీల ఇంట్లో వాళ్లకు పెద్ద పరీక్షే పెడుతుంది. తన బర్త్ డే సందర్భంగా మీరందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారని తెలుసు కానీ.. తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వాళ్లకు తానూ ఓ గిఫ్ట్ ఇస్తానని చెబుతుంది. ఎప్పుడూ మా మధ్య పోటీ పెట్టి గెలిచిన వాళ్లకు గిఫ్ట్ ఇస్తావు కదా బామ్మ అని బాలు అంటే.. ఈసారి కూడా అలాంటిదే ఇస్తానని అంటుంది. దీంతో ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. ఆ గిఫ్ట్ ఏంటి అని అడుగుతుంది. అటు మనోజ్, రోహిణి కూడా గిఫ్ట్ కోసం ఆశ పడతారు.
ప్రభావతి గిఫ్ట్ ఆలోచన.. ఆట పట్టించిన సత్యం
{{/usCountry}}ఇక ఈ సందర్భంగానే సుశీల ఇంట్లో వాళ్లకు పెద్ద పరీక్షే పెడుతుంది. తన బర్త్ డే సందర్భంగా మీరందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారని తెలుసు కానీ.. తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వాళ్లకు తానూ ఓ గిఫ్ట్ ఇస్తానని చెబుతుంది. ఎప్పుడూ మా మధ్య పోటీ పెట్టి గెలిచిన వాళ్లకు గిఫ్ట్ ఇస్తావు కదా బామ్మ అని బాలు అంటే.. ఈసారి కూడా అలాంటిదే ఇస్తానని అంటుంది. దీంతో ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. ఆ గిఫ్ట్ ఏంటి అని అడుగుతుంది. అటు మనోజ్, రోహిణి కూడా గిఫ్ట్ కోసం ఆశ పడతారు.
ప్రభావతి గిఫ్ట్ ఆలోచన.. ఆట పట్టించిన సత్యం
{{/usCountry}}సుశీల ఆ మాట చెప్పినప్పటి నుంచీ ప్రభావతి ఆ గిఫ్ట్ ఏమై ఉంటుంది? డబ్బు ఇస్తుందా? భూమి ఇస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సత్యం రావడంతో మీ అమ్మకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వమని చెబుతుంది. నువ్వేనా ఈ మాట అంటోంది అంటూ ప్రభావతిని సత్యం ఆటపట్టిస్తాడు.
ఆమె మీద ప్రేమతో కాదు.. ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆశ పడుతున్నావని అర్థమైందని ఎగతాళి చేస్తాడు. అంత ప్రేమే ఉంటే కనీసం ఒక్కసారైనా ఆమెకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగావా అని అంటాడు. కానీ ఆమె మాత్రం అత్తయ్యకు మంచి, ఖరీదైన గిఫ్ట్ తీసుకురావాలని సత్యంకు చెప్పి వెళ్లిపోతుంది.
ఆలోచనలో రోహిణి, మనోజ్
అటు మనోజ్, రోహిణి కూడా ఆ రిటర్న్ గిఫ్ట్ కోసం ఆశ పడతారు. బామ్మ ఎప్పుడూ ఇలాగే చేస్తుంది.. అయినా చివరికి బాలుగాడికే గిఫ్ట్ ఇస్తుంది అని మనోజ్ అంటాడు. ఆమె మనసుకు నచ్చే గిఫ్ట్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాడు. తానైతే అమ్మమ్మకు మేకప్ చేయాలని డిసైడయ్యానని, అదే తాను ఇచ్చే గిఫ్ట్ అని రోహిణి చెబుతుంది. అటు మనోజ్ కు ఓ ఆలోచన వస్తుంది. తాతయ్య ఇచ్చిన పగడాల దండ పోయిందని ఆమె బాధపడింది.. మనం అది ఇస్తే ఆమె సంతోషిస్తుంది అనగానే రోహిణి కూడా అలాగే చేద్దామని అంటుంది.
రవి, శృతి గిఫ్ట్ ప్లాన్
మరోవైపు రవి, శృతి కూడా తమ గదిలో కూర్చొని బామ్మకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఆ గిఫ్ట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. తానైతే గ్రానీకి ఓ మంచి సెల్ ఫోన్ ఇవ్వాలని డిసైడైనట్లు శృతి చెబుతుంది. అయితే తాను బామ్మ కోసం కేకు తయారు చేస్తానని రవి అంటాడు. ఆమెకు షుగర్ ఉంది కదా అని అంటే.. ఎగ్ లెస్ కేకులాగా.. తాను షుగర్ లెస్ కేకు చేస్తానని అంటాడు.
సుశీల గిఫ్ట్ కోసం బాలు, మీనా ఆలోచన
కిచెన్ లో వంట చేస్తున్న మీనా దగ్గరికి వెళ్లి బాలు కూడా ఆ గిఫ్ట్ గురించే ఆలోచిస్తుంటాడు. ఇంట్లో ఇప్పటికే అందరూ ఎవరి ప్లాన్ వాళ్లు వేస్తున్నారని, ఆ రిటర్న్ గిఫ్ట్ మనకు వచ్చేలా లేదని మీనాతో అంటాడు. రాకపోతే పోనీ.. ఇంట్లో అందరి కంటే ఎక్కువగా అమ్మమ్మ ప్రేమ మనకు దక్కిందని, అది చాలని మీనా అంటుంది.
అయినా మీరు ఆమె దగ్గరే పెరిగారు కాబట్టి.. ఆమె మనకు ఏం నచ్చుతుందో మీకంటే ఇంకా ఎవరికి బాగా తెలుస్తుంది అని అంటుంది. కానీ బాలు మాత్రం ఇంట్లో ఉంటే తనకు ఆ కవరింగ్ నగల ఆలోచనే వస్తోందని, తాను బయటకు వెళ్లి కేక్ కట్ చేసే సమయానికి వస్తానని చెప్పి బాధతో వెళ్లిపోతాడు.
కామాక్షికి ప్రభావతి ఫోన్.. టీవీ ఇవ్వమని అడిగి..
ఇటు ప్రభావతిలో కక్కుర్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆ రిటర్న్ గిఫ్ట్ దక్కించుకోవాలనుకొని కామాక్షికి ఫోన్ చేస్తుంది. తన అత్తయ్య చెప్పిన విషయం ఆమెకు చెప్పి.. ఆమె ఇచ్చేదాంట్లో నీకు సగం ఇస్తానని, మీ ఇంట్లో అదనంగా ఉన్న ఆ టీవీ ఇవ్వమని అడుగుతుంది. దీంతో కామాక్షి షాక్ తింటుంది.
ఇటు ఇంట్లో అందరూ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతుండగా బాలు కనిపించకపోవడంతో సుశీల అతడు ఎక్కడికెళ్లాడని అడుగుతుంది. మీ పేరు చెప్పి బయట మంచిగా తాగుతూ ఉంటాడని ప్రభావతి నిష్టూరమాడుతుంది. కానీ మీనా మాత్రం.. ఈయన చెయిన్ కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని లోలోపల బాధపడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.